నాగచైతన్య – సమంత లవ్ స్టోరీ కబుర్లు వింటూ మురిసిపోతోంది టాలీవుడ్. ఈలోగా మరో ప్రేమకథ మొదలైందా? టాలీవుడ్లో మరో హీరో లవ్ లో పడ్డాడా?? అనే ఆసక్తికరమైన చర్చ మొదలైంది. యంగ్ హీరో శర్వానంద్ లవ్‌లో పడ్డాడన్నది ఇండ్రస్ట్రీ టాక్. రామ్ చరణ్ భార్య… ఉపాసన కజిన్‌ని శర్వా ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నాడని టాక్ నడుస్తోంది. రామచరణ్, శర్వా మంచి మిత్రులు. ఉపాసన కజిన్ కూడా శర్వాకి మంచి దోస్త్. వీళ్లంతా ఫ్యామిలీ ఫ్రెండ్స్ లా ఉంటారు. శర్వాకి రామ్ చరణ్ సపోర్ట్ ఉండడంతో ఈ మిత్రులిద్దరూ తోడల్లుళ్లు అయ్యే అవకాశం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. వచ్చే యేడాది శర్వా పెళ్లి జరగబోతోందని జోరుగా టాక్ నడుస్తోంది. అయితే ఇవన్నీ పుకార్లే అని శర్వానంద్ సన్నిహితులు చెబుతున్నారు. శర్వా, ఉపాసన కుటుంబం ఫ్యామిలీ ఫ్రెండ్స్ లా ఉంటారని, ఉపాసన కజిన్ కూడా శర్వాకి మంచి స్నేహితురాలని.. పార్టీలకూ, ఫంక్షన్లకూ వీళ్లు జాయింటుగా కనిపిస్తారు కాబట్టి అదే లవ్ అనుకొని
రూమర్లు పుట్టిస్తున్నారని శర్వా సన్నిహితులు క్లారిటీ ఇస్తున్నారు.
తెలుగు 360.కామ్‌కి ఉన్న స్పష్టమైన సమాచారం ప్రకారం…. శర్వాతో ఆ అమ్మాయికి లవ్ ఎఫైర్ ఉన్న మాట నిజమే అని.. అయితే అది ఇప్పుడు కాదని.. శర్వా ఆ అమ్మాయికి దూరంగా ఉంటున్నాడని చెబుతున్నారు. గత రెండు రోజులుగా వెబ్ మీడియాలో వస్తున్న ఈ వార్తల పట్ల శర్వా అప్ సెట్ అవుతున్నాడట. శర్వా ప్రస్తుతం అయ్యప్ప దీక్షలో ఉన్నాడు. ఆ దీక్ష పూర్తి అయిన వెంటనే వీటిపై ఓ క్లారిటీ ఇవ్వాలని భావిస్తున్నాడని సమాచారం.