అసెంబ్లీకి జ‌గ‌న్ డుమ్మా…!

ఓట‌మి బాధ‌నో… అసెంబ్లీలో అంత‌మంది టీడీపీ ఎమ్మెల్యేల‌ను చూస్తుంటే గ‌తంలో తాను చేసిన మాట‌లు గుర్తుకొస్తున్నాయో… మాజీ ముఖ్యమంత్రి జ‌గ‌న్ అసెంబ్లీకి డుమ్మా కొట్టారు.

మొద‌టిరోజు ఎమ్మెల్యేల ప్ర‌మాణ‌స్వీకార స‌మ‌యానికి అసెంబ్లీకి వ‌చ్చిన జ‌గ‌న్… ప్ర‌మాణ‌స్వీకారం చేసి నేరుగా ఛాంబ‌ర్ కు వెళ్లిపోయారు. ప్ర‌మాణ‌స్వీకారం చేసే ముందు కొద్ది నిమిషాలు మాత్ర‌మే స‌హ‌చ‌ర వైసీపీ ఎమ్మెల్యేల‌తో కూర్చున్నారు.

రెండోరోజు స్పీక‌ర్ ఎన్నిక ఉంద‌ని వైసీపీకి తెలుసు. అసెంబ్లీ సాంప్ర‌దాయ‌ల ప్ర‌కారం అధికార‌, విప‌క్ష నేత‌లంతా క‌లిసి ఎన్నికైన స్పీక‌ర్ ను త‌న సీటు వ‌ద్ద‌కు తీసుకెళ్తారు. స్పీక‌ర్ తో త‌మ‌కున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటారు.

కానీ, స్పీక‌ర్ అయ్య‌న్న‌పాత్రుడు ఎంపిక అవ్వ‌టం ఇష్టంలేదో… అసెంబ్లీలో అంత‌మంది అధికార‌ప‌క్షం ముందు సాధార‌ణ ఎమ్మెల్యేగా కూర్చోవ‌టం జ‌గ‌న్ కు ఇష్టం లేదో కానీ రెండో రోజు వైసీసీ అసెంబ్లీకి డుమ్మా కొట్టింది. జ‌గ‌న్ ఐదు రోజుల‌పాటు ప‌ర్య‌ట‌న కోసం పులివెందుల‌కు వెళ్లిపోయారు.

పులివెందుల వైఎస్ ఫ్యామిలీ అడ్డాగా ఉండేది. కానీ, మొన్న‌టి ఎన్నిక‌ల్లో ఆ పునాదులు కూడా క‌దిలిపోయాయి. సీఎంగా భారీ మెజారిటీతో గెలుస్తార‌ని భావించినా, పులివెందుల‌లోనూ క‌ష్ట‌ప‌డాల్సి వ‌చ్చింది. సీఎంగా ఉన్న‌ప్పుడు ప‌ట్టించుకోలేద‌ని… ఇప్పుడైనా వ‌స్తారా అన్న అనుమానాలు మొద‌లైన నేప‌థ్యంలో జ‌గ‌న్ పులివెందుల ప‌ర్య‌ట‌న చేప‌ట్టారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీ ఉద్యోగ సంఘం నేతలు ఎక్కడ ?

వైసీపీ ప్రభుత్వం ఉద్యోగులకు వాయిస్ లేకుండా చేసింది. ఉద్యోగ సంఘం నేతల్ని ఉద్యోగుల వాయిస్ కాకుండా తమ వాయిస్ వినిపించేలా చేయడంతో ఇప్పుడు ప్రభుత్వం మారడంతో వారికి నోరు పెగలడం...

తననూ లెక్కేసుకోవాలంటున్న రమణదీక్షితులు

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి రమణదీక్షితులుఓ విన్నపం చేశారు. సోషల్ మీడియాలో ఈ విన్నపం చేసుకున్నారు. గత ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులన్నింటినీ లిస్టవుట్ చేసుకుని తీసేయాలని నిర్ణయం తీసుకున్నారు కాబట్టి.. ఆ...

ఫ్లాష్ బ్యాక్‌: జ‌మున‌ని ఎందుకు బ్యాన్ చేశారు?

కొన్నేళ్ల క్రితం ప్ర‌కాష్‌రాజ్‌ని 'మా' అసోసియేష‌న్ బ్యాన్ చేసిన సంగ‌తి ఇప్ప‌టికీ ఏదో ఓ సంద‌ర్భంలో త‌ల‌చుకొంటుంటాం. ఆ త‌ర‌వాత ఏ న‌టుడ్నీ అలా బ్యాన్ చేయ‌లేదు. కానీ ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్తే......

టీడీపీ క్యాడర్‌పై కేసుల ఎత్తివేత !

జగన్ రెడ్డి జమానాలో ఎఫ్ఐఆర్‌ల విప్లవం నడిచింది. నిజమైన రౌడీలు, ఖునీకోరులు హాయిగా తిరుగుతూంటే... టీడీపీ కార్యకర్తలు మాత్రం సోషల్ మీడియాపోస్టులు పెట్టినా వేధింపులు ఎదుర్కొన్నారు. కేసుల పాలయ్యారు. టీడీపీ అధికారంలోకి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close