‘రాధేశ్యామ్‌’ ల కథ మిస్టీరియస్ ట్రాజడీనా ?

యూరప్ లో ఒక రైలు మిస్టరీ వుంది. 106మంది ప్రయాణికులతో బయలుదేరిన ఓ రైలు ఒక గుహలో వెళ్ళగానే వున్నఫలంగా మాయమైపోయింది. 1926లో ఈ ఘటన జరిగింది. అయితే ఇటలీలో మిస్ అయిన ఈ రైలు చాలా వింతగా మెక్సికో లో కనిపించింది. ఇందులో వింత ఏమిటంటే అప్పటికి ఇటలీకి మెక్సికోకి రైలు మార్గం లేదు. ఇంకో వింత ఏమిటంటే .. ఆదిత్య 369 సినిమా టైపులో ఆ రైలు కనిపించింది 1845లో. అందులో ప్రయాణీకులని మెక్సికో అధికారులు ఎక్కడి నుంచి వచ్చారని ప్రశ్నిస్తే.. ఇటలీ అని చెప్పారు. దీంతో వాళ్ళందరనీ పిచ్చోళ్ళని భావించి మెంటల్ హాస్పిటల్ కి తరలించారు. ఇప్పుడీ మిస్టరీ కథ ఎందుకు చెప్పాల్సివచ్చిందంటే ప్రభాస్ ‘రాధేశ్యామ్‌’ సినిమా కోసం.

ప్రస్తుతం విడుదలకు సిద్ధమౌతున్న భారీ చిత్రాల్లో ‘రాధేశ్యామ్‌’ కూడా ఒకటి. మొదటి నుంచి పిరియాడికల్ సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతుందని చెబుతున్నారే గానీ సినిమా జోనర్ ఏమిటనేదానిపై క్లారిటీ లేదు. ఇటలీలో మిస్సింగ్ ట్రైనర్ నేపధ్యంలో దర్శకుడు రాధ కృష్ణ ఈ పాయింట్ రాసుకున్నాడని కొన్ని రోజులు క్రితం ఇన్ సైడ్ టాక్ వినిపిచింది. ఇందులో వాస్తవం ఏమిటో ప్రస్తుతానికి తెలియదు కానీ ఈ సినిమా ప్రమోషన్ మెటీరియల్ చూస్తుంటే ఈ సినిమాలో ఓ ట్రైన్ ఎపిసోడ్ పక్కా అనిపిస్తుంది.

ఈ సినిమా ఫస్ట్ లుక్ లోనే ట్రైన్ నేపధ్యం చూపించారు. తర్వాత వచ్చిన గ్లిమ్స్ లో రైల్వే స్టేషన్ చూపిస్తూ ప్రభాస్ లుక్ రివిల్ చేశారు. ఇక తాజా వచ్చిన ఫస్ట్ సాంగ్ లో కూడా ట్రైన్ కీలకంగా వుంది. రైలు లో కూర్చున్న పూజా, పక్కనే కార్లో వస్తున్న ప్రభాస్ .. చేయి అందించడం.. చేయి అందుకోగానే రైలు ముక్కలైపోవడం.. కట్ చేస్తే ఇద్దరూ కార్లో ప్రయాణించడం.. ఆ ప్రయాణంలో ఎన్నో మలపులు.. గ్రహాలూ దాటిన ప్రయాణం .. మళ్ళీ చేయి అందుకునే లోపల ఎదో ప్రళయం వచ్చినట్లు విజువల్స్ చూపించారు.

అంతకుముందు ప్రభాస్ పాత్ర విక్రమ్ ఆదిత్యపై రిలీజ్ చేసిన టీజర్ లో కూడా చాలా మిస్టరీ వుంది. హస్త సాముద్రికంలో లెజండ్ గా విక్రమ్ ఆదిత్యని చిత్రీకరించారు. టీజర్ ని బాగా పరిశీలించి చూస్తే .. హస్త సాముద్రికంపై ఆదిత్య రాసిన పుస్తకాలు, అలాగే ఒక మ్యాగిజైన్ కవర్ పేజీలో ‘ఇండియా ఎమర్జన్సీ ని ముందుగానే చెప్పిన వ్యక్తి” అనే హెడ్డింగ్ తో కవర్ పేజీలో ప్రభాస్ ఫోటో .. ఇవన్నీ చూస్తుంటే.. రాధే శ్యామ్ టైమ్ ట్రావెల్ మూవీ అనే సందేహాలు కూడా వస్తున్నాయి. భవిష్యత్ ని ముందే తెలుసుకునే పవర్ వున్న వ్యక్తి చుట్టూ జరిగే కథగా కూడా అనిపిస్తుంది. ఇదే సమయంలో రాధే శ్యామ్ ప్రేమ కథకి కాస్త ట్రాజడీ టచ్ ఉంటుందనే హింట్లు కూడా ఇచ్చారు. మరి రాధే శ్యామ్ అసలు కథ ఏమిటో తెలియాలంటే ఈ సంక్రాంతి వరకూ ఆగాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రజాపోరుపై ఏపీ బీజేపీ ఆశలు !

ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఉనికిచాటుకునేందుకు ఇప్పుడు హడావుడిగా ప్రయత్నిస్తోంది. ప్రజాపోరు సభలతో స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లు పెట్టుకుని గట్టిగానే బలపడేందుకు ప్రయత్నిస్తోంది. ప్రతి ఊరిలో ముఖ్య కూడలిలో ఓ సభ ఏర్పాటు...

ఏపీసీఐడీ కోర్టుకు దొరికిపోయినట్లే – బలి చేసేదెవరిని ?

ఏపీసీఐడీకి కోర్టు జారీ చేసిన షోకాజ్ నోటీసులు ఇప్పుడు పోలీసు వర్గాల్లో సంచలనం రేపుతున్నాయి. జర్నలిస్ట్ అంకబాబును అక్రమంగా అరెస్ట్ చేయడమే కాకుండా కోర్టులో పచ్చి అబద్దాలు ఆడారు. ఇప్పుడు న్యాయస్థానం వాటికి...

ఏపీలో ప్రభుత్వం మారుతుందని షర్మిల నమ్మకం !

ఏపీలో ముఫ్పైఏళ్లు మాదే అధికారం . మేం ఏం చేసినా తిరుగులేదు అనే ఉద్దేశంతోనే వైసీపీ అధినేత విచ్చలవిడి నిర్ణయాలు తీసుకుంటున్నారన్న అభిప్రాయాలు వైసీపీ క్యాడర్‌లో ఉంది. ప్రజాస్వామ్యంలో శాశ్వతం...

రివ్యూ: అల్లూరి

Alluri Movie Telugu Review పోలీస్ క‌థ‌ల్లో ఓ మ్యాజిక్ ఉంటుంది. ఆ క్యారెక్ట‌ర్‌కి జ‌నం క‌నెక్ట్ అయితే.. తెర‌పై ఏం చెప్పినా వింటారు. ఏం చూపించినా చూస్తారు. రొటీన్ క‌థ‌ల‌తో సైతం.. మెస్మ‌రైజ్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close