పాకిస్తాన్ ఆర్మీలో ముసలం ప్రారంభమైనట్లుగా విస్తృత ప్రచారం జరుగుతోంది. పాకిస్తాన్ కు యుద్ధాన్ని నెత్తి మీదకు తెచ్చి పెట్టిన ఆర్మీ చీఫ్ మునీర్ ను తప్పించినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఆయనను అరెస్టు చేశారని .. ఆర్మీ బాధ్యతలు తర్వాత స్థానంలో ఉన్న ఆఫీసర్ తీసుకున్నాడని ప్రచారం జోరందుకుంది. అయితే ఈ విషయాన్ని ఎవరూ ధృవీకరించలేదు. మునీర్ ఇప్పటికే తన కుటుంబాన్ని యూకేకు పంపించారు. ఆయన బయట కనిపించడం లేదు .
పాకిస్తాన్ ఆర్మీలో అంతా సింపుల్ గా ఉండదు. ఎవరి ఆధిపత్య పోరాటం వారికి ఉంటుంది. ప్రజాస్వామ్య ప్రభుత్వమే అయినా పాక్ ప్రభుత్వం ఆర్మీకి లొంగి ఉండాల్సింది. అన్ని వ్యవస్థల్లోనూ ఆర్మీ జోక్యం చేసుకుంటుంది. దీంతో ఆర్మీ చీఫ్ మునీర్ మరో ముషారఫ్ లా మారాలనుకుంటున్నారన్న ప్రచారం ఊపందుకుంది. యుద్ధాన్ని రుద్ది..ఆ కారణంతో ప్రధాని షహబాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని రద్దు చేసి..తాను పగ్గాలు చేపట్టాలనుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ కుట్రను గుర్తించే కొంత మంది ఆర్మీ ఉన్నతాధికారులు … ఆయనను తప్పించడానికి ప్రయత్నిస్తున్నారని దానికి ప్రభుత్వం కూడా సహకిస్తోందని అంటున్నారు.
పాకిస్తాన్ ఆర్మీ చేసిన డ్ర్రోన్ దాడులు, మిస్సైళ్ల దాడులపై పాకిస్తాన్ లోనూ అసంతృప్తి వ్యక్తమవుతోంది. భారత్ కు చిన్న నష్టం కలిగించలేకపోగా రెచ్చగొట్టి పాకిస్తాన్ ప్రజలకు మాత్రం తీవ్ర నష్టం కలిగిస్తున్నారన్న అభిప్రాయంతో అక్కడి ప్రజలు ఉన్నారు. అదే సమయంలో పాకిస్తాన్ భారీగా సంపద కోల్పోతోంది.మూడు, నాలుగు ఫైటర్ జెట్లను కోల్పోవడం సంచలనంగా మారింది. అన్ని రకాల సమస్యలూ చుట్టుడుతున్నాయని.. ఇదే సందుగా భారత్ .. పాక్ ఆక్రమిత కశ్మీర్ ను స్వాధీనం చేసుకుంటే.. చేసేదేమీ ఉండదన్న నిస్సహాయత పాకిస్తాన్ లో కనిపిస్తోంది.