తీవ్ర అసంతృప్తిలో ఏపీ చీఫ్ సెక్రటరీ..!?

ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ… నీలం సహానీ తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని.. ఆమె.. మళ్లీ ఢిల్లీ సర్వీసులకు వెళ్లాలనే చేస్తున్నారన్న ప్రచారం అధికారవర్గాలలో చాలా ఎక్కువగా వినిపిస్తోంది. ఎక్కువ కాలం కేంద్ర సర్వీసుల్లో ఉన్న రిటైర్మెంట్ కు ముందు.. చీఫ్ సెక్రటరీగా పని చేశానన్న సర్వీస్ రికార్డు కోసమే… ఏపీకి వచ్చానని… చెబుతూ ఉంటారు. అయితే.. చీఫ్ సెక్రటరీగా ఆమెను ప్రభుత్వం… చట్ట వ్యతిరేక పనుల కోసం ఉపయోగించుకుంటోందన్న అభిప్రాయం తరచూ ఏర్పడుతోంది. దీనికి కారణం… సీఎస్ కు ఇటీవలి కాలంలో కోర్టుల నుంచి హెచ్చరికలు రావడమే. అధికారుల పరంగా ఏ తప్పు జరిగినా.. దానికి సీఎస్ బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే.. ఆమె వారందరికీ బాస్.

రాజధాని తరలింపు విషయంలో.. అలాగే ఇంగ్లిష్ మీడియంలో విషయంలో ..హైకోర్టు… స్పషమైన హెచ్చరికలు ప్రభుత్వానికి చేసింది. తమ ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరిస్తే.. అధికారుల వ్యక్తిగత ఖాతాల నుంచి ఖర్చులు వెనక్కి తెప్పిస్తామని అలాగే… సీబీఐ, ఏసీబీలతో విచారణ జరిపిస్తామని కూడా స్పష్టం చేసింది. అయితే ప్రభుత్వం మాత్రం.. వెనక్కి తగ్గాలనుకోవడం లేదు. జీవోలు విడుదల చేయిస్తోంది. చేస్తేనే పోస్టుల్లో ఉంటారు.. లేకపోతే ఊస్టింగ్ అన్న భావన తెచ్చేయడంతో.. ఏం జరుగుతుందో తెలియక చాలా మంది ఆందోళన చెందుతున్నారు. అదే సమయంలో.. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యూనల్ లో.. సీఎస్ కు వ్యతిరేకంగా రికార్డు నమోదయింది. జాస్తి కృష్ణకిషోర్ విషయంలో తమ ఆదేశాలు పాటించలేదన్న కారణంగా… ఆమెను పిలిపించి వివరణ తీసుకుంటామని… హెచ్చరించింది. అప్పటికప్పుడు.. ఆయనకు జీతం చెల్లించేసినా… నీలం సహాని పై వ్యతిరేకంగా ఓ రిమార్క్ పడినట్లయింది. వివరణ కూడా పంపాల్సిన అవసరం ఏర్పడింది.

తన కెరీర్ లో ఇంత వరకూ… ఎలాంటి వివాదాస్ప నిర్ణయాలు తీసుకోలేదని… క్యాట్ కు … కోర్టులకు వెళ్లాల్సిన అవసరం రాలేదని.. కానీ ఏపీకిలో సీఎస్‌గా బాధ్యతలు చేపట్టిన తరవాత తనపై అన్ని రకాల రిమార్కులు పడుతున్నాయని… నీలం సహాని ఆవేదన చెందుతున్నట్లుగా అధికారవర్గాలు చెబుతున్నాయి. నిజానికి నీలం సహాని సీఎస్ నే కానీ… చేయాల్సిన పనులన్నీ… ముఖ్యమంత్రికి అత్యంత దగ్గరైన అధికారి ప్రవీణ్ ప్రకాషే చేస్తూంటారు. కేవలం తన పేరు ఉపయోగించుకుని కోర్టుల్ని ధిక్కరించడం చేసి.. తనను ఇరికిస్తున్నారన్న అభిప్రాయం సీఎస్‌లో ఉందంటున్నారు. అందుకే… ఇరుక్కుపోక ముందే.. సైడవడం మంచిదన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారని చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ముగ్గురు ఎస్పీలు, కలెక్టర్‌పై వేటు – ఈసీ కఠిన చర్యలు

ఏపీలో ఎన్నికల అనంతర హింసపై ఈసీ కొడఢా ఢుళిపించింది. పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు, శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. తిరుపతి ఎస్పీపై బదిలీ వేటుతో పాటు శాఖాపరమైన విచారణకు ఆదేశాలు...

పవన్ పోటీ చేసిన పిఠాపురంలో బిగ్ డిబేట్ ఇదే..!!

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి పిఠాపురం నియోజకవర్గంనే నెలకొంది. కూటమి గెలుపు అవకాశాలపై ఎంత చర్చ జరుగుతుందో అంతకుమించిన స్థాయిలో పవన్ గెలుపు అవకాశాలపై డిస్కషన్ కొనసాగుతోంది.పవన్ గెలుపు...

కౌంటింగ్‌కు ముందే జీవోల క్లీనింగ్ !

ఏపీ అధికారులు తొందర పడుతున్నారు. ఓ వైపు పోలింగ్ జరిగి తీర్పు ఈవీఎంలలో ఉన్న సమయంలో అనుమానాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ ఆఫీస్ సాఫ్ట్ వేర్ అప్ గ్రేడ్ పేరుతో మూసేస్తున్నారు. ఈ...

ఏపీ పోలీసు అధికారులపై మరో సారి ఈసీ కొరడా రెడీ !

ఏపీలో ఎన్నికల కోడ్ ఉన్నంత వరకూ ఏ చిన్న ఘటన జరిగినా కఠిన చర్యలు తీసుకునేందుకు ఈసీ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలో ఎన్నికల సంఘం ఎదుట ఏపీ సీఎస్, డీజీపీ హాజరయ్యారు. ఏపీలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close