సముద్రంలోకి పోతున్న గోదావరి నీటిని సీమకు తరలించేందుకే బనకచర్ల. దాని వల్ల తెలంగాణకు నష్టం లేదు.. అని జగన్ రెడ్డి ఇంతకు ముందు నిర్వహించిన ప్రెస్మీట్లో చెప్పారు.కానీ తర్వాత ప్రెస్‌మీట్‌కు ఆయన విధానం మారిపోయింది. చత్తీస్‌ఘడ్‌లో ఇంద్రావతిపై యాభై వేల కోట్లతో ప్రాజెక్టు కడుతున్నారని ఇక మిగులు జలాలు ఎక్కడ ఉంటాయని డబ్బులు దండగని జగన్ అనేశారు. ఆయన నాలుక మడతేసిన వైనం చూసి సీమ జనాలు కూడా ఆశ్చర్యపోతున్నారు.
బనకచర్ల వృధా అని తేల్చేసిన జగన్
బనకచర్ల ప్రాజెక్టు సాకారం అయితే.. రాయలసీమ కష్టాలు తీరిపోతాయి. నీటి సమస్యలే ఉండవు. తాగు, సాగునీటికే కాదు పారిశ్రామిక అవసరాలు కూడా తీర్చుకోవచ్చు. అయితే ఏదీ అంత తేలికగా సాధ్యం కాదు. కరువును జయించడం అసలు సాధ్యం కాదు. ఎంతో కష్టపడాలి. అలాంటి కష్టం బనకచర్లకూ పడాలి. నీరు కిందకు రావు.. పైన వాళ్లు ప్రాజెక్టులు కట్టేసుకుంటున్నారని వదిలేస్తే సమస్య ఎప్పటికీ తీరదు. మారుతున్న వాతావరణంతో వరదలు కామన్ అవుతున్నాయి. గోదావరికి ఉన్న బౌగోళిక ప్రత్యేకతల వల్ల… నీళ్లు ఆపుకోవడం పై రాష్ట్రాలకు కూడా పూర్తి స్థాయిలో సాధ్యం కాదు.
ఎగువ రాష్ట్రాలు ఎన్ని టీఎంసీలు ఆపుకోగలవు?
గోదావరిలో పోలవరంలో మాత్రం నీటిని ఆపుకోగలరు. కాళేశ్వరం అయినా.. బనకచర్ల అయినా ఎత్తిపోసుకోవాల్సిందే. ఇలాంటి ప్రాజెక్టులకు భారీగా ఖర్చు అవుతాయి. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించాలనంటే.. కనీసం నాలుగు లక్షల కోట్లు అవుతుంది. ముందే నిర్మించడం వల్ల ఎంతో మేలు జరిగింది. బనకచర్ల విషయంలోనూ ఎంత నాన్చితే అంత ఖర్చు పెరుగుతుంది. భారమవుతుంది. జగన్ రెడ్డి సీమకు నీళ్లు ఇవ్వాలనుకుంటే.. ముందుగా బనకచర్లను ప్రారంభించాలని అడుగుతారు. కానీ ఆయన చత్తీస్ ఘడ్.. తెలంగాణ పేరు చెప్పి లాభదాయకం కాదంటున్నారు.
రాయలసీమపై జగన్ కు ప్రేమ లేదు.. అంతా స్వార్థమే !
బనకచర్ల రాయలసీమకు గేమ్ ఛేంజర్.. నదుల అనుబంధానం అనే కాన్సెప్ట్ తో కేంద్రం నిధులు ఖర్చుచేయాలని అనుకుంటోంది. ఆ నిధుల్ని వాడుకుని చంద్రబాబు ప్రాజెక్టు పూర్తి చేయాలనుకుంటున్నారు. దీనివల్ల ఏపీపై పడే భారం తక్కువే. అయినా జగన్ రెడ్డి సీమకు నీళ్లు ఇస్తే.. తన రాజకీయ జీవితం ఇక మెరుగుపడదని .. సీమకు అన్యాయం చేయాలని డిసైడయ్యారు. ఇది ఆయన రాజకీయ అరాచకవాదానికి.. తన కుటుంబానికి అండగా నిలబడిన సీమకు ద్రోహం చేయడమే అవుతుంది. అలాంటి ద్రోహాలు ఆయనకు చాలా సింపుల్.