అత్యంత పవర్ ఫుల్ అయిన ఐపీఎస్ అనే సర్వీసుకే కళంకం తెచ్చేలా వ్యవహరించిన అధికారులను చట్టం వెంటాడుతోంది. ఆ చట్టం అమలుకే పని చేసిన వారు.. తమ స్వార్థం కోసం.. దాన్ని బలహీనం చేశారు. ఇప్పుడు అనుభవిస్తున్నారు. అలాంటి వారిలో ఒకరు .. ఏపీ ఐపీఎస్ సంజయ్. జగన్ రెడ్డి హయాంలో కీలక పోస్టుల్లో ఉండి.. దోచుకోవాలనుకున్నదంతా దోచుకున్నారు. ఇప్పుడు కేసుల పాలయ్యారు. ఆయనను మూడు వారాల్లో లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించి నాలుగు వారాలు అవుతోంది. అయితే ఆయన జైలుకెళ్లినట్లుగా ఎక్కడా సమాచారం బయటకు రాలేదు. లొంగిపోయాడా లేదా అన్నది మాత్రం తెలియడం లేదు.
మూడు వారాల్లో లొంగిపోవాలని జూలై 31న సుప్రీంకోర్టు తీర్పు
అగ్నిమాపక శాఖ డీజీగా ఉన్నప్పుడు సంజయ్ అవినీతికి పాల్పడ్డారు. ఈ అంశంపై కేసు నమోదు కావడంతో.. ఆయన హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ పొందారు. హైకోర్టులో ప్రభుత్వ వాదన వినకుండానే న్యాయమూర్తి 49 పేజీల తీర్పు ప్రకటించారు. దీనిపై సుప్రీంకోర్టులో పోలీసులు సవాల్ చేశారు. విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. సంజయ్ అవినీతికి పాల్పడినట్లుగా ఆధారాలు అడిగింది. ఒప్పందాలు, చెల్లింపులతో సహా పోలీసుల దర్యాప్తులో తేలిన వాటిని సుప్రీంకోర్టుకు ఇచ్చారు. సంజయ్ బెయిల్ కోసం. ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ ను పెట్టుకున్నారు. అయినా సంజయ్ ముందస్తు బెయిల్ రద్తు చేస్తూ నిర్ణయం తీసుకుంది. మూడు వారాల్లో లొంగిపోవాలని ఆదేశించింది. ఈ తీర్పు వచ్చి నాలుగు వారాలు అవుతోంది.
సంజయ్ లొంగిపోకపోతే కోర్టు ధిక్కరణ
సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత మరో చాయిస్ ఉండదు. ఆగస్టు 21వ తేదీ లోపు లొంగిపోవాల్సి ఉంటుంది. ఆయన జైలుకెళ్లిన తర్వాతనే బెయిల్ కోసం ప్రయత్నించాల్సి ఉంటుంది. కానీ ఇప్పటి వరకూ ఆయన జైల్లో లేదా దర్యాప్తు అధికారి ఎదుట లొంగిపోయినట్లుగా సమాచారం లేదు. ఒక వేళ ఆయన అలా లొంగిపోకపోతే., అది సుప్రీంకోర్టు ధిక్కరణ అవుతుంది. దీన్ని అధికారులు, న్యాయవ్యవస్థ మరింత సీరియస్ గా తీసుకుంటుంది. సర్వీస్ లో ఉండి తప్పు చేసిన ఆయన.. మరిన్ని గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి రావచ్చు.
జగన్ చెప్పిన మాటల్ని విని రోడ్డున పడిన వారిలో మరొకరు !
ఐపీఎస్ పై ఏదో అంశంలో విచారణ చేయించి.. ఆ నివేదికను గుప్పట్లో పెట్టుకుని.. ఆయనను అడ్డగోలుగా ఉపయోగించుకున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. అసలు ఉద్యోగం కన్నా క్రైస్తవ మత ప్రచారంపైనే ఎక్కువ ఆసక్తి చూపించే సంజయ్ ను…. జగన్ అండ్ గ్యాంగ్ ఎలా వాడుకోవాలో అలా వాడుకుంది. అవినీతికి అవకాశం ఇచ్చింది. రాజకీయ ప్రత్యర్థులపై ఆయనను ఉసిగొల్పింది. ఇప్పుడు ఆయన మాత్రం ఇబ్బందులు పడుతున్నారు. జైలుకెళ్లకుండా ఏం చేయాలా అని మథనపడుతున్నారు. కానీ .. ఇప్పటికే చేయి దాటిపోయింది.