ఒక్క సినిమాతోనే చిరు స్టామినాని డిసైడ్ చేస్తారా?

ఓడ‌లు బ‌ళ్ల‌వడం, బళ్లు ఓడ‌లు అవ్వ‌డం… ఎక్క‌డైనా కాస్త లేట్ అవుతుందేమో గానీ, చిత్ర‌సీమ‌లో కాదు. ఓ హిట్టుతో `వాడంత తోపు గాడు లేడు` అన్న‌వాళ్లే.. ఒక్క ఫ్లాప్‌తో… `వీడి చాప్ట‌ర్ అయిపోయింది` అనడం ఒక్క ఫిల్మ్ న‌గ‌ర్‌లోనే క‌నిపిస్తుంది. చిరుకీ ఇప్పుడు ఈ విమ‌ర్శ‌లు త‌ప్ప‌డం లేదు.

ఆచార్య ఫ్లాప్ అయ్యింది. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు. ఈ విష‌యంలో డివైడ్ టాకే లేదు. చిరు ఫ్యాన్స్ కూడా.. ఈ సినిమా చూసి పెద‌వి విరుస్తున్నారు. అయితే అక్క‌డితో ఆగ‌డం లేదు. `చిరు ప‌నైపోయింది… స్టామినా త‌గ్గిపోయింది..ఇక సినిమాలు మానేయ‌డం బెట‌ర్‌` అంటూ ఇంకో మెట్టు ఎక్కి, విమ‌ర్శ‌నా బాణాలు ఎక్కు పెడుతున్నారు. చిరు రిటైర్‌మెంట్ తీసుకోవాల‌ని వాళ్ల‌కు వాళ్లే డిక్లేర్లు చేస్తున్నారు. న‌ల‌భై ఏళ్ల ప్ర‌స్థానం.. దాదాపు మూడు ద‌శాబ్దాలుగా నెంబ‌ర్ వ‌న్ స్థానం.. ఇవ‌న్నీ మ‌ర్చిపోయి… ఒక్క ఫ్లాప్ తోనే చిరు స్టామినాని డిసైడ్ చేయ‌డం.. దారుణం.

ఫ్లాపులు ఎవ‌రికి లేవు..? డిజాస్ట‌ర్లు ఎవ‌రికి రావు? దీనికి చిరు అతీతుడేం కాదే..?

దాదాపు తొమ్మిదేళ్ల విరామం త‌ర‌వాత‌.. ఖైదీ నెం.150 సినిమా చేస్తున్న‌ప్పుడు జ‌నం ఏమ‌న్నారు? ఇదే మాట క‌దా.. ఇప్పుడు కూడా చిరు అమ్మ‌డూ – కుమ్ముడూ లాంటి పాట‌ల్లో డాన్సులు చేయ‌డం అవ‌స‌ర‌మా? ఇప్పటికీ రీమేక్ క‌థ‌ల‌నే న‌మ్ముకోవాలా..? ఇంకా గ్లామ‌ర్ హీరోగా క‌నిపించాల‌ని తాప‌త్ర‌య‌ప‌డాలా? అని కశ్చ‌న్ చేశారు. కానీ.. ఆ సినిమా సూప‌ర్ హిట్ ని ఆ కామెంట్లు అడ్డుకోగ‌లిగాయా? అమ్మ‌డూ కుమ్ముడూ అంటూ చిరు బెల్ట్ స్టెప్ వేస్తే.. అంతా బెండైపోయి.. చూస్తూ కూర్చున్నారు. ఈ ఏజ్ లో ఆ గ్రేస్ ఏమిటి? ఇంత గ్యాప్ త‌ర‌వాత వ‌చ్చినా, ప్ర‌జారాజ్యం ఫ్లాప్ త‌ర‌వాత సినిమా తీసినా.. ఆ వ‌సూళ్లేంటి అని ఆశ్చ‌ర్యపోయారు..? చిరు చిరునే… అంటూ కితాబులు ఇచ్చారు. నెంబ‌ర్ వన్ స్థానం ఆయ‌న‌కే మ‌ళ్లీ క‌ట్టబెట్టారు. సైరా ఫ్లాపే. కానీ.. గౌర‌వం మాత్రం పోకుండా చిరు జాగ్ర‌త్త ప‌డ్డారు. ఓ యోధుడి క‌థ‌ని చెప్ప‌డానికి చేసిన ప్ర‌య‌త్నం .. ఆ సినిమా విజ‌యాన్ని ఆర్థిక ప‌ర‌మైన లెక్క‌ల‌తో బేరీజు వేయ‌కుండా అడ్డుకోగ‌లిగింది.

ఇప్పుడు ఆచార్య విష‌యానికొద్దాం. చిరు చేసిన త‌ప్పేమిటంటే.. ఇలాంటి క‌థ‌ని ఎంచుకోవ‌డం అంతే. న‌టుడిగా చిరు ఎక్క‌డా త‌ప్పు చేయ‌లేదు. డాన్సర్ గా ఎక్క‌డా త‌గ్గ‌లేదు. ఒకే ఒక్క సీన్ లో అయినా త‌న కామెడీ టైటింగ్ ఏపాటిదో చూపించ‌గ‌లిగాడు. న‌టుడిగా ఫెయిల్ అయితే అప్పుడు ఎన్ని విమ‌ర్శ‌లు చేసినా.. త‌ప్పులేదు. ఇక్క‌డ ఫెయిల్ అయ్యింది. క‌థ‌… అంతే త‌ప్ప హీరో కాదు. ఆ మాట‌కొస్తే… ఇందులో ద‌ర్శ‌కుడిగా కొర‌టాల బాధ్య‌త కూడా ఉంటుంది. అలాగ‌ని.. కొర‌టాల‌కు సినిమాలు తీయ‌డం చేత‌కాద‌నే ముద్ర వేస్తారా?

న‌ల‌భై ఏళ్ల ప్ర‌యాణం.. అలు పెరుగ‌ని స్వ‌యం కృషి… ఎంత‌మందికో ఆద‌ర్శ‌ప్రాయ‌మైన జీవితం.. ఎవ‌రికీ సాధ్యం కాని రికార్డులు…

వీట‌న్నింటినీ ఒక్క ఫ్లాప్ తో తుడిచేయాల‌ని చూడ‌డం క‌చ్చితంగా అవివేక‌మే.

చిరు త‌న కాళ్ల‌మీద తాను నిల‌బ‌డిన హీరో. తనంత‌ట తానే న‌డ‌క నేర్చుకుని, ప‌డుతూ, లేస్తూ.. ప‌రుగులు పెట్టిన హీరో.
ఎక్క‌డ ప‌రుగు అందుకోవాలో.. ఎక్క‌డ ప‌రుగు ఆపేయాలో.. చిరుకి మాత్ర‌మే బాగా తెలుసు. ఈ విష‌యంలో ఎవ‌రి స‌లహాలూ సానుభూతులు చిరంజీవికి అవ‌స‌రం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కాంగ్రెస్‌తో కాదు రేవంత్ తోనే బీజేపీ, బీఆర్ఎస్ పోటీ !

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో తాము కాంగ్రెస్ తో కాకుండా రేవంత్ తో పోటీ పడుతున్నట్లుగా రాజకీయాలు చేస్తున్నారు. రేవంత్ ను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని ఏమీ...

ప్రచారంలో పొలిటికల్ గ్లామర్ ఏదీ..?

ఎన్నికలు అనగానే ప్రధాన పార్టీలు సినీ తారల సేవలను ప్రచారంలో ఒకప్పుడు వాడుకునేవి. కానీ, రానురాను ఆ సంప్రదాయం తెరమరుగు అవుతోంది. తమ సేవలను వాడుకొని వదిలేస్తున్నారనే భావనతో ప్రచారాలకు దూరం పాటిస్తున్నారు....

ఎవరీ రామసహాయం రఘురామ్ రెడ్డి..?

ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా రామసహాయం రఘురాం రెడ్డిని హైకమాండ్ ప్రకటించింది.అనేకపేర్లు తెరమీదకు వచ్చినా అనూహ్యంగా అధిష్టానం రామసహాయం పేరును అభ్యర్థిగా ఖరారు చేయడంతో ఈయన ఎవరు అనే చర్చ జోరుగా జరుగుతోంది....

“సివిల్ సర్వీస్” ఇమేజ్ జగన్ పాలనలో డ్యామేజ్ !

సివిల్ సర్వీస్ అధికారి అంటే ఓ గౌరవం.. ఓ మర్యాద. కానీ ఏపీలో సివిల్ సర్వీస్ అధికారులు చేస్తున్న పనులు చూసి.. కోర్టులు కూడా అసలు మీకెవరు ఉద్యోగం ఇచ్చారయ్యా అని అసహనపడాల్సి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close