బాలుకి భార‌త‌ర‌త్న – సాధ్య‌మేనా?

అయిదు ద‌శాబ్దాల సినీ ప్ర‌యాణం. 40 వేల పైచిలుకు పాట‌లు. 25 నంది అవార్డులు. జాతీయ పుర‌స్కారాలు, ప‌ద్మ‌శ్రీ‌, ప‌ద్మ‌భూష‌ణ్ – స‌త్కారాలు. ఇవ‌న్నీ బాలు ప్ర‌తిభ‌కు నిలువుట‌ద్దాలు. ఇప్పుడు బాలుకి భార‌త ర‌త్న ఇవ్వాల‌న్న డిమాండ్ గ‌ట్టిగా వినిపిస్తోంది. బాలు భార‌త‌ర‌త్న‌కి అన్ని విధాలా అర్హుడ‌ని, ఆయ‌న‌లా 40 వేల పాట‌లు పాడ‌డం ఏ గాయ‌కుడికీ సాధ్యం కాద‌ని ప్ర‌ముఖ క‌థానాయ‌కుడు అర్జున్ గ‌ళం ఎత్తిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు బాలుకి భార‌త‌ర‌త్న ఇవ్వాల‌న్న డిమాండ్ మ‌రింత పెరుగుతోంది. ఏపీ సీఎం జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి కూడా బాలుకి భార‌త‌ర‌త్న ప్ర‌క‌టించాల‌ని కేంద్రాన్ని కోరారు. ఈ మేర‌కు ఓ లేఖ కూడా రాశారు.

బాలు అంటే అంద‌రికీ అభిమాన‌మే. బాలు తెలుగు బిడ్డ‌. తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు ఈ విష‌య‌మై.. కేంద్రంపై ఒత్తిడి తెస్తే బాలుకి భార‌త‌ర‌త్న అంద‌డం క‌ష్ట‌మేమీ కాదు. పైగా త‌మిళ జ‌నాలు సైతం బాలుని నెత్తిన పెట్టుకున్న వాళ్లే. బాలు చెన్నైలోనే స్థిర నివాసం ఏర్ప‌ర‌చుకున్నారు. ప‌రిశ్ర‌మ హైద‌రాబాద్ త‌ర‌లి వ‌చ్చినా – ఆయ‌న చెన్నైని వీడ‌లేదు. అందుకే త‌మిళులు `బాలు మా వాడే` అని గ‌ర్వంగా చెప్పుకుంటారు. క‌న్న‌డ‌, మ‌ల‌యాళ చిత్ర‌సీమ‌లు సైతం బాలుని ఓన్ చేసుకున్నాయి. బాలీవుడ్ మాటేమో గానీ, ద‌క్షిణాది రాష్ట్రాల‌న్నీ బాలు వెన‌కే ఉన్నాయి. వాళ్లంతా గ‌ట్టిగా ప‌ట్టుబ‌డితే – బాలుకి భార‌త‌ర‌త్న సాధ్య‌మే. బాలు రాజ‌కీయాల‌కు అతీత‌మైన వ్య‌క్తి. ఏ పార్టీ మ‌నిషి కాదు. కాబ‌ట్టి – ఎవ‌రి నుంచీ పెద్ద వ్య‌తిరేక‌త రాక‌పోవొచ్చు. అయితే తెలుగు వాళ్లు చేసే భార‌త‌ర‌త్న డిమాండుల‌ను కేంద్రం పెద్ద‌గా ప‌ట్టించుకోదు.ఎన్టీఆర్‌కి భార‌త‌ర‌త్న ఇవ్వాల‌ని తెలుగుదేశం ప్ర‌భుత్వం ఎప్ప‌టి నుంచో డిమాండ్ చేస్తోంది. కానీ.. అది కంఠ శోష‌గానే మిగిలిపోయింది. పీవీ న‌ర‌సింహారావుకి భార‌త‌ర‌త్న ప్ర‌క‌టించాల‌ని తెలంగాణ ప్ర‌భుత్వం గ‌ట్టిగా అడుగుతోంది. అది డిమాండ్ గానే మిగిలిపోయింది. మ‌రి ఎస్పీబీ సంగ‌తి ఏమవుతుందో?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రభుత్వ పెద్దల సన్నిహితుల చానల్‌లో మంత్రి వ్యతిరేకత వార్తల అర్థమేంటి..?

తెలంగాణకు చెందిన ఓ మంత్రి రాసలీలలంటూ తెలంగాణ ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితులయిన రియల్ ఎస్టేట్ వ్యాపారి అధీనంలో ఉన్న న్యూస్ చానల్ హంగామా ప్రారంభించడం టీఆర్ఎస్‌లో కలకలం రేపుతోంది.కొద్దీ రోజులుగా ఆ...

కళ్ల ముందు కనిపిస్తున్న ఇళ్లతో టీడీపీ రాజకీయం..!

పేదలకు 30 లక్షల ఇళ్ల పట్టాలిస్తామంటూ హడావుడి చేసిన వైసీపీ సర్కార్... ఏడాదిన్నర గడిచిపోయినా ఆ దిశగా కనీసం అడుగులు వేయలేకపోయింది. ఆ పేరుతో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారన్న అభిప్రాయం...

క్రైమ్ : అత్త – అల్లుడు – వివాహేతర బంధం- హత్య..

సమాజంలో చిత్రమైన నేరాలు అప్పుడప్పుడూ వెలుగుచూస్తూ ఉంటాయి. అలాంటిది హైదరాబాద్‌లో ఒకటి బయటపడింది. ఓ నడి వయసు మహిళ.. ఓ యువకిడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. తాను పెళ్లి చేసుకోలేదు కనుక.. కూతుర్ని...

యుద్ధం మొద‌ల‌వ్వ‌క‌ముందే.. తెల్ల‌జెండా ఊపేసిన ర‌జ‌నీ!

క‌రోనా ఎంత ప‌ని చేసిందో? క‌రోనా వ‌ల్ల సినిమా షూటింగులు ఆగిపోయాయి. సినిమా విడుద‌ల‌లూ ఆగిపోయాయి. ఆఖ‌రికి... ఓ సూప‌ర్ స్టార్ రాజ‌కీయ రంగ ప్ర‌వేశానికీ బ్రేకులు ప‌డ్డాయి. ఆ స్టార్...

HOT NEWS

[X] Close
[X] Close