కవితను వదలని ఈడీ, ఐటీ !

తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత ఇంట్లో ఐటీ, ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన పది బృందాలు ఈ సోదాలు నిర్వహిస్తున్నాయి. కవితతో పాటు ఆమె భర్త వ్యాపార వ్యవహారాలపై పూర్తి స్థాయి సమాచారంతో వచ్చి సోదాలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. సోదాల సందర్భంగా పోలీసులు పెద్ద ఎత్తున ఆమె ఇంటి వద్ద భద్రతా ఏర్పాట్లు చేశారు.

కవిత .. ఢిల్లీ లిక్కర్ స్కాంలో పెద్ద ఎత్తున లాభపడ్డారని ఇప్పటికే సీబీఐ, ఈడీ చార్జిషీట్లు దాఖలు చేశాయి. స్కాం ద్వారా వచ్చిన డబ్బుతో ఆమె ఆస్తులు కొనుగోలు చేశారని ఇందు కోసం ఆమె భర్త సంస్థల్ని వాడుకున్నారని కూడా చార్జిషీటులో పెట్టారు. అన్ని కలిపి ఒకే సారి సోదాలకు వచ్చినట్లుగాతెలుస్తోంది. కవిత ఢిల్లీ లిక్కర్ స్కాంలో విచారణకు హాజరు కావడం లేదు. కోర్టులో ఓ పిటిషన్ వేసి అదే పనిగా ..అదే కారణం చూపి డుమ్మా కొడుతున్నారు ఇటీవల సీబీఐ ఇచ్చిన నోటీసులకూ హాజరు కాలేదు. ఈ క్రమంలో ఢిల్లీ నుంచి అధికారులు సోదాలకు రావడం అనూహ్యమైన పరిణామంగా మారింది.

లోక్‌సభ ఎన్నికల్లో కూడా కవిత పోటీ చేయడం లేదు. నిజామాబాద్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్ధన్ ను కేసీఆర్ ఖరారు చేశారు. ఆమె కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాడుతున్నారు. బీజేపీపై ఎలాంటి విమర్శలు చేయడం లేదు. జాతీయ అంశాల్లో కాంగ్రెస్ పై తరచూ విమర్శలు చేస్తున్నారు. అయినప్పటికీ డిల్లీ లిక్కర్ స్కాం లో ఆమె పై దర్యాప్తు సంస్థలు విరుచుకుపడుతునే ఉన్నాయి. సౌత్ లాబీ నుంచి నిందితులుగా ఉన్న వారిలో .. ఒక్క కవిత తప్ప అందరూ అప్రూవర్లుగా మారారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

టీడీపీ స్టార్ క్యాంపెయినర్ గా జగన్ రెడ్డి..!?

తెలంగాణలో బీఆర్ఎస్ చేసిన పొరపాటే వైసీపీ కూడా చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను బీఆర్ఎస్ విస్తృతంగా జనాల్లోకి తీసుకెళ్తే..ఏపీలో టీడీపీ సూపర్ సిక్స్ గ్యారంటీలను జగన్ రెడ్డి ప్రజల్లోకి...

జాతీయ స్థాయిలోనూ కాంగ్రెస్ ను రేసులో నిలబెడుతోన్న రేవంత్..!!

రేవంత్ రెడ్డి...ఈ పేరు జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అవుతోంది. వ్యుహమో మరేమో కానీ, రిజర్వేషన్లపై కుట్ర జరుగుతుందంటూ బీజేపీకి ఊపిరి ఆడకుండా చేస్తున్నారు. రిజర్వేషన్లపై రేవంత్ వ్యాఖ్యల పుణ్యమా అని బీజేపీ జాతీయ...

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నాని

రాజ‌మౌళి - నాని కాంబోలో 'ఈగ' వ‌చ్చింది. అది సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ కాంబో కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్ష‌కులు 'ఈగ 2' ఆలోచ‌న రాజ‌మౌళికి ఉంది. కానీ...

కేసీఆర్ పై ఈసీ బ్యాన్

మాజీ సీఎం కేసీఆర్ ను ప్రచారం చెయ్యకుండా ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈరోజు రాత్రి8 గంటల నుండి రెండు రోజుల పాటు అంటే 48గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది అని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close