సీఎం రమేష్‌పై ఐటీ గురి..! సోదాలు షురూ..!!

తెలుగుదేశం పార్టీ ఎంపీ సీఎం రమేష్ .. ఆస్తులు, సంస్థలపై ఐటీ దాడులు ప్రారంభమయ్యాయి. దాదాపు వంద మంది అధికారులు… ఆయనకు సంబంధించిన సంస్థలు, ఆస్తుల్లో సోదాలు చేస్తున్నారు. చివరికి కడప జిల్లా పొట్లదుర్తిలో ఉన్న ఇంట్లోనూ సోదాలు ప్రారంభించారు. హైదరాబాద్, బెంగుళూరుల్లో సీఎం రమేష్ బంధువుల ఇంట్లోనూ… సోదాలు చేస్తున్నారు. రిత్విక్ ప్రాజెక్ట్స్ పేరుతో.. సీఎం రమేష్‌కు కన్‌స్ట్రక్షన్ కంపెనీ ఉంది. ఆ కంపెనీకి వేల కోట్ల టర్నోవర్ ఉంది. కొద్ది రోజులుగా తెలుగుదేశం పార్టీ నేతల్ని.. . ఆ పార్టీకి ఆర్థికంగా అండగా ఉంటారని భావిస్తున్న నేతలను ఇన్‌కంట్యాంక్స్ దాడులు చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. దానికి తగ్గట్లే గత వారం… ఎమ్మెల్యే పోతుల రామారావు, మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్ రావుల కంపెనీల్లో సోదాలు చేశారు. ఇప్పుడు సీఎం రమేష్‌ను టార్గెట్ చేశారు.

సీఎం రమేష్…కొద్ది రోజుల క్రితం పీఏసీ సభ్యుడిగా ఓటింగ్‌లో విజయం సాధించారు. పీఏసీ సభ్యుడి హోదాలో… ఏపీలో ఐటీ దాడులు ఎందుకు చేస్తున్నారంటూ… ఐటీ శాఖను ప్రశ్నించారు. ఏపీలో ఐటీ దాడులను ఏ కారణంతో చేస్తున్నారు..? ఎక్కడెక్కడ చేస్తున్నారు..? ఎలాంటి ఫిర్యాదులు వచ్చాయి..? చెప్పాలంటూ.. సీఎం రమేష్ పీఏసీ సభ్యుడి హోదాలో.. ప్రశ్నించారు. ఈ లేఖ పంపి కేవలం మూడు రోజులే అయింది. ఈ మూడు రోజుల్లోనే.. సీఎం రమేష్‌ను ఐటీ శాఖ టార్గెట్ చేసింది.

కడప ఉక్కు పరిశ్రమ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి నేటికి వందో రోజు పూర్తైన సందర్భంగా టీడీపీ ఎంపీలు కేంద్ర ఉక్కు శాఖ మంత్రితో భేటీ అవ్వాలని నిర్ణయించారు. కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై స్పష్టత ఇవ్వాలని కేంద్రమంత్రిని ఎంపీలు కోరనున్నారు. ఇందుకోసం ఎంపీల బృందం ఢిల్లీకి చేరుకుంది. కడప ఉక్కు పరిశ్రమపై ప్రశ్నిస్తున్నందుకే సీఎం రమేష్ ఇంట్లో ఐటీ సోదాలు చేపట్టిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తాము, తమ సంస్థలు నిరంతరం పన్నుల చెల్లిస్తున్నాయని.. ఎన్నికల ముందు కేవలం భయానక వాతావరణం సృష్టించడానికే దాడులకు పాల్పడుతోందని సీఎం రమేష్ ఆరోపిస్తున్నారు. కేంద్రం ఎన్ని చేసినా తాము భయపడబోమన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బిగ్ బాస్ నుండి దేవి నిష్క్రమణ, టీవీ9 పై జనాల్లో వ్యతిరేకత కూడా కారణమా ?

బిగ్ బాస్ సీజన్ 4 రికార్డు టిఆర్పీ లతో దూసుకెళుతోంది. కంటెస్టెంట్స్ జాబితా బాగోలేదు అన్న కారణంగా రెండు మూడు రోజుల తర్వాత పడిపోయిన రేటింగులు 10వ రోజు నుండి భారీగా పుంజుకున్నాయి....

పవన్ కళ్యాణ్ ఈనాడు ఇంటర్వ్యూ పై సాక్షి కొమ్మినేని ఏడుపు, ఈనాడు కి నీతులు

ఇటీవల పవన్ కళ్యాణ్ ఈనాడు పత్రికకు ఇచ్చిన సుదీర్ఘమైన ఇంటర్వ్యూ రాజకీయంగా ప్రాముఖ్యత సంతరించుకుంది. అమరావతి, జగన్ పాలన, ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల పై పవన్ కళ్యాణ్ తన అభిప్రాయాలను ఆ...

గ్రేటర్ సమస్యలపై కేటీఆర్‌ని టార్గెట్ చేస్తున్న రేవంత్..!

తెలంగాణలో గ్రేటర్ ఎన్నికల రాజకీయం రాజుకుంది. ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో అంచనా వేయడం కష్టం కానీ.. రాజకీయ నేతలు మాత్రం.. వచ్చిన ఏ అవకాశాన్ని వదిలి పెట్టడం లేదు. గ్రేటర్ పరిధిలో...

ఠాగూర్ అయినా టీ కాంగ్రెస్‌లో అందర్నీ కలపి ఉంచగలరా..!?

తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జిగా కుంతియా స్థానంలో మాణిగం ఠాగూర్‌ను కాంగ్రెస్ హైకమాండ్ నియమించింది. ఆయన తెలంగాణలో అడుగు పెట్టి..ఓ సారి సమావేశం కూడా నిర్వహించారు. కాంగ్రెస్ నేతలు.. అందరూ ఆయన ఎదుట...

HOT NEWS

[X] Close
[X] Close