‘ఇస్మార్ట్ శంక‌ర్’ టీజ‌ర్‌: మార్ ముంతా… ఛోడ్ చింతా

పూరి సినిమా అంటే ప‌క్కా మాస్ మ‌సాలా. దాన్ని ఇప్పుడు తెలంగాణ స్లాంగ్‌లో వండి వారిస్తే… ‘ఇస్మార్ట్ శంక‌ర్‌’ త‌యార‌వుతాడు. రామ్ – పూరి కాంబోలో తెర‌కెక్కిన సినిమా ఇది. ఈరోజు రామ్ పుట్టిన రోజు సంద‌ర్భంగా టీజ‌ర్ విడిచిపెట్టారు. రామ్ గ‌త సినిమాల‌తో పోలిస్తే.. పూరి గ‌త చిత్రాల‌తో పోలిస్తే.. ఈ సినిమాలో హీరో ‘డ‌బుల్‌’ మాస్‌గా క‌నిపిస్తున్నాడు. `డ‌బుల్ దిమాఖ్ హైద‌రాబాదీ` అనే క్యాప్ష‌న్‌కి 100 % న్యాయం చేసేలా టీజ‌ర్‌ని క‌ట్ చేశాడు పూరి జ‌గ‌న్నాథ్‌. ఓ ఆవారా హైద‌రాబాదీ చేసే దందా నేప‌థ్యంలో క‌థ సాగుతుంది. పూరి మార్క్ హీరోయిజం, టేకింగ్‌… ఇందులో క‌నిపించాయి. రామ్ గెట‌ప్ కొత్త‌గా ఉంది. ఫుల్లు గెడ్డంతో క‌నిపిస్తున్నాడు. ‘మార్ ముంతా.. ఛోడ్ చింతా’ అనే డైలాగ్ ద‌గ్గ‌ర‌… రామ్‌నైతే అస్స‌లు గుర్తు ప‌ట్ట‌లేం. తెలంగాణ స్లాంగ్‌లో రామ్ డైలాగులు చెప్ప‌డం కూడా ఇదే. దానిపై బాగానే క‌స‌ర‌త్తులు చేసిన‌ట్టు క‌నిపిస్తోంది. రామ్ పుట్టిన రోజు టీజ‌ర్ కాబ‌ట్టి – ఫోక‌స్ అంతా ఆ క్యారెక్ట‌ర్‌పైనే సాగుతోంది. టీజ‌ర్‌లో మంచి మాస్ పాట కూడా పెట్టేశాడు. ట్రైల‌ర్ ఇచ్చేంత కిక్ ఈ టీజ‌ర్‌తోనే వ‌చ్చేసింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close