RRR టికెట్‌… సామాన్యుడికి అందేనా?

నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఏపీలో టికెట్ రేట్లు త‌క్కువ‌ని గోల‌. ఇప్పుడు అది రివ‌ర్స్ అయ్యింది. ఎందుకంటే.. స‌డ‌న్ గా టికెట్ రేట్లు పెరిగాయి. ఆర్‌.ఆర్‌.ఆర్‌కి స్పెష‌ల్ గా ఇచ్చిన వెసులుబాటు వ‌ల్ల‌… టికెట్ రేటు మ‌రింత భారంగా మారింది. మ‌రోవైపు తెలంగాణ‌లోనూ టికెట్ రేట్లు పెంచుకునే వెసులు బాటు ఇచ్చారు. తొలి మూడు రోజులు ఒక‌లా, త‌దుప‌రి 7 రోజులూ మ‌రోలా టికెట్ రేట్లు ఉండ‌బోతున్నాయి. ప‌ది రోజుల్లో రావ‌ల్సిందంతా రాబ‌ట్టుకోవ‌డం సుల‌భం కాబ‌ట్టి, ఆర్‌.ఆర్‌.ఆర్‌కి ఇది క‌చ్చితంగా ప్ల‌స్ పాయింటే. కానీ ఈ రేట్లు సామాన్యుడికి అందుబాటులో ఉంటాయా అనేది ప్ర‌శ్న‌.

తెలంగాణలో తొలి మూడు రోజుల్లోనూ టికెట్ ధ‌ర‌.. మ‌ల్టీప్లెక్స్ లో అయితే 413 రూపాయ‌ల వ‌ర‌కూ ఉంది. సింగిల్ థియేట‌ర్ లో అయితే టికెట్ రేటు 236 రూపాయ‌లు. 4వ రోజు నుంచి సింగిల్ థియేట‌ర్లో 212 రూపాయ‌లు. మ‌ల్టీప్లెక్స్ లో అయితే.. 354 ఉంది. ఏపీలో టికెట్ ధ‌ర కాస్త అందుబాటులో ఉంద‌ని చెప్పాలి. తొలి 10 రోజుల‌కు క‌నిష్టంగా రూ.106 ఉంటే, గ‌రిష్ట ధ‌ర‌… 380 ఉంది.

మ‌రో వైపు ప్రిమియ‌ర్ షోలు, ఫ్యాన్స్ షోల హ‌డావుడి ఉండ‌నే ఉంది. ప్రీమియ‌ర్ షో టికెట్ ధ‌ర‌. 2వేలు. అది ఇంకా పెరిగే అవ‌కాశాలే క‌నిపిస్తున్నాయి. రాధే శ్యామ్ ప్రీమియ‌ర్ షో టికెట్ హైద‌రాబాద్ లో రూ.2,500 ప‌లికింది. ఆర్‌.ఆర్‌.ఆర్ కి ఉన్న హైప్ దృష్టిలో పెట్టుకుంటే.. ప్రీమియ‌ర్ కూడా అంద‌రికీ అంద‌రి ద్రాక్ష‌లానే ఉంది. మామూలు రోజుల్లో ఓ కుటుంబం మొత్తం ఆర్‌.ఆర్‌.ఆర్‌కి వెళ్లాలంటే క‌నీసం 2 వేలు సమ‌ర్పించుకోవాల్సిందే. మల్టీప్లెక్స్ ఎంచుకుంటే ఇంకాస్త భారం అవ్వ‌డం ఖాయం.

మొన్న‌టి వ‌ర‌కూ టికెట్ రేట్లు త‌క్కువ‌గా ఉన్నాయ‌ని బాధ ప‌డిపోయిన‌వాళ్లంతా.. ఇప్పుడేమంటారో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీఆర్ఎస్ కు బిగ్ షాక్…కాంగ్రెస్ లోకి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు..?

పోలింగ్ కు ముందే బీఆర్ఎస్ కు షాక్ ఇవ్వాలని , తమతో టచ్ లోనున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పార్టీలో చేర్చుకుకోవాలని కాంగ్రెస్ భావిస్తోందన్న చర్చ హాట్ టాపిక్ అవుతోంది. చేరికలకు సంబంధించి రాష్ట్ర...

కంచుకోటల్లోనే జగన్ ప్రచారం – ఇంత భయమా ?

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచార సభలు గట్టిగా ముఫ్పై నియోజకవర్గాల్లో జరిగాయి. మొత్తంగా ఏపీ వ్యాప్తంగా 175 నియోజకవర్గాలు ఉంటే.. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత కనీసం యాభై నియోజకవర్గాల్లో...

ఎలక్షన్ ట్రెండ్ సెట్ చేసేసిన ఏపీ ఉద్యోగులు !

ఆంధ్రప్రదేశ్‌లో పోస్టల్ బ్యాలెట్లు ఎవరూ ఎవరూ ఊహించని స్థాయిలో పెరిగాయి. గత ఎన్నికల కంటే రెట్టింపు అయ్యాయి. ఏపీలో మొత్తం దాదాపు 13 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు....

నేటితో ప్రచారానికి తెర…నేతల ప్రచార షెడ్యూల్ ఇలా

మరికొద్ది గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో లోక్ సభ ఎన్నికల ప్రచారం ముగియనుంది. సాయంత్రం 5గంటలలోపే ప్రచారం ముగించాల్సి ఉండటంతో ఆయా పార్టీల అధినేతలు,అభ్యర్థులు మిగిలిన సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా షెడ్యూల్ రూపొందించుకున్నారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close