చైతన్య : జగన్ కొట్టే దెబ్బ ఇండస్ట్రీకి కాదు మెగా ఫ్యామిలీకే !

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఓ వైపు పవన్ కల్యాణ్ ఫైరవుతూంటే మరో వైపు అల్లు అరవింద్ మీరే కాపాడాలని వేడుకుంటున్నారు. వీరు మెగా ఫ్యామిలీలో భాగమే. ఓ వైపు నిర్మాతలు వెళ్లి చర్చలు జరిపి వస్తూంటే మరో వైపు ఇలా అరవింద్ ఎందుకు ప్రాథేయపడుతున్నారు..? పవన్ కల్యాణ్ ఎందుకు మండిపడుతున్నారు..?. వీటి వెనుక చాలా లోతైన అర్థం ఉంది. అదేమిటంటే.. జగన్ తీసుకున్న నిర్ణయాలు ..తీసుకోని నిర్ణయాలు అన్నీ మెగా ఫ్యామిలీని ఆర్థికంగా గట్టి దెబ్బ కొట్టేవే.

పెద్ద సినిమాలను దెబ్బకొట్టేలా ఏపీ ప్రభుత్వం నిర్ణయాలు !

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు కేవలం పెద్ద సినిమాలను మాత్రమే ఇబ్బంది పెడతాయి. ఇండస్ట్రీలో పెద్ద హీరోలుగా ఉన్న చిరంజీవి, పవన్ కల్యాణ్, మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్, బాలకృష్ణ వంటి హీరోల సినిమాలకు మాత్రమే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు నష్టం చేస్తాయి. వారి సినిమాలకు మాత్రమే బెనిఫిట్ షోలు ఉంటాయి. టిక్కెట్ రేట్లను పెంచాల్సిన అవసరం ఉంటుంది. అదనపు షోలు కూడా వారి సినిమాలకే అవసరం అవుతాయి. ఇతర హీరోలు ఇంకా ఆ స్థాయికి చేరుకోలేదు. వారికి మామూలుగా రిలీజ్ అయి నాలుగు షోలు హౌస్ ఫుల్ అయితే వారికి సక్సెస్ లభించినట్లే. ప్రస్తుత పరిస్థితుల్లో నాగార్జున, వెంకటేష్ వంటి వారికి కూడా బెనిఫిట్‌షోలు వేసే పరిస్థితి లేదు. టిక్కెట్ రేట్లు పెంచితే చూసేందుకు ఫ్యాన్స్ కూడా రారు.

ఆ అరడజన్ హీరోల్లో నలుగురు మెగా హీరోలు !

పైన చెప్పుకున్న అరడజన్ టాప్ హీరోల్లో నలుగు మెగా క్యాంప్ హీరోలు, మహేష్ బాబు, బాలకృష్ణ కాకుండా చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జన్ ఒకే కుటుంబానికి చెందిన వారు. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం టిక్కెట్ రేట్లు తగ్గించేస్తే ముందుగా నష్టపోయేది వాళ్లే. అదనపు షోలకు అనుమతి ఇవ్వకుండా బెనిఫిట్ షోలకు పర్మిషన్ఇవ్వకుడా ఆపేస్తే ఆ మేరుక మెగా హీరోలకు లాస్అవుతుంది. అందుకే కోసమే పవన్ మాట్లాడారని బలంగా వాదించే వారు కూడా ఉన్నారు. లాభనష్టాలు నిర్మాతలకు మాత్రమే దక్కుతాయి. కానీ సినిమా వ్యాపారం మీదే హీరోల రెమ్యూనరేషన్ ఆధారపడి ఉంటుంది.

వ్యాపారం తెలుసు కాబట్టే బతిమాలుకుంటున్న అల్లు అరవింద్ !

జనసేన అధినేతకు ఆవేశం ఉంది . కానీ వ్యాపారం లేదు. అల్లు అరవింద్‌కు ఆవేశం ఉండొచ్చు కానీ వ్యాపారం కూడా ఉంది. ఆయన కుటుంబం మొత్తాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన కాళ్ల బేరానికి వెళ్లిపోయారు. రక్షించాలంటూ వేడుకున్నారు. ఆయన మాట్లాడేది ఆన్ లైన్ టిక్కెట్ల గురించి కాదు. నాలుగు షోలకు పర్మిషన్ ఇవ్వడం.. వంద శాతం ఆక్యుపెన్సీకి చాన్సివ్వడం .. వంటివాటి గురించి. నిజానికి అవి సినిమా వాళ్లకు హక్కుల్లాంటివి. వాటి కోసం ఆయన బతిమాలుకుంటున్నారు.

గతంలో నంది అవార్డుల వివాదం వచ్చినప్పుడు ఇండస్ట్రీలో మాది సగం అని బన్నీ వాసు అనే మెగా క్యాంప్ నిర్మాత గొప్పలు పోయారు. ఇప్పుడు ఆ గొప్పలే తిప్పలు పెడుతున్నాయి. దాన్ని కాపాడుకోవడానికి కాళ్ల బేరానికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చిలుకూరుకు పోటెత్తిన భక్తులు…ఫుల్ ట్రాఫిక్ జామ్

కోరిన కోరికల్ని తీర్చే సుప్రసిద్ధ చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తారు. ఆలయ సిబ్బంది అంచనా వేసిన దానికంటే పది రేట్లు ఎక్కువగా రావడంతో క్యూలైన్లు అన్ని నిండిపోయాయి. ఆలయానికి...

అచ్చెన్నాయుడు అన్నీ అలా కలసి వస్తున్నాయంతే !

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు అన్నీ అలా కలసి వస్తున్నాయి. ఆయన ప్రత్యర్థి .. దువ్వాడ శ్రీనివాస్.. భార్య చేతిలోనే పదే పదే ఓడిపోతున్నారు. తాజాగా మరోసారి ఆయన భార్య రంగంలోకి దిగారు....

‘పారిజాత ప‌ర్వం’ రివ్యూ: సినిమా తీయ‌డం ఓ క‌ళ‌!

Parijatha Parvam movie review తెలుగు360 రేటింగ్: 1.5/5 'కిడ్నాప్ చేయ‌డం ఓ క‌ళ‌'... అనే కాన్సెప్ట్‌తో రూపొందించిన చిత్రం 'పారిజాత ప‌ర్వం'. దాన్ని బ‌ట్టి ఇదో కిడ్నాప్ క‌థ‌ అని ముందే అర్థం చేసుకోవొచ్చు....

ఉద్యోగం ఊస్టింగ్ ? వెంకట్రామిరెడ్డి ఇక జగన్ సేవకే.. !

ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘం నేత వెంకట్రామిరెడ్డిని సస్పెండ్ చేసింది ఈసీ. ఆయన వైసీపీ కోసం ఎన్నికల ప్రచారం చేయడంతో నిర్ణయం తీసుకుంది. అంతే కాదు ఆయనను అమరావతి దాటి వెళ్లవద్దని ఉత్తర్వులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close