మాజీ ఎంపీ రంజిత్ రెడ్డికి చెందిన డీఎస్ఆర్ ప్రాజెక్ట్స్ అనే రియల్ ఎస్టేట్ కంపెనీపై ఐటీ దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. ఇప్పటికి మూడు రోజులు అయింది. ఆ కంపెనీకి చెందిన ఆఫీసులు, డైరక్టర్ల ఇళ్లు, నిర్మాణాల సైట్ల దగ్గర సోదాలు చేస్తున్నారు. వందల మంది అధికారులు దాదాపుగా ముఫ్పై చోట్ల సోదాలు ప్రారంభించారు. కొన్ని చోట్ల ముగిసిపోయిన ఇంకా చాలా చోట్ల లెక్కలు వేస్తూనే ఉన్నారు. మూడు రోజులు పాటు రంజిత్ రెడ్డి ఇంట్లో సోదాలు చేసిన తర్వాత ఆయనను బ్యంకుకు తీసుకెళ్లిన అధికారులు.. బ్యాంక్ లాకర్లను కూడా ఓపెన్ చేయించారు.
ఇంకా మరో రోజు సోదాలు జరిగే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. డీఎస్ఆర్ కంపెనీలోకి పెద్ద ఎత్తున బ్లాక్ మనీ ప్రవహించిందన్న ఆరోపణలు వస్తున్నాయి. అత్యంత లగ్జరీ ఫ్లాట్లను మాత్రమే నిర్మించే డీఎస్ఆర్.. ఒక్కో ఫ్లాట్ ను కనసం పది కోట్లకు పైగానే అమ్ముతారు. కానీ రిజిస్ట్రేషన్లో రెండు,మూడు కోట్లకు చూపించి..భారీగా పన్నులు ఎగవేయడంతో పాటు బ్లాక్ మనీని సర్క్యులేషన్ లోకి తీసుకు వచ్చారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఏపీ లిక్కర్ స్కాంలో నిందితుడిగా ఉన్న కృష్ణారెడ్డి అనే వ్యక్తి కూడా ఈ డీఎస్ఆర్ కంపెనీలో ఓ పార్టనర్. ఆయన ఇళ్లు, కార్యాలయాల్లోనూ సోదాలు జరుగుతున్నాయి. ఈ కృష్ణారెడ్డి శ్రీనివాసా కన్ స్ట్రక్షన్స్ అనే పేరుతో ప్రత్యేకంగా ఓ కంపెనీ పెట్టి.. రాజ్ కసిరెడ్డితో ఆర్థిక లావాదేవీలు నిర్వహించారు. అవన్నీ బయటకు వస్తాయేమో కానీ.. ఈ రెయిడ్లో మాత్రం చాలా దొరుకుతున్నాయని అర్థం చేసుకోవచ్చు.