జగన్ వైద్యఆరోగ్యశాఖను నేరుగా పర్యవేక్షిస్తే ఇలాగే ఉంటుందా..?

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చాలా డేరింగ్ స్టేట్‌మెంట్లు ఇచ్చారు. వాటిలో ఒకటి.. వైద్య ఆరోగ్య శాఖకు మంత్రి ఉన్నప్పటికీ.. ప్రధానంగా తానే పర్యవేక్షిస్తానని ప్రకటించారు. పేదలకు మెరుగైన వైద్యం అందేలా.. చూస్తానన్నారు. హాస్పిటల్‌లో ఎలుకలు కొరకడం.. కరెంట్ పోవడం… వైద్యం అందకపోవడం వల్ల మరణించడం అనే మాటలే ఇక వినిపించకూడదన్నారు. అది జరిగి పదిహేను రోజులైపోయింది. కానీ.. నిజంగా ఏం జరుగుతోంది..?

అనంత ఆస్పత్రిలో చిన్నపిల్లల మృత్యుఘోష..! పట్టించుకునేవారేరీ..?

అనంతపురం సర్వజనాసుపత్రిలో.. ఎప్పుడూ లేని విధంగా చిన్న పిల్లలు మరణిస్తున్నారు. గత పది రోజులుగా… ఈ పరిస్థితి మరీ తీవ్రంగా ఉంది. ఇరవై మంది శిశువులు ప్రాణాలు కోల్పోయారు. రోగులు తీవ్రంగా ఆందోళన చెందుతూండటంతో.. హుటాహుటిన వైద్య మంత్రి ఆళ్ల నాని అనంతపురం ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ వైద్యులు, సిబ్బంది… ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో.. రోగులు… మంత్రిగా చెప్పారు. నిర్లక్ష్యానికి నిలువుటద్దంలా ఆస్పత్రి మారిందని.. పట్టించుకునేవారు లేరని.. రోగులు.. ఎంత మొత్తుకున్నా.. మంత్రులు, ప్రజాప్రతినిధులు.. వచ్చి.. గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయని.. మేం మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి వెళ్లిపోయారు. విమర్శలు వచ్చే సరికి ఓ కమిటీని నియమించారు.

తిరుపతిలో స్ట్రెచర్ లేక రోగి మృతి..! ఇంత ఘోరమా..?

తిరుపతి రుయా ఆసుపత్రిలో మానవత్వానికి మచ్చలాంటి ఘటన జరిగిందగి. వైద్యం కోసం వచ్చిన వ్యక్తిని తరలించేందుకు స్ట్రెచర్ లేకపోవడంతో … రోగి మృతి చెందాడు. బాబు అనే వ్యక్తి జ్వరంతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరాడు. పరిస్ధితి విషమించడంతో .. ఐసీయూ తరలించాలంటూ వైద్యులు సూచించారు. అయితే రోగిని తీసుకెళ్లేందుకు స్ట్రెచర్ కోసం అరగంట పాటు బంధువులు ఆసుపత్రి అంతా తిరిగారు. దొరకలేదు. ఎలాగోలా తీసుకెళ్దామని అనుకునేలోపే అతను మృతి చెందాడు. ఆస్పత్రిని కలెక్టర్ తనిఖీ చేసి వెళ్లిన కొద్దిసేపటికే ఈ ఘటన జరిగింది. ఇక్కడా అధికారుల నిర్లక్ష్యమే కారణం. నిధులు.. నియామకాలు కాదు. కేవలం.. ఉద్యోగుల్లో పెరిగిన నిర్లక్ష్యంమే కారణం.

కరెంట్ లేక విజయవాడ ఆస్పత్రి ఐసీయూలో ఇద్దరు మృతి..!

గత వారం.. విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో గంటల తరబడి కరెంట్ నిలిచిపోవడం వల్ల.. ఇద్దరు రోగులు ఐసీయూలో మృతి చెందారు. తీవ్ర అస్వస్థతతో ఐసీయూలో ఉన్నప్పటికీ… కరెంట్ సౌకర్యాన్ని ఉన్నపళంగా పునరుద్ధరించలేకపోయారు. జనరేటర్ చెడిపోయిందన్న కారణం చెప్పి లైట్ తీసుకున్నారు. దాంతో రెండు ప్రాణాలు బలి.

ఇవన్నీ సీఎంకు అవమానం కాదా..?

అధికారులు ఎన్ని కారణాలైనా చెప్పొచ్చు.. వారి పరిస్థితి విషమంగా ఉందని… లైట్ తీసుకోవచ్చు. కానీ ఆస్పత్రికి ఎవరైనా బాగోలేకనే వస్తారు. అందుకే… వారిని జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. నిర్లక్ష్యం వల్ల ప్రాణాల మీదకు తెస్తే .. మొదటికే మోసం వస్తుంది. ముఖ్యమంత్రి ప్రత్యక్ష పర్యవేక్షణ చేస్తానన్న వైద్య ఆరోగ్య శాఖలో పరిస్థితి ఇలా నానాటికి నాసిరకంగా మారితే.. అది సీఎంకే చిన్నచూపు..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప కోర్టు తీర్పుపై న్యాయవర్గాల్లో విస్మయం !

వివేకా హత్య కేసులో మాట్లాడుతున్నారని ఎవరూ మాట్లాడవద్దని ఆర్డర్స్ ఇవ్వాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కోర్టుకెళ్లారు. కోర్టు అయన కోరినట్లుగా ఎవరూ మాట్లాడవద్దని ఆదేశాలిచ్చింది. ఆ ఆదేశాలు... అందులో ఉన్న పదజాలం చూసి...

హ్యాపీ బర్త్ డే : ఏపీ నీడ్స్ చంద్రబాబు !

చంద్రబాబునాయుడు .. అభివృద్ధి రాజకీయాలు, యువతకు ఉపాధి, టెక్నాలజీ విషయాల్లో ప్రభుత్వాలు చొరవ తీసుకుంటే అద్భుతాలు చేయవచ్చని నిరూపించిన నాయకుడు. ఆయనను అరెస్టు చేసి జైల్లో పెట్టినప్పుడు......

ప్రశాంత్ కిషోర్‌పై జగన్ తరహాలోనే దీదీ ఆక్రోశం !

టీడీపీ, బీజేపీలను గెలిపించేందుకే ప్రశాంత్ కిషోర్ పని చేస్తున్నారని మమతా బెనర్జీ ఆరోపించినట్లుగా ఓ వీడియోను వైసీపీ హైలెట్ చేస్తోంది. కానీ ఆయన క్షేత్ర స్థాయిలో వర్క్ చేయడం లేదని.. కేవలం...

సజ్జల రాజీనామా చేస్తే ఏమవుతుంది !?

ఏపీలో సలహాదారులకు కూడా కోడ్ వర్తిస్తుందని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికల కమిషన్‌ నిబంధనల ప్రకారం ప్రభుత్వ సలహాదారు రాజకీయ వ్యవహారాలు మాట్లాడేందుకు వీలు లేదు. అయినా సజ్జల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close