రియల్ ఎస్టేట్ కంపెనీలు భూముల యజమానులతో ఒప్పందాలు చేసుకుని ప్రాపర్టీని డెవలప్ చేస్తాయి. అలా డెవలప్ చేసిన తర్వాత ఎవరికెంతో ముందే నిర్ణయించుకుంటారు. భూ యజమానికి 40 శాతం ఇవ్వాలనుకుంటే.. మొత్తం ఎన్ని ఫ్లాట్లు..ఏఏ ఫ్లోర్లు అన్నది మొత్తం వివరంగా రాసుకుంటారు. ఒక ల్యాండ్‌లార్డ్ తన భూమిపై 10 ఫ్లాట్ల బిల్డింగ్ నిర్మించడానికి డెవలపర్‌తో ఒప్పందం చేసుకుంటాడు. ఒప్పందం ప్రకారం, ల్యాండ్లార్డ్కు 4 ఫ్లాట్లు లభిస్తాయి, మిగిలినవి డెవలపర్‌కు లేదా ఇతర కొనుగోలుదారులకు వెళ్తాయి. ఈ 4 ఫ్లాట్లను ల్యాండ్‌లార్డ్ అమ్మడాన్ని “ల్యాండ్‌లార్డ్ షేర్ ఫ్లాట్స్ అమ్మకం” అంటారు.
తమ షేర్ మటుకు రియల్ ఎస్టేట్ కంపెనీ అమ్మేసుకుంటుంది. కావాలంటే భూయజమానికి ఇచ్చిన షేర్ కూడా అమ్మి పెట్టి కమిషన్ తీసుకుంటుంది. ఆ కమిషన్ కూడా ఇవ్వదల్చుకోకపోతే తానే ఇతర మార్గాల ద్వారా అమ్ముకుంటాడు. హైదరాబాద్ నిర్మాణం అవుతున్న అనేక ప్రాజెక్టుల్లో ల్యాండ్ లార్డ్ షేర్ కూడా అమ్మకానికి ఉంటాయి. సహజంగా ఇవి అసలు బిల్డర్ చెప్పే రేటు కన్నా తక్కువే ఉంటాయి. అయితే రేటు ఒక్కటే చూసి కొనకూడదు. చాలా అంశాలను పరిశీలించారు.
అయితే ఈ ఫ్లాట్లు కొనుగోలు చేసేటప్పుడు జాయింట్ డెవలప్మెంట్ ఒప్పందం, టైటిల్ డాక్యుమెంట్లు, ల్యాండ్‌లార్డ్ యాజమాన్య హక్కులను జాగ్రత్తగా పరిశీలించాలి. ఒక కొనుగోలుదారు డెవలపర్ నుండి లేదా మార్కెట్లో పూర్తి యాజమాన్య హక్కుతో ఫ్లాట్‌ను కొనుగోలు చేస్తాడు. ఇందులో భూమి మాత్రమే కాదు నిర్మాణం కూడా ఉంటుంది. ల్యాండ్లార్డ్కు జాయింట్ డెవలప్మెంట్ ఒప్పందం ద్వారా లభించిన ఫ్లాట్లు కాబట్టి నాణ్యత పరిశీలన కూడా అవసరం.
ల్యాండ్‌లార్డ్ షేర్ ఫ్లాట్స్ అమ్మకం అనేది ల్యాండ్‌లార్డ్ తన భూమి వాటా ఆధారంగా పొందిన ఫ్లాట్లను అమ్ముతారు. ఇది తక్కువ ధరలో లభించే అవకాశం ఉన్నప్పటికీ, చట్టపరమైన సమస్యలు లేకుండా చూసుకోవాల్సి ఉంటుంది.