మారుతి… హీరోను మార్చుతున్నాడా?

అక్కినేని నాగ‌చైత‌న్య‌తో `శైల‌జా రెడ్డి అల్లుడు` చేసిన త‌ర్వాత మారుతి ఇంకే సినిమానూ మొద‌లుపెట్ట‌లేదు. నాని హీరోగా ఓ సినిమా ఉంటుంద‌ని అప్ప‌ట్లో బాగా టాక్స్ వ‌చ్చాయి. వారిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చి, సూప‌ర్ స‌క్సెస్ సాధించిన `భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌` సీక్వెల్ చేస్తార‌ని కూడా అప్ప‌ట్లో మాటలు వినిపించాయి. అయితే ఆ ప్రాజెక్ట్ ఇప్పుడ‌ప్పుడే ఉండే దాఖ‌లాలు క‌నిపించ‌డం లేదు. మారుతి ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌డానికి నానికి ఇంకా స‌మ‌యం ప‌ట్టేట్టుంది. నాని ప్ర‌స్తుతం `జెర్సీ`తో బిజీగా ఉన్నారు. ఇందులో ఆయ‌న క్రికెట‌ర్‌గా క‌నిపిస్తారు. ఆ త‌ర్వాత ఆయ‌న విక్ర‌మ్‌కె కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయాలి. ఈ సినిమా త‌ర్వాత గౌత‌మ్ మీన‌న్ సినిమా ఉంది. సో మారుతి క‌నుక నానిని న‌మ్ముకుని కూర్చుంటే ఇప్ప‌ట్లో మారుతి ప‌రిస్థితి ఖాళీగా ఉండ‌ట‌మే. ఆ విష‌యాన్ని గ్ర‌హించిన మారుతి వెంట‌నే సాయిధ‌ర‌మ్‌తేజ్‌కు షిఫ్ట్ అయిన‌ట్టు తెలుస్తోంది. త్వ‌ర‌లోనే సాయిధ‌ర‌మ్‌తేజ్ హీరోగా మారుతి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా ఉండ‌నుంద‌ని ఫిల్మ్ న‌గ‌ర్ టాక్‌. సో… మారుతి త‌న హీరోను మార్చుతున్నాడ‌న్న‌మాట‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

ట్రబుల్ షూటర్… ట్రబుల్ మేకర్ అవుతున్నారా?

14... ఇది లోక్ సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్. అందుకు తగ్గట్టుగానే ప్రచారం చేపడుతున్నారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతను తనే తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో...

కేసీఆర్‌కు సమాచారం ఇచ్చింది చెవిరెడ్డేనా ?

తెలంగాణలో 8 నుంచి 12 లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుదంటూ కేసీఆర్ చేసిన ప్రిడిక్షన్ వైరల్ అవుతోంది. అదే సమయంలో ఏపీలో జగన్ గెలుస్తారని తనకు సమాచారం వచ్చిందని కూడా ఓ...

ఫ‌హ‌ద్ ఫాజిల్‌పై ‘పుష్ష‌’ ఆశ‌లు

ఆగ‌స్టు 15న 'పుష్ష 2' రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ డేట్ కి ఎప్ప‌టి ప‌రిస్థితుల్లోనూ 'పుష్ష 2' రిలీజ్ చేయాల‌ని టీమ్ మొత్తం అహ‌ర్నిశ‌లూ కృషి చేస్తోంది. ఈ సినిమా విడుద‌ల‌పై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close