ఈసారి `మా` రాజకీయాలు మరింత రసవత్తరంగా మారబోతున్నాయి. ఇప్పటికే మంచు విష్ణు, ప్రకాష్ రాజ్.. పోటీలో దిగుతున్నట్టు ప్రకటించారు. వీరిద్దరి మధ్యా నువ్వా? నేనా? అనే పోటీ సాగబోతోంది. ఇప్పుడు.. జీవిత కూడా `నేను సైతం` అంటోంది. మా అధ్యక్ష ఎన్నికలలో పోటీ చేయడానికి జీవిత సన్నద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది. గత ఎన్నికలలో ఆమె బరిలోకి దిగారు. ప్రస్తుతం `మా` సెక్రటరీగా పనిచేస్తున్నారు. ఇటీవల `మా`లో క్రీయాశీలకంగా వ్యవహరిస్తున్నారు జీవిత. ఆమెకు ఓ వర్గం సపోర్ట్ గట్టిగా ఉంది. జీవిత గనుక బరిలో దిగితే .. అటు ప్రకాష్ రాజ్ కీ, ఇటు.. మంచు విష్ణుకీ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. జీవిత రాక… చిరంజీవిని మరింత క్లిష్టమైన పరిస్థితిలో పడేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే… ఇప్పటికే ఆయన ప్రకాష్ రాజ్ కి మద్దతు ప్రకటించేశారని వార్తలొస్తున్నాయి. రాజశేఖర్ – చిరు మధ్య సఖ్యత లేదు. `మా` డైరీ ఆవిష్కరణ సభలో.. చిరు సాక్షిగా రాజశేఖర్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అప్పట్లో రాజశేఖర్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చిరంజీవి వేదిక మీదే ఆవేశంగా మాట్లాడారు. ఇప్పుడు మా ఎన్నికలలో జీవిత బరిలో దిగితే.. మరింత రచ్చ జరిగే అవకాశం ఉంది.