3 కంపెనీలు ..2 వేల కోట్ల అక్రమ లావాదేవీలు..! తెలుగు రాష్ట్రాల్లో ఐటీ బాంబ్..!

తెలుగు రాష్ట్రాలకు చెందిన మూడు ప్రముఖ ఇన్ఫ్రా కంపెనీలకు సంబంధించి దాదాపుగా 40 చోట్ల జరిపిన సోదాల్లో రూ. రెండు వేల కోట్లకు పైగా అవకతవకలను గుర్తించినట్లుగా ఆదాయపు పన్ను శాఖ ప్రకటించారు. తెలంగాణలో ప్రతిమ గ్రూప్ కంపెనీల ఓనర్.. టీఆర్ఎస్ కీలక నేత బోయినపల్లి వినోద్‌కుమార్ సమీప బంధువు బోయినపల్లి శ్రీనివాసరావు, కడప జిల్లా టీడీపీ నేత శ్రీనివాసులరెడ్డికి చెందిన కంపెనీలపై ఈ నెల ఆరో తేదీ నుంచి సోదాలు జరిగాయి. వీటితో పాటు.. మరో కంపెనీకి పైనా సోదాలు చేసినట్లుగా.. ఐటీ శాఖ ప్రకటించింది. సోదాల్లో రూ.2వేల కోట్లకు పైగా అక్రమ లావాదేవీలను గుర్తించామని.. లావాదేవీలు జరిగిన విషయాన్ని ఈ మెయిల్‌, వాట్సాప్‌ సందేశాల ద్వారా గుర్తించామని ఐటీ శాఖ తెలిపింది. బోగస్ కంపెనీలు పెట్టి.. నకిలీ ఇన్వాయిస్‌లతో నగదు చెలామణి చేశారని.. ఓ కంపెనీ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి పేరుతో నిధులు సమీకరించిందని.. ఐటీ శాఖ తెలిపింది.

ఓ ప్రముఖ వ్యక్తికి మాజీ పర్సనల్ సెక్రటరీ ఇంట్లోనూ సోదాలు చేసి.. కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నామని ఐటీ శాఖ తెలిపింది. చంద్రబాబు మాజీ పీఏ పెండ్యాల శ్రీనివాస్ ఇంట్లో.. ఐదు రోజుల పాటు.. ఐటీ అధికారులు సోదాలు చేశారు. బహుశా ఐటీ శాఖ.. ఈ విషయమే పరోక్షంగా చెప్పి ఉంటుందని అంచనా వేస్తున్నారు. మొత్తంగా ఫిబ్రవరి 6 నుంచి మొత్తం 40 ప్రాంతాల్లో సోదాలు చేశామని ఐటీ శాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ సోదాల్లో లెక్కలు చెప్పని రూ.85 లక్షల నగదు.. 71 లక్షల విలువైన ఆభరణాలు.. స్వాధీనం చేసుకున్నామని ఐటీ శాఖ తెలిపింది. అలాగే.. ఇరవై ఐదు బ్యాంక్ లాకర్లు గుర్తించినట్లుగా ఐటీ శాఖ తెలిపింది.

ఇన్ఫ్రా కంపెనీల లావాదేవీలన్నీ.. సబ్ కాంట్రాక్టర్లకు చెల్లింపులు.. కొనుగోళ్లు.. వంటి అంశాలతో ముడిపడి ఉన్నట్లుగా తెలిపింది. అసలు టర్నోవర్ లేని కంపెనీలతో ఈ బోగస్ లావాదేవీలు నిర్వహించారని ఐటీ శాఖ ప్రకటించింది. గతంలోనూ ఐటీ శాఖ.. ఓ ప్రముఖ ఇన్ఫ్రా కంపెనీపై సోదాలు చేసి.. ఇలానే రూ. రెండు,మూడు వేల కోట్ల అక్రమ లావాదేవీలు గుర్తించామని ప్రకటించింది. అప్పుడు బయటపడిన ఆధారాలకు కొనసాగింపుగా ఇప్పుడు.. సోదాలు చేసినట్లుగా తెలుస్తోంది. తదుపరి ఏం చర్యలు తీసుకుంటారన్నదానిపై ప్రకటనలో ఎలాంటి స్పష్టత లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close