‘క్రాక్‌’.. కాపీ క‌థా..??

ర‌వితేజ క‌థానాయ‌కుడిగా ‘క్రాక్’ తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. గోపీచంద్ మలినేని ద‌ర్శ‌కుడు. మేలో ఈ చిత్రం విడుద‌ల కానుంది. అయితే ఈ సినిమా, త‌మిళ `సేతుప‌తి`కి ఫ్రీమేక్ అనే టాక్ వినిపిస్తోంది. ఆ క‌థ‌కూ.. ఈ క్రాక్ క‌థ‌కూ చాలా ద‌గ్గ‌ర ల‌క్ష‌ణాలు ఉన్నాయ‌ని స‌మాచారం. అయితే.. త‌మిళ సేతుప‌తిని తెలుగులో అధికారికంగా రీమేక్ చేశారు. ‘జ‌య‌దేవ్‌’ పేరుతో విడుద‌లైంది. గంటా శ్రీ‌నివాస‌రావు కుమారుడు గ‌ల్లా జ‌య‌దేవ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన ఈ చిత్రానికి జ‌యంత్ సి.ప‌ర్జానీ ద‌ర్శ‌కుడు. ఆ సినిమా తెలుగులో ఫ్లాప్ అయ్యింది కూడా. జ‌య‌దేవ్ ని తెలుగులో హీరోగా అంగీక‌రించ‌లేక‌పోయార‌నుకోండి… అది వేరే విష‌యం. అయితే ఆ క‌థ‌ని ర‌వితేజ బాడీ లాంగ్వేజ్‌కి స‌రిపోయేలా మార్చుకుని తీస్తున్నార్ట‌. ర‌వితేజ పోలీస్ కథ‌లు చేసిన ప్ర‌తీసారీ హిట్టు ద‌క్కించుకుంటూనే ఉన్నాడు. ఆ సెంటిమెంట్‌తోనే ఈ క‌థ‌కి ప‌చ్చ‌జెండా ఊపాడ‌ట‌. మ‌రి ఫ‌లితం ఎలా ఉంటుందో? సేతుప‌తికీ ఈ సినిమాకీ ఉన్న చుట్ట‌రికం ఏమిటో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com