పేర్ని నాని ఒక్క సారి అయినా అరెస్టు కావాలన్న టార్గెట్ తో ఉన్నారు. తనను అరెస్ట్ చేయండి మహా ప్రభో అని చాలా కాలంగా ప్రభుత్వానికి సంకేతాలు పంపుతూనే ఉన్నారు. దమ్ముంటే అరెస్టు చేయండి అని సవాల్ చేస్తూనే ఉన్నారు. కొన్ని కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించకపోయినా పోలీసులు అరెస్టు చేయలేదు. అందుకే ఇప్పుడు నేరుగా ప్రభుత్వ పెద్దలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు.
పామర్రులో ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆయన మాటలతో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయినా.. టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయినా పేర్ని నానికి ఏం కాదు.కానీ అమాయకులైన కార్యకర్తలే నష్టపోతారు.వారి కుటుంబాలు సమస్యల్లో ఇరుక్కుంటాయి. అసలు కార్యకర్తలు ఎందుకు నరుక్కోవాలో ఆయన చెప్పడం లేదు. సైలెంట్ గా నరికేసుకోవాలంటే..కత్తి పట్టుకుని పేర్ని నాని ఎవర్ని చంపాలనుకుంటే వారింటికి పోవచ్చు. కార్యకర్తలను ఎందుకు బలి చేయాలనుకుంటున్నారో ?
ఈ వ్యాఖ్యలతో పోలీసులు సైలెంట్ గా ఉండే అవకాశం లేదు. నారా లోకేష్ పై కూడా అనుచితంగా మాట్లాడారు. దీంతో పలు చోట్ల కేసులు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. చట్టపరంగా ఆయనపై చర్యలు తీసుకోవడానికి అడ్డంకులు ఉంటాయన్న కారణంగా ఇలా రెచ్చిపోతున్నారు. అదే సమయంలో ఇలా మాట్లాడటానికి ప్రధాన కారణం..జగన్మోహన్ రెడ్డి దగ్గర నమ్మకం పెంచుకోవడమని చెబుతున్నారు. చాలా మంది నేతలు అరెస్టు అవుతున్నా.. పేర్ని నాని అరెస్ట్ చేకపోవడంతో జగన్.. ఆయన లోపాయికారీ రాజకీయాలు చేస్తున్నాడన్న అనుమానానికి వస్తున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే ఓ సారి అరెస్టు కావాలన్న తాపత్రయంతో గీత దాటుతున్నారన్న అనుమానం వ్యక్తమవుతోంది.