జగన్ స్ట్రాటజీని ఫాలో అవుతున్న పీకే !

రాజకీయాల్లోకి రావాలని డిసైడయిన ప్రశాంత్ కిషోర్.. ఏకాఏకిన పార్టీ పెట్టాలని అనుకోవడం లేదు. గతంలో తాను జగన్‌కు సూచించిన స్ట్రాటజీని తాను ఫాలో అవుతున్నారు. ముందుగా పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. బీహార్‌లో లాలూ, నితీష్ పని అయిపోయిందని.. వారు బీహార్‌కు చేసిందేమీ లేదని ప్రజలు ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారన్నారన్నారు. బిహార్ అభివృద్ధి చెందాలంటే సరికొత్త ఆలోచనలు కావాలి. రాష్ట్రాభివృద్ధికి పాటుపడాలనుకునేవారు నాతో కలిసి ముందుకురావాలని ఇతర పార్టీల నేతలకు పిలుపునిచ్చారు.

90 శాతం మంది ప్రజలు బిహార్​లో మార్పు కోరుకుంటున్నారు. అందుకే పాదయాత్రలో వారిని కలుస్తానని ప్రకటించారు. రాజకీయ పార్టీ గురించి పాదాయత్ర తర్వాతే ప్రకటిస్తానన్నారు. మహాత్మ గాంధీ జయంతి పురస్కరించుకుని అక్టోబర్ 2న బిహార్ నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నారు. నేరుగా పార్టీ పెట్టి పాదయాత్ర చేస్తే ఆదారణ లభించకపోతే.. మొదటికే మోసం వస్తుందన్న కారణంగా పీకే ముందు పాదయాత్ర చేసి అ తర్వాత పార్టీని ప్రకటించాలని అనుకుంటున్నట్లుగా భావిస్తున్నారు.

బీహార్‌లో పీకే రాజకీయానికి ఆకర్షితులయ్యే వారుఎంత మంది ఉంటారో తెలియదు కానీ.. ఆయనకు ఏదైనా పార్టీ లేదా గ్రూప్ మద్దతు లభించకపోతే… పాదయాత్ర సక్సెస్ కావడం కష్టమని భావిస్తున్నారు. అందుకే ఆయన పార్టీ ప్రకటన విషయంలో మరింత కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర స్ట్రాటజీని కూడా పీకేనే ఖరారు చేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close