బాహుబలి `దారి’న పోతే … ?

       రాజమౌళి మెగా హిట్ సినిమా  `బాహుబలి’ ఇప్పుడు టాలీవుడ్ లో పెద్ద చర్చకే దారితీసింది!  పరిశ్రమలోని కొందరు అనే మాట ఏమంటే, తీస్తే ఇలాంటి సినిమాలే తీయాలనీ, అప్పుడే పరిశ్రమ హాలీవుడ్ స్థాయికి ఎదుగుతుంది. కాగా, మరో వైపు కేవలం ట్రెండ్ చూసి కాపీ కొడితే, చివరకు మసైపోతారంటూ కొంతమంది భయపెడుతున్నారు. ఇక ముందు సినిమాలు తీసేవారు మరి ఏ సూత్రాన్ని ఫాలో అవ్వాలన్నదే ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో సాగుతున్న చర్చ.

మెగా బడ్జెట్ తో రాజమౌళి అందించిన బాహుబలి సినిమా చూశాక, ఇకపై తీస్తే ఇలాంటి సినిమాలే తీయాలంటూ కొంత మంది నిర్మాతలూ, దర్శకులు తెగ ముచ్చటపడిపోతున్నారు. ఒక ఫార్ములాతో సినిమా సక్సెస్అయితే అలాంటి మూస సినిమాలే రావడం టాలీవుడ్ లో మామూలే. ఉదాహరణగా, ఈ మధ్య కామెడీ హారర్ సినిమాల రిలీజ్ విషయమే తీసుకుందాం. ప్రేమాకథా చిత్రం సక్సెస్ బాట తొక్కగానే అదే ఫార్ములాతో కామెడీ హారర్ సినిమాలు తెరకెక్కాయి. నిర్మాతలు దర్శకుల సంగతే కాదు, పెద్దపెద్ద హీరోయిన్లు కూడా హారర్ కామెడీలవైపు మొగ్గుచూపుతున్నారు.
అయితే, ఇదే ధోరణి బాహుబలికి వర్తిస్తుందా అన్నది ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో జరుగుతున్న చర్చ.
చాలాకాలం క్రిందట, అంటే 1957లో విజయావారు మాయాబజార్ చిత్రం అందించి అద్భుతం సృష్టించారు. మళ్ళీ ఇన్నాళ్లకు రాజమౌళి బాహుబలితో మహా అద్భుతం చేసి చూపించారు. అటు కాసుల వర్షంతో పాటుగా, ఇటు ప్రంశసల వానలో బాహుబలి టీమ్ తడిసిముద్దవుతోంది. అంతమాత్రాన ఇలాంటి సినిమాలే వరసబెట్టి తీయడం మంచిదా, కాదా ? అన్నదే ఇప్పుడు చర్చగా మారింది.

టాలీవుడ్ `స్టామినా’ పెరిగినట్టేనా ?
ఇన్నాళ్లకు బాహుబలి `విరాట్’ రూపంగా భాసిల్లుతోంది. ఇది తెలుగు వాళ్లందరికీ సంతోషమే. అంతమాత్రాన తెలుగు స్టామినా ఆకాశమంత ఎత్తుకు ఎదిగిందని అనుకోవడం పొరపాటే అవుతుందని `ఋషి’ , `ఆంధ్రాపోరి’ సినిమాలకు దర్శకత్వం వహించిన రాజ్ మాదిరాజు అభిప్రాయపడుతున్నారు. బాహుబలి అంటే బాహుబలే, అదే ట్రెండ్ ని గుడ్డిగా ఫాలో అయితే ఇండస్ట్రీకి ఇబ్బందేనంటున్నారు. సోషల్ మీడియాలో ఆయన కామెంట్ చేస్తూ,
`మీరెంత కష్టపడినా కాస్ట్ పెంచగలరేమోకానీ, కలెక్షన్స్ పెంచలేరన్నదే నా ఉద్దేశం. ప్రస్తుతానికి బాహుబలిని చూసి చేతులు కాల్చుకోకుండా యాక్షన్, కామెడీలనే కంటిన్యూ చేయండర్రా బాబులూ… ‘
– అంటూ పోస్ట్ చేశారు.
బాహుబలిని చూసి సినిమా బడ్జెట్ సడన్ గా పెంచడం మంచిదికాదు. భారీ పెట్టుబడులతో నిర్మాతలు ముందుకు వచ్చినా, సాహసం చేయడం ఇండస్ట్రీ హెల్త్ కి మంచిది కాదన్నది సినీ విమర్శకుల భావన. ఒక మాయాబజార్, ఒక బాహుబలి…ఇలా విశ్వవిరాట్ రూప ప్రదర్శనచేసే చిత్రాలు చాలా అరుదుగా వస్తుంటాయి. వాటిని చూసి అదే లేటెస్ట్ ట్రెండ్ అనుకుంటూ దూకుడుగాపోతే చేతులు కాలడం ఖాయమంటున్నారు.

పెద్ద సినిమాలొస్తే ఇండస్ట్రీకి లాభం

అయితే, బాహుబలి వంటి భారీ చిత్రాలు రావడం టాలీవుడ్ కి మంచిదేనని పరిశ్రమ మీదనే ఆధారపడ్డవారు అంటున్నమాట. ఇలాంటి పెద్ద చిత్రాలు విరివిగా వస్తుంటే సినీ పరిశ్రమమీదనే ఆధారపడ్డ వారికి ఉపాధి అవకాశాలు విరివిగా రావడమే కాకుండా నైపుణ్యం పెంచుకునే విషయంలో ఆసక్తి కూడా పెరుగుతుందని అంటున్నారు. దీంతో మరింతగా క్వాలిటీ సినిమాలు టాలీవుడ్ అందించగలుగుతుందన్నది వీరి వాదన.
ఏదిఏమైనా కథ బాగుండాలన్నది అన్ని వర్గాల వారు ఏకగ్రీవంగా చెబుతున్న మాట. ఎన్ని హంగులు పులుమినా తెలుగు ప్రేక్షకుడు మాత్రం కథతోనే సంతృప్తి పడుతుంటాడని ఒక సినీ రచయిత నాతో అన్నమాట.
కొత్తక వింత కాబట్టి, దాన్నే ఫాలో అయిపోదామనుకుంటే మాత్రం ఎదురుదెబ్బలు తప్పవన్నదన్న అభిప్రాయం నిజం కావచ్చు, అలాగే, భారీ చిత్రాల సంఖ్య పెరిగితే, పరిశ్రమ మీద ఆధారపడ్డవారికి లాభసాటన్న వాదన కూడా అర్థం చేసుకోదగినదే, కాకపోతే ఈ రెంటి మధ్య బ్యాలెన్స్ చేసుకుంటూ పోతుంటేనే టాలీవుడ్ మరిన్ని మంచి చిత్రాలను అందించగలదు. రాత్రికి రాత్రి టాలీవుడ్ – హాలీవుడ్ స్థాయికి ఎదగలేదన్నది సత్యం. ఏదో ఒక్క మెగా సినిమాతో హాలీవుడ్ గాటిన టాలీవుడ్ ని కట్టేయలేము. కాకపోతే విజ్ఞతతో మెలగాల్సిన సమయం ఇదేనని మాత్రం చెప్పవచ్చు.
                                                                                                                                                                      – కణ్వస

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close