బీసీ నినాదానికి జగన్ మంగళం..?

ఎన్నిక‌ల వ‌ర‌కు స్పీచ్ మొద‌లుపెడితే కుల, మ‌త భేదం లేకుండా ప‌నిచేశాన‌ని… ప‌ద‌వులిచ్చాన‌ని, బీసీల నినాదంతో ముందుకు సాగిన జ‌గ‌న్ యూట‌ర్న్ తీసుకున్నారు. ఎన్నిక‌ల్లో ఘోర ఓట‌మి త‌ర్వాత వ‌రుస‌గా నేత‌ల‌తో భేటీ అవుతున్న జ‌గ‌న్, తాజాగా పార్టీ ఎంపీల‌తో స‌మావేశం అయ్యారు.

రాష్ట్రంలో అధికారంలోకి వ‌చ్చిన కూట‌మే… దేశంలో అధికారంలో ఉన్న నేప‌థ్యంలో భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ‌పై చర్చించారు. ఎన్నిక‌ల్లో ఓట‌మికి గ‌ల కార‌ణాలు, రాబోయే రోజుల్లో వైసీపీ ఏం చేయాల‌న్న అంశంపై చ‌ర్చించారు.

అయితే, లోక్ స‌భ‌-రాజ్య‌స‌భ‌లో పార్టీ లీడ‌ర్లుగా త‌న సామాజిక‌వ‌ర్గానికే జ‌గ‌న్ పెద్ద‌పీట వేసుకున్నారు. బీసీల నేత‌గా ఉన్న ఆర్.కృష్ణ‌య్య‌, బీద మ‌స్తాన్ వంటి వారిని కాద‌ని… విజ‌య‌సాయిరెడ్డికి ఛాన్స్ ఇచ్చారు. ఇటీవ‌ల జరిగిన ఎన్నిక‌ల్లో నెల్లూరు నుండి పోటీ చేసి దారుణ ప‌రాభవం పొందిన సాయిరెడ్డి వైపే జ‌గ‌న్ మొగ్గుచూపారు. ఇక లోక్ స‌భ‌లో పార్టీ లీడ‌ర్ పెద్దిరెడ్డి త‌న‌యుడు, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని ప్ర‌క‌టించారు. మొత్తం పార్ల‌మెంట‌రీ పార్టీ నేత‌గా వైవీ.సుబ్బారెడ్డిని ప్ర‌క‌టించారు. అంటే మూడు కీల‌క‌మైన పోస్టుల‌కు ఒకే వ‌ర్గానికే క‌ట్ట‌బెట్టారు.

త్వ‌ర‌లో జ‌గ‌న్ కేసులపై విచార‌ణ స్పీడ్ అందుకునే అవ‌కాశం ఉంద‌న్న ప్ర‌చారం నేప‌థ్యంలో…త‌న‌కు కావాల్సిన వారికే ప‌ద‌వులు క‌ట్ట‌బెట్ట‌డం ఇప్పుడు చర్చ‌నీయాంశంగా మారుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తననూ లెక్కేసుకోవాలంటున్న రమణదీక్షితులు

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి రమణదీక్షితులుఓ విన్నపం చేశారు. సోషల్ మీడియాలో ఈ విన్నపం చేసుకున్నారు. గత ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులన్నింటినీ లిస్టవుట్ చేసుకుని తీసేయాలని నిర్ణయం తీసుకున్నారు కాబట్టి.. ఆ...

ఫ్లాష్ బ్యాక్‌: జ‌మున‌ని ఎందుకు బ్యాన్ చేశారు?

కొన్నేళ్ల క్రితం ప్ర‌కాష్‌రాజ్‌ని 'మా' అసోసియేష‌న్ బ్యాన్ చేసిన సంగ‌తి ఇప్ప‌టికీ ఏదో ఓ సంద‌ర్భంలో త‌ల‌చుకొంటుంటాం. ఆ త‌ర‌వాత ఏ న‌టుడ్నీ అలా బ్యాన్ చేయ‌లేదు. కానీ ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్తే......

టీడీపీ క్యాడర్‌పై కేసుల ఎత్తివేత !

జగన్ రెడ్డి జమానాలో ఎఫ్ఐఆర్‌ల విప్లవం నడిచింది. నిజమైన రౌడీలు, ఖునీకోరులు హాయిగా తిరుగుతూంటే... టీడీపీ కార్యకర్తలు మాత్రం సోషల్ మీడియాపోస్టులు పెట్టినా వేధింపులు ఎదుర్కొన్నారు. కేసుల పాలయ్యారు. టీడీపీ అధికారంలోకి...

సీఐడీ మాజీ డీజీపై క్రమశిక్షణా చర్యలు ?

విధి నిర్వహణలో తప్పుడు పనులు చేయడమే కాకుండా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న మాజీ సీఐడీ డీజీ పీవీ సునీల్ కుమార్ పై క్రమశిక్షణా చర్యలకు రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. రఘురామ చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close