ఇజ్రాయిల్ పాలస్తీనా వివాదం (పార్ట్-10): యాసర్ అరాఫత్ అను ఒక విరోధాభాసం

1948 లో ఇజ్రాయిల్ ఏర్పడిన తర్వాత అరబ్ దేశాలు ఇజ్రాయిల్ తో పలు మార్లు యుద్ధం చేసిన సంగతి తెలిసిందే. అయితే అరబ్ దేశాలే కాకుండా, పాలస్తీనా వాసులు కూడా తమ ఆశయాల కోసం పెద్ద ఎత్తున పోరాటాలు చేశారు. వీరిని ముందుండి నడిపించింది పాలస్తీనా విమోచన సంస్థ నాయకుడు యాసర్ అరాఫత్. ఒకవైపు పాలస్తీనా కోసం గెరిల్లా యుద్ధాలు చేయిస్తూ, మరొకవైపు దౌత్య పరమైన చర్చలు జరుపుతూ 1994లో నోబెల్ శాంతి బహుమతి ని కూడా పొందిన యాసర్ అరాఫత్ పాలస్తీనా చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన మేధావి నాయకుడు.

ఫతా పార్టీ:

ఈజిప్టులో పాలస్తీనా వాసులకు జన్మించిన అరాఫత్ తర్వాత కాలంలో ఇంజనీర్ అయ్యాడు. ఇంజనీరింగ్ పనుల కోసం పాలస్తీనా ప్రాంతాలైన వెస్ట్ బ్యాంక్ గాజా లో పనిచేశాడు. ఆ సమయం లో పాలస్తీనా వాసుల కష్టాలు చూసి వారిని విమోచించడానికి ఉద్యమించాడు. 1950 లలో ఫతా పార్టీ ని ఇంకొందరి కలిసి స్థాపించిన అరాఫత్ తర్వాత కాలంలో పార్టీ లో తిరుగులేని నాయకుడు అయ్యాడు. ఇప్పటికీ పాలస్తీనా లో ఇది ఒక బలమైన రాజకీయ పార్టీయే.

పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ లేదా పాలస్తీనా విమోచన సంస్థ

అరాఫత్ కి ప్రపంచ వ్యాప్తంగా పేరు వచ్చింది ఈ పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ నాయకుడు అయిన తర్వాతే. ఇది పాలస్తీనా విమోచన కోసం పోరాడే వివిధ సంస్థల, పార్టీల సమ్మేళనం. ఇందులో అరాఫత్ యొక్క ఫతా పార్టీ ది ప్రధాన భూమిక. నిజానికి ఈ సంస్థ ని 1964 లో అహ్మద్ శుకేరి, స్థాపించాడు. అయితే ఆ తర్వాత 1967 లో జరిగిన ఆరు రోజుల యుద్ధం లో పాలస్తీనా తరపున పోరాడిన అరబ్ దేశాలు ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. అటు వంటి సంక్షోభ పరిస్థితుల్లో 1968 లో అరాఫత్, పాలస్తీనా విమోచన సంస్థ ని తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. అక్కడి నుండి పాలస్తీనా విమోచన ఉద్యమాన్ని పరుగులు పెట్టించాడు. ఒక వైపు దౌత్యపరమైన చర్చలు చేస్తాడు, తమకు అనుగుణమైన స్పందన రాకపోతే మరొకవైపు నుండి గెరిల్లా యుద్ధాలు చేయిస్తాడు. ఆయన స్టైల్ అర్థం కావడానికి ఒక చిన్న ఉదాహరణ చూద్దాం.

1972 లో మ్యూనిచ్ లో ఒలంపిక్స్ జరుగుతున్న సమయంలో కొంతమంది పాలస్తీనా తీవ్రవాదులు ఒలంపిక్స్ స్థాయి సెక్యూరిటీ ని ఛేదించుకుని వెళ్లి మరీ 11 మంది ఇజ్రాయిల్ ఒలంపిక్ టీం ని బందీలు గా తీసుకున్నారు. బందీ లను విడిపించే ప్రయత్నం చేయగా తీవ్రవాదులు పోలీసుల తో పాటు 11 మంది ఇజ్రాయిల్ ఆటగాళ్ళ ని చంపేశారు. ఒలంపిక్స్ చరిత్ర లో నెత్తుటి మరక గా మిగిలిన ఈ సంఘటన లో పాల్గొన్న తీవ్రవాదుల కు అరాఫత్ కి చెందిన విమోచన సంస్థతో సంబంధాలు ఉన్నప్పటికీ ఈ సంస్థ నేరుగా ఈ ఆపరేషన్ చేయలేదు. ఈ దాడి లో అరాఫత్ హస్తం ఉందా లేదా అన్నని ఇప్పతికీ డిబేటే, ఇప్పటికీ శేష ప్రశ్నే. అరాఫత్ వ్యూహాలు , చర్యలు ఇలానే ఉంటాయని అంటారు.

అరాఫత్ ఒక విరోధాభాసం (Oxymoron)

టైటిల్ లో విరోధాభాసం అన్న పదం చూసి, అరాఫత్ చర్యలు చూసి ఇదేదో విరోధుల పాలిటీ సింహ స్వప్నం లాంటి పదం అనుకునేరు. కాదు. Oxymoron అన్న ఇంగ్లీషు పదానికి ఇది తెలుగు అనువాదం. రెండు పరస్పర విరుద్ధ పదాలను ఒకే సమాసం గా కలిపి చెప్పే పదబంధాలను ఆక్సిమొరాన్ అంటారు. ఉదాహరణకి “Regularly irregular”, “Clearly Confused”, “Original Copy”, “Only Choice”- ఇలాంటి పదాలన్నమాట. తెలుగు లో కూడా “బహిరంగ రహస్యం”, “సహజమైన నటన” లాంటి పద ప్రయోగాలు ఈ Oxymoron కి ఉదాహరణలే. నిజానికి Oxymoron అన్న పదం కూడా ఒక (Oxy = sharp, moron = dumb) ఒక ఆక్సిమొరానే.

ఇప్పుడు ఇదంతా ఎందుకంటే అరాఫత్ జీవితం కూడా ఒక ఆక్సిమొరాన్ లాంటిదే. ఐక్య రాజ్య సమితిలో పాలస్తీనా గురించి అరాఫత్ ఇచ్చిన ఒక ఫేమస్ స్పీచ్ ఉంటుంది. ఆ ఉపన్యాసానికి అరాఫత్ ఒక చేతిలో శాంతికి చిహ్నమైన ఆలివ్ కొమ్మని, ఇంకొక చేతిలో తుపాకిని పట్టుకొని వెళ్లి మరీ ఐక్యరాజ్య సమితి లో ఉపన్యాసం ఇవ్వడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఒక చేతి లో ఆలివ్ కొమ్మని ఒక చేతిలో ఇంకో చేత్తో తుపాకీ పట్టుకొని – ఒక జీవం వచ్చిన ఆక్సిమొరాన్ లా అరాఫత్ కనిపించాడు. అదే విధంగా ఇటు గెరిల్లా యుద్ధాలు, హింసాత్మక చర్యలు చేయిస్తూనే మరొకవైపు దౌత్య పరంగా చెప్పుకోదగ్గ పురోగతి సాధించాడు.

తరువాతి కాలం లో జరిగిన ఓస్లో ఒప్పందాల తో ఈ ప్రాంతం లో శాంతి కి కృషి చేశాడన్న కారణంతో అరాఫత్ కి నోబెల్ శాంతి బహుమతి లభించింది. ఆ తర్వతి కాలం లో పాలస్తీనా కి విమోచన ని సాధించి మొదటి ప్రెసిడెంట్ గా ఎన్నిక అయ్యాడు. ఒక వైపు అలాంటి జీవితం జీవించినా, మరణం లో మళ్ళీ క్రైం థ్రిల్లర్ ని తలపించే ట్విస్టులు ప్రపంచానికి చూపించాడు.

(సశేషం)

– జురాన్ (@CriticZuran)

Also Read చరిత్ర పుటలు: ఇజ్రాయిల్- పాలస్తీనా వివాదం, కారణాలు, సమగ్ర విశ్లేషణ (పార్ట్-1)

Also Read ఇజ్రాయిల్- పాలస్తీనా వివాదం (పార్ట్-2) : ప్రాచీన కాలంలో ఈ ప్రాంతం ఒక యూదా రాజ్యం

Also Read ఇజ్రాయిల్- పాలస్తీనా వివాదం (పార్ట్-3) : యూదా రాజ్యం అరబ్బుల పాలస్తీనా ప్రాంతం గా ఎలా మారింది ?

Also Read ఇజ్రాయిల్ పాలస్తీనా వివాదం ( పార్ట్ -4): మొదటి ప్రపంచ యుద్ధం, బ్రిటిష్ ఆధీనంలోనికి ఈ ప్రాంతం

Also Read ఇజ్రాయిల్ పాలస్తీనా వివాదం ( పార్ట్ -5) : మొదటి ప్రపంచ యుద్ధాంతర పరిస్థితులు, హిట్లర్, యూదుల ఊచకోత

Also Read ఇజ్రాయిల్ పాలస్తీనా వివాదం ( పార్ట్ -6) : రెండో ప్రపంచ యుద్ధం, ఇజ్రాయెల్ ఏర్పాటుకి మార్గం సుగమం

Also Read ఇజ్రాయిల్ పాలస్తీనా వివాదం ( పార్ట్ -7) : 1948 ఐక్యరాజ్యసమితి తీర్మానం, ఇజ్రాయిల్ ప్రత్యేక దేశం ఏర్పాటు

Also Read ఇజ్రాయిల్ పాలస్తీనా వివాదం ( పార్ట్ – 8): పాలస్తీనా శరణార్థుల సమస్య

Also Read ఇజ్రాయిల్ పాలస్తీనా వివాదం ( పార్ట్ – 9): ఆరు రోజుల యుద్ధం , శిబిరాల్లో శరణార్థుల జీవితం

Also Read : ఇజ్రాయిల్ పాలస్తీనా వివాదం (పార్ట్-12): అరాఫత్ మరణం, క్రైం థ్రిల్లర్ ని తలపించే కుట్ర కోణం

Also Read: ఇజ్రాయిల్ పాలస్తీనా వివాదం ( పార్ట్ -13): హమాస్ 1987-2004 తొలి శకం, వీల్ చైర్ లో నుంచే కథ నడిపిన సూత్రధారి

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తారా?

ఏపీలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని సర్కార్ ప్రకటించినా... వాలంటీర్లలో అనుమానాలు ఇంకా అలాగే ఉన్నాయి. జులై మొదటి తేదీన సచివాలయం సిబ్బందితో ఫించన్ లు పంపిణీ చేసిన కూటమి ప్రభుత్వం.. వాలంటీర్ల అవసరం...

జ‌గ‌న్ కు ష‌ర్మిల సూటి ప్ర‌శ్న‌లు… జ‌వాబు చెప్పే ద‌మ్ముందా?

ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై ఆయ‌న చెల్లి, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీలో వైసీపీ చేసిన ధ‌ర్నా, అక్క‌డ జ‌గ‌న్ చేసిన...

ట్రంప్‌కు అంత ఈజీ కాదు !

అమెరికా అధ్యక్ష రేసులో ముందున్నానని ఆశల్లో తేలిపోతున్న డొనాల్డ్ ట్రంప్‌కు గడ్డు పరిస్థితి ఎదురొస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. డెమెక్రాట్ల అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఖరారు కావడంతో...

హైదరాబాద్ టు బెంగళూరు ఆరు లైన్ల హైవే !

హైదరాబాద్ - విజయవాడ మార్గం తర్వాత అత్యంత బిజీగా ఉండే మార్గం హైదరాబాద్ - బెంగళూరు. ఈ మార్గాన్ని ఆరు లైన్లుగా మార్చాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ -...

HOT NEWS

css.php
[X] Close
[X] Close