శ్రీ‌మంతుడు వివాదం.. డ‌బ్బుల‌తో స‌ద్దుమ‌ణ‌గదా?

అప్పుడెప్పుడో 8 ఏళ్ల క్రితం విడుద‌లైన సినిమా శ్రీ‌మంతుడు. ఆ సినిమాపై అప్ప‌ట్లో పుట్టిన వివాదం ఇప్ప‌టికీ స‌ద్దుమ‌ణ‌గ‌లేదు. స్వాతి మైగ‌జైన్‌లో శ‌ర‌త్ రాసిన క‌థనే కాపీ కొట్టి శ్రీ‌మంతుడు సినిమా తీశార‌ని అప్ప‌ట్లోనే ఆ ర‌చ‌యిత న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించాడు. నాం ప‌ల్లి కోర్టు కొర‌టాల‌పై చ‌ర్య‌లు తీసుకోవాలని పోలీసుల్ని ఆశ్ర‌యించ‌డం, ఆ త‌ర‌వాత కొర‌టాల హైకోర్టుకు, ఆ త‌ర‌వాత సుప్రీంకోర్టుకు వెళ్ల‌డం, అక్క‌డ కూడా కొర‌టాల శివకు చుక్కెదురు అవ్వ‌డంతో ఇక ఈ కేసుని కోర్టు బ‌య‌ట తేల్చుకోవాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డ్డాయి.

శ‌ర‌త్‌కు ఎంతో కొంత ఇచ్చి, ఈ కేసు నుంచి బ‌య‌ట‌ప‌డ‌డ‌మే కొర‌టాల ముందున్న మంచి మార్గం. అయితే అందుకు శ‌ర‌త్ కూడా ఒప్పుకోవ‌డం లేదు. త‌న‌కు డ‌బ్బులు వ‌ద్ద‌ని, క్రెడిట్ మాత్రం కావాల‌ని ఆయ‌న ప‌ట్టుబ‌డుతుండ‌డం విశేషం. అప్ప‌ట్లోనే ర‌చ‌యితల సంఘం ద్వారా కొర‌టాల శివ రూ.15 ల‌క్ష‌ల ప‌రిహారం ఇవ్వ‌డానికి సిద్ధ‌మ‌య్యార‌ని, కానీ త‌న‌కు డ‌బ్బులు తీసుకోవ‌డంలో ఎలాంటి ఆస‌క్తి లేద‌ని, ఆ క‌థ త‌న‌దే అని ఒప్పుకొంటే చాల‌ని శ‌ర‌త్ వాదిస్తున్నారు. కానీ కొర‌టాల మ‌న‌సు అందుకు అంగీక‌రించ‌డం లేదు. క్రెడిట్ ఇస్తే, తన‌పై కాపీ ముద్ర ప‌డుతుంద‌ని, తాను త‌ప్పు చేసిన‌ట్టు అవుతుంద‌న్న‌ది కొర‌టాల ఫీలింగ్. డ‌బ్బుల కోసం కాకుండా.. ఎప్పుడో వ‌చ్చి, వెళ్లిపోయిన సినిమా క్రెడిట్ కోసం ఓ ర‌చ‌యిత ఇంతిలా కష్ట‌ప‌డుతున్నాడంటే.. ఆశ్చ‌ర్య‌మే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తేజూ సిక్స్ ప్యాక్‌

సాయిధ‌ర‌మ్ తేజ్ ఈమ‌ధ్య బాగా బొద్దు చేశాడు. రోడ్డు ప్ర‌మాదం త‌ర‌వాత ఫిజిక్‌ని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. దాంతో స‌హజంగానే లావ‌య్యాడు. `బ్రో` సినిమాకి ముందు కాస్త త‌గ్గాడు. అయితే ఆ త‌ర‌వాతి సినిమాకి...

గన్నవరం ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరు ?

ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఎయిర్ పోర్టుల పేరు మార్పు ప్రతిపాదనలను కేంద్రానికి ఏపీ ప్రభుత్వం పంపింది. విజయవాడ, తిరుపతి, కర్నూలు ఎయిర్ పోర్టుల పేర్లను మార్చాలని సిఫారసు చేశారు. ఈ విషయాన్ని కేంద్ర విమానయాన...

లిక్కర్ వాసుదెవరెడ్డిని దేశం దాటించేశారా ?

ఏపీ లిక్కర్ స్కాంలో అత్యంత కీలకమైన వ్యక్తి వాసుదేవరెడ్డి. ఆయన ఇప్పుడు ఆచూకీ లేరు. ఆయన కోసం ఏపీ ప్రభుత్వం లుకౌట్ నోటీసులు జారీ చేసింది. ఇప్పటి వరకూ ఆయనపై రెండు...

బ్యాక్ టు బెంగళూరు

వైఎస్ జగన్ మళ్లీ సతీసమేతంగా బెంగళూరు వెళ్లిపోయారు. మళ్లీ ఏదైనా హత్య లేదా మృతదేహం రాజకీయం చేయడానికి ఉపయోగపడుతుందనుకుంటే వస్తారేమో కానీ.. ఎప్పుడొస్తారో తెలియదని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. వినుకొండలో రషీద్ అనే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close