షాకింగ్ న్యూస్: భారత్ పై దాడికి ఐసిస్ సైన్యం రెడీ !

ప్రపంచానికి సవాలు విసురుతున్న ఐసిస్ ఉగ్రవాదులు భారత్ లోనూ సైన్యాన్ని తయారు చేసుకున్నారనే వార్త కలకం రేపింది. ఈ సంస్థకు మన దేశంలో దాదాపు 30 వేల మంది సైబర్ సైనికులున్నారనేది ఇంటెలిజెన్స్ సమాచారం. కొన్ని జాతీయ న్యూస్ చానళ్లు ఈ వార్తలను ప్రసారం చేయడం సంచలనం కలిగించింది.

ఇప్పటి వరకూ మన దేశంలో ఈ సంస్థ ప్రభావం పెద్దగా లేదని అంతా భావించారు. రిపబ్లిక్ డే వేడుకులకు ముందు దాదాపు 20 మందిని ఎన్ ఐ ఎ అరెస్టు చేసింది. దీంతో మన దేశంలోనూ ఈ సంస్థ కొంత విస్తరించిందని అనుకున్నారు. కొంత కాదు, కొండంత అని ఈరోజు వార్తా చానల్స్ వార్తలు వెల్డించాయి.

వీరంతా ఆన్ లైన్ లో ఐసిస్ తో కాంటాక్ట్ ఉన్న వారట. వీరికి ఆన్ లైన్లో నే బ్రెయిన్ వాష్ జరిగిందట. ప్రభుత్వానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించి పంపడం, ప్రజల్లో కలిసిపోయి అవసరమైతే దాడికి సిద్ధంగా ఉండటం వీళ్లకు అప్పజెప్పిన పనులు. ఒకవేళ ఏధో ఒక విధంగా ఆయుధాలను సమకూరిస్తే స్వదేశంపైనే యుద్ధం చేయానికి కూడా వీళ్లు సిద్ధమేనట.

ఈ సమాచారంతో నిఘా సంస్థలు ఉలిక్కి పడ్డాయి. ఇలాంటి వారిని ఆకర్షించి ప్రలోభ పెట్టే వెబ్ సైట్లు మరికొందరిని సైబర్ సైనికులుగా మార్చక ముందే మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్వ్కాడ్ దాదాపు 94 వెబ్ సైట్లను బ్లాక్ చేసింది. ఇప్పుడు ఆన్ లైన్ లావాదేవీలు, అతివాద భావజాలంతో ఆన్ లైన్లో తరచూ కనిపించే వారి కోసం ఆరా తీయడం మొదలైంది. వీరిలో కొందరిని పట్టుకున్నా మొత్తం తేనెతుట్టె కదలవచ్చు. అందుకే ఉగ్రవాద వ్యతిరక విభాగాలు, గూఢచార సంస్థలు రంగంలోకి దిగాయి. రిపబ్లిక్ డేకు ముందు ఇన్ ఫార్మర్ సోర్స్ లు, ఆన్ లైన్, ఫోన్ కాంటాక్ట్ లపై నిఘా ద్వారానే పలువురు ఉగ్రవాదులను అరెస్టు చేశారు. పటిష్టమైన నిఘా వ్యవస్థ ఆధారంగా ఈ ముష్కర సైబర్ సైన్యానికి చెక్ పెట్టడం అసాధ్యం కాదంటున్నాయి ఇంటెలిజెన్స్ సంస్థలు.

ఆన్ లైన్ లోకి ఒక్కసారి వచ్చారంటే వారి వివరాలను పట్టుకోవడం సాధ్యమే. ప్రత్యేక వెబ్ సైట్లతో పాటు ఫేస్ బుక్, ఈమెయిల్ ద్వారా వీరు టచ్ లో ఉండొచ్చు. కాబట్టి నిఘా సంస్థలు, యాంటీ సైబర్ క్రైమ్ టీములు కూడా వీరి వేటలో నిమగ్నమయ్యాయని న్యూస్ చానల్స్ వార్తల సారాంశం. ఇదే నిజమైతే మనకు ముప్పు పొంచి ఉన్నట్టే. అప్పుడే ఈ వార్తపై ప్రజలు, ముఖ్యంగా యువకులు పెద్ద సంఖ్యలో తమ అభిప్రాయాలను పోస్ట్ చేశారు. ఇక టెర్రరిజాన్ని ఏమాత్రం ఉపేక్షించ వద్దని, అవసరమైతే నేరుగా దాడులు చేయాలని అభిప్రాయపడ్డారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close