‘భోళా శంక‌ర్’ పై ‘పెద్ద‌న్న‌’ ఎఫెక్ట్‌?

ర‌జ‌నీకాంత్ `పెద్ద‌న్న‌` ఇటీవ‌లే… ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. చాలాకాలం త‌ర‌వాత ర‌జ‌నీ త‌న‌స్టైల్ లో చేసిన మాస్ ఎంట‌ర్‌టైన‌ర్ ఇది. అందుకే అభిమానులు చాలా ఆశ‌లు పెట్టుకున్నారు. కానీ ర‌జ‌నీమాత్రం రొడ్డ‌కొట్టుడు సెంటిమెంట్ క‌థ‌తో నిరాశ ప‌రిచాడు. ఇలాంటి సెంటిమెంట్ క‌థ‌లు ఇది వ‌ర‌కు చాలానే వ‌చ్చాయి. ఈ సినిమా తీసిన శివ‌నే… `వేదాళం`లో సిస్ట‌ర్ సెంటిమెంట్ గుప్పించాడు. స‌రిగ్గా అదే క‌థ‌ని అటూ ఇటూ మాచ్చి `పెద్ద‌న్న‌`లా తీశాడు. అది కాస్త ప‌ల్టీ కొట్టింది.

ఈ సినిమా ప్ర‌భావం ఇప్పుడు `భోళా శంకర్ పై ప‌డ‌బోతోందా? అనే అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఎందుకంటే.. `వేదాళం`కి రీమేక్ ఈ సినిమా. పెద్ద‌న్న, భోళా శంక‌ర్‌… రెండూ దాదాపుగా ఒకేలా అనిపిస్తాయి. పైగా రెండు చోట్లా హీరో చెల్లాయి పాత్ర‌లో కీర్తి సురేషే క‌నిపిస్తుంది. ఆ రూపంలో కూడా ప్రేక్ష‌కుల‌కు చూసిన సినిమానే, మ‌ళ్లీ చూస్తున్నాం అన్న ఫీలింగ్ క‌లిగే ప్ర‌మాదం ఉంది. పెద్ద‌న్న‌ని ఆల్రెడీ రిజెక్ట్ చేశారు. మ‌రి… భోళా శంక‌ర్ ప‌రిస్థితి ఏమిటి? పైగా ఈ సినిమా ద‌ర్శ‌కుడు మెహ‌ర్ ర‌మేష్ ట్రాక్ రికార్డు కూడా బాలేదు. త‌న‌కి ఈ సినిమా ఛాన్స్ దొర‌క‌డ‌మే పెద్ద ఆశ్చ‌ర్యం. వేదాళం క‌థ‌లో భారీ మార్పులు చేస్తే త‌ప్ప‌… భోళా శంక‌ర్ వ‌ర్క‌వుట్ కాదు. మ‌రి మెహ‌ర్ ఏం చేశాడో?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మహానాడు : టీడీపీ 6 హామీలతో భవిష్యత్‌కు గ్యారంటీ !

మహానాడులో తెలుగుదేశం పార్టీ ప్రజలకు సంక్షే్మ రంగంలో ఆరు హామీలు ప్రకటించింది. భవిష్యత్ కు గ్యారంటీ పేరుతో మినీ మేనిఫెస్టోని చంద్రబాబు ప్రకటించారు. నిరుద్యోగులకు, మహిళలకు, రైతులకు టీడీపీ...

ఎన్టీఆర్‌ను వైసీపీ స్మరించుకుంది.. చంద్రబాబును తిట్టడానికైనా సరే!

ఎన్టీఆర్ అందరి మనిషి. అయితే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సహజంగానేకొంత మందికి దూరంఅవుతారు. అలా దూరమైన వారు కూడా ప్రత్యేక సందర్భాల్లో దగ్గర చేసుకోక తప్పదు. ఎన్టీఆర్‌ను అలా దగ్గర చేసుకోవాల్సిన ప...

బాలయ్య కోసం కొత్త ప్ర‌పంచం సృష్టిస్తాడ‌ట‌

అ, క‌ల్కి, జాంబిరెడ్డి చిత్రాల‌తో ఆక‌ట్టుకొన్నాడు ప్ర‌శాంత్ వ‌ర్మ‌. ఇప్పుడు హను-మాన్ రూపొందిస్తున్నాడు. తేజా స‌జ్జా క‌థానాయ‌కుడిగా న‌టించిన ఈ చిత్రం త్వ‌ర‌లో విడుద‌ల కాబోతోంది. ఈలోగా నంద‌మూరి బాల‌కృష్ణ‌తో సినిమా చేసే...

అందరికీ బెంచ్ మార్క్ బిల్డింగ్‌లు – ఏపీ జనానికి మాత్రం బటన్లు !

తెలంగాణ ప్రభుత్వం ఓ పెద్ద సెక్రటేరియట్ కట్టుకుంది. కథలు కథలుగా చెప్పుకున్నారు. ఇప్పుడు కేంద్రం పార్లమెంట్ నిర్మించింది.. అంత కంటే ఎక్కువ కథలు చెప్పుకుంటున్నారు. నిజానికి ఈ రెండు నిర్మాణాలూ అవసరం లేదని..దుబారా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close