ఇళ్లు లేదా స్థలం కొనుగోలు చేయాలంటే చాలా మందికి ఓ టాస్క్‌గా ఉండేది.. ఆ స్థలం న్యాయబద్ధత. లీగల్‌గా అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయా.. ప్రభుత్వ నిషేధ జాబితాలో ఉందా.. డబుల్ రిజిస్ట్రేషన్ల లాంటివి ఏమైనా ఉన్నాయా.. అంతిమంగా ఎవరైనా దాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టారా లాంటివి తేల్చుకోవాలి. అలా తేల్చుకోవడానికి చాలా కష్టపడాలి. పొరపాటు జరిగితే మోసపోతారు.
చాలా మంది తెలివిగా.. బ్యాంకులు లోన్లు ఇస్తే చాలని అంతా క్లియర్ గా ఉన్నట్లేనని అనుకుంటారు. ఆ ప్రక్రియ అంతా బ్యాంకుల మీద వేయడానికి లోన్లకు దరఖాస్తు పెట్టుకుంటారు. ఇళ్ల విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు ఓపెన్ ప్లాట్లకు పెద్ద ఎత్తున సమస్యలు వస్తున్నాయి. ప్లాట్లను అమ్ముకోవడానికి చాలా కంపెనీలు.. బ్యాంకు లోన్లు వస్తాయని చెబుతున్నారు. కొన్ని బ్యాంకుల ప్రతినిధులతో పరిచయం చేస్తున్నారు. ఈ క్రమంలో వారు ఇచ్చే డాక్యుమెంట్లు మొత్తం బ్యాంకుల ప్రతినిధులు వెరీఫై చేస్తారు. అన్ని క్లియర్ గా ఉంటేనే రుణం మంజూరు చేస్తారు. అంటే ఓ రకంగా ప్లాట్ కొనుగోలు దారుడు చేయాల్సిన వెరీఫికేషన్ అంతా బ్యాంక్ చేస్తుంది. ఇంకా చెప్పాలంటే నిపుణుల ద్వారానే చేయిస్తుంది.
బ్యాంక్ లీగల్ వెరీఫికేషన్ లో లోపాలు. వెతకలేం. ఎందుకంటే.. బ్యాంకు వ్యవస్థలో నాలుగైదు విభాగాల్లో చెకింగ్ జరుగుతుంది. అందుకే బ్యాంక్ లోన్ మంజూరు అయితే కళ్లకు అద్దుకుని కొనుక్కోవచ్చని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు. ఖాళీ స్థలాల విషయంలో డబ్బులు ఉన్నా.. లీగల్ సమస్యల విషయంలో వెరిఫీకేషన్ కోసం అయినా లోన్ కు వెళ్లడం మంచిదని సలహాలిస్తున్నారు.