‘పుష్ప’ కోసం ఐటెమ్ సాంగ్ రెడీ

సుకుమార్ – దేవిశ్రీ ప్ర‌సాద్ కాంబినేష‌న్ అంటే ఐటెమ్ సాంగ్ ఉండాల్సిందే. ఆర్య‌, ఆర్య 2, జ‌గ‌డం. రంగ‌స్థ‌లం సినిమాల్లో మంచి ఐటెమ్ గీతాలు కుదిరాయి. నాన్న‌కు ప్రేమ‌తో, వ‌న్ సినిమాల్లో ఐటెమ్ గీతాల‌కు ఆస్కారం లేకుండా పోయింది. అయితే `పుష్ప`లో మాత్రం ఆ ఛాన్స్ ఉంది. ఈ సినిమాలో అదిరిపోయే ఓ ఐటెమ్ గీతం ఉంది. దానికి సంబంధించిన ట్యూన్ కూడా ఓకే అయిపోయింది. ఈ పాట ఈ ఆల్బ‌మ్ మొత్తానికి స్పెష‌ల్ గా ఉండ‌బోతోంద‌ని టాక్‌. ఇందులో న‌ర్తించ‌డానికి బాలీవుడ్ నుంచి ఓ పేరున్న క‌థానాయిక‌ని తీసుకురావాల‌ని చిత్ర‌బృందం యోచిస్తోంది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుద‌ల చేయబోతున్నారు. అందుకే త‌మిళ‌, మ‌ల‌యాళ న‌టీన‌టులకు కూడా చిత్ర‌బృందంలో చోటు క‌ల్పించనున్నారు. ఐటెమ్ గాళ్ ని మాత్రం బాలీవుడ్ నుంచి దిగుమ‌తి చేసే అవ‌కాశం ఉంది. ఈ పాట‌తో పాటు ‘పుష్ప’ పేరుతోనూ ఓ మంచి పాట‌ని కంపోజ్ చేశాడ‌ట దేవి. ఈ పాట‌ని దేవిశ్రీ ప్ర‌సాదే రాశాడ‌ని టాక్‌. ఈ రెండు పాట‌లూ.. మాస్‌కి న‌చ్చేలా ఉంటాయ‌ని స‌మాచారం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

లక్ష్మిపార్వతి అంత ధైర్యం కొడాలి నానికి లేదా !?

ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీకి యుగపురుషుడి పేరు తీసేయడంపై మెల్లగా వైసీపీలో ఉన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా ముసుగు తీసేస్తున్నారు. సమర్థిస్తూ ఒకరి తర్వాత ఒకరు మీడియా ముందుకువచ్చి మాట్లాడుతున్నారు. పెద్ద...

మహేష్ బాబు ఇంటిలో చోరికి యత్నం

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట్లో చోరికి ప్రయత్నించాడు ఓ దొంగ. ఓ అగంతకుడు మహేష్ బాబు ఇంటి గోడ దూకి లోపలికి వచ్చాడు. మంగళవారం రాత్రి సమయంలో లో చోరీ ప్రయత్నం...

స్వాతిముత్యం పై త్రివిక్రమ్ స్టాంప్

హారిక హాసిని క్రియేషన్స్, సితార ఎంటర్‏టైన్మెంట్స్ త్రివిక్రమ్ శ్రీనివాస్ హోమ్ బ్యానర్లు. కేవలం త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమాలు చేయడానికే హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ ని కేటాయించారు నిర్మాత చినబాబు. ఇక సితారలో...

4 నెలల్లో ఆదాయం రూ.45వేల కోట్లు..ఖర్చు రూ.86వేల కోట్లు !

మనకు జీతం పదివేలు వస్తే.. క్రెడిట్ కార్డులు ఉన్నాయి కదా అని రూ. ఇరవై వేలు ఖర్చు పెట్టేస్తే ఏమవుతుంది ? ఖర్చు పెట్టినప్పుడు బాగానే ఉంటుంది. కానీ ఎప్పుడైతే క్రిడెట్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close