ఎంత కాదు అన్న వైసీపీలో విజయసాయి హవా నడిచింది, మూడు సంవత్సరాలు ఆయన చెప్పినట్టే జరిగింది. ఆయన చాలా అక్రమాలు చేసి ఉండవచ్చు.. ఒకరకంగా జగన్ ఆర్థిక మూలాలు అన్ని విజయసాయికే తెలిసి ఉంటాయి. ఆయన గనుక ఈ టైంలో వైసిపిలో ఉంటే సజ్జల కంటే ముందు విజయసాయిని టార్గెట్ చేసే అవకాశాలు ఉండేవి. జగన్ ఫైనాన్షియల్ మేటర్స్ అన్నీ కూడా 15 ఏళ్ల విజయసాయికి ఎక్కువగా తెలుసు.
విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్ ను గమనిస్తే.. జగన్ వద్ద తన ప్రాధాన్యత తగ్గించారు అనే దాన్ని హైలెట్ చేయడం, రాజ్ కసిరెడ్డిని టార్గెట్ చేయడమే ఎక్కువగా కనిపించింది. టీడీపీ ఆరోపణలు చేస్తున్నట్టు లిక్కర్ స్కామ్ లో జగన్ పాత్ర గురించి అటు సిట్ అడిగినా, ఇటు మీడియా ప్రతినిధులు అదే పనిగా ప్రశ్నించినా తనకు తెలియదని అధికారులకు, మీడియాకు సమాధానం ఇచ్చారు. వైసీపీ కోసం ఎంతో చేశానని, పార్టీ నేతలు అవమానించడంతో బయటకు వచ్చానని చెప్పిన విజయసాయి రెడ్డికి..జగన్ పై ఎలాంటి కోపం లేదన్నది ఆయన మాటలు స్పష్టం చేశాయి. దీంతో విజయసాయిరెడ్డి ఇంకా జగన్ మనిషే అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇందుకు కారణం లేకపోలేదు.
ఇప్పటికీ విజయసాయిరెడ్డి వైసీపీలో ఉంటే సజ్జల కంటే ముందు ఆయన్నే టార్గెట్ చేసే ఛాన్స్ ఉండేది. ఎందుకంటే జగన్ ఆర్థిక మూలాల గురించి పక్కాగా విజయసాయి రెడ్డికి తెలుసు. ఇవన్నీ ఆలోచించే విజయసాయి తెలివిగా బయటకి వచ్చి ఉండవచ్చు లేదా జగన్ కావాలని పంపించి ఉండొచ్చు అని.. ఇప్పుడు ప్రెస్మీట్లో చెప్పిన మాటలు వింటే అదే అర్థమయ్యేలా ఉందని అంటున్నారు.