చంద్రబాబు అవినీతి పాలనపై పుస్తకం..డిల్లీలో అందరికీ పంచిపెడుతున్న జగన్

వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, తన పార్టీ ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి “ప్రజా స్వామ్యాన్ని రక్షించండి” అనే పేరుతో డిల్లీ యాత్ర చేపట్టి, అక్కడ జాతీయ పార్టీ నాయకులను కలిసి రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి,  పార్టీ ఫిరాయింపుల గురించి వివరిస్తూ అందరూ తన పోరాటానికి సహకరించవలసిందిగా అభ్యర్దిస్తున్నారు.

కొద్దిసేపటి క్రితం కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ని కలిసి తెదేపా ప్రభుత్వంపై పిర్యాదు చేసారు. ఈ రెండేళ్ళ వ్యవధిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ప్రభుత్వం ఎక్కడెక్కడ ఏవిధంగా ఎంత అవినీతికి పాల్పడినది ఆధారాలతో సహా తెలియజేస్తూ వైకాపా ప్రచురించిన ‘ద ఎంపరర్ ఆఫ్ కరప్షన్’ (అవినీతి చక్రవర్తి) అనే పుస్తకాన్ని జగన్ తను కలుస్తున్న నేతలందరికీ, కేంద్రమంత్రులకు అందజేస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు, నిధుల దుర్వనియోగం గురించి కేంద్రప్రభుత్వంలోని వివిధ శాఖల ఉన్నతాధికారులకు కూడా తెలుసుకొనేందుకు ఆ పుస్తకాలను అందజేస్తామని జగన్ చెప్పారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక్కో వైకాపా ఎమ్మెల్యేకు రూ.20-30కోట్లు వరకు చెల్లించికొంటున్నారని, ఆయనకి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు. మళ్ళీ దానికి సమాధానం కూడా ఆయనే చెప్పారు. అవినీతి పనుల ద్వారా సంపాదించిన డబ్బుని ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి వినియోగిస్తున్నారని చెప్పారు. ఎన్నికల సమయంలో ప్రజలకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలందరూ నిలదీసి ప్రశ్నించాలని జగన్ కోరారు. హామీలను అమలుచేయకపోగా, అవినీతిలో మునిగి తేలుతూ, ఆ డబ్బుతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని జగన్ ఆవేదన వ్యక్తం చేసారు.

రాష్ట్రంలో జరుగుతున్న ఈ అవినీతి, అక్రమాలు, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ గురించి హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ కి వివరించి, తగు చర్యలు తీసుకోవలసిందిగా కోరానని జగన్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడి, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీల అపాయింట్ దొరికితే వారిని కూడా కలిసి రాష్ట్రంలో పరిస్థితులను వివరిస్తామని జగన్మోహన్ రెడ్డి తెలిపారు. పార్టీ ఫిరాయింపుల చట్టంలో మార్పులు చేసి, ఫిరాయించినవారిపై చర్యలు తీసుకొనే అధికారం స్పీకర్ నుంచి ఎన్నికల సంఘానికి కానీ, గవర్నర్ కి గానీ కట్టబెట్టాలని జగన్ అందరినీ కోరుతున్నారు.

పార్టీ ఫిరాయింపులపై జగన్ చేస్తున్న పిర్యాదులపై కేంద్రప్రభుత్వం ఇప్పటికిప్పుడు స్పందించలేదు. ఎందుకంటే తెదేపా మిత్రపక్షం పైగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో ఆ రెండు పార్టీలు భాగస్వాములుగా కొనసాగుతున్నాయి. అదీకాక ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి పాలన విధించినందుకు మోడీ ప్రభుత్వం పార్లమెంటు లోపల, బయటా ప్రతిపక్షాల నుండి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. కోర్టుల చేత మొట్టికాయలు వేయించుకొంటోంది.

ఇంక తెదేపా అవినీతి, అక్రమాల గురించి వైకాపా ప్రచురించిన పుస్తకం కేంద్రప్రభుత్వానికి  చాలా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. కేంద్రప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులను, రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని, ఖర్చులకు సరిగ్గా లెక్కలు అప్పజెప్పడం లేదని, రాష్ట్ర భాజపా నేతలు ఆరోపిస్తున్నారు. ఆ కారణంగా రాష్ట్రానికి ఆశించినంతగా నిధులు విడుదల కావడం లేదు. కనుక ఇప్పుడు జగన్ అందిస్తున్న ఈ పుస్తకం ఆధారంగా కేంద్రప్రభుత్వం మరిన్ని ప్రశ్నలు సందించవచ్చు. సంతృప్తికరమయిన సమాధానాలు రానట్లయితే నిధుల విడుదల చేయకుండా తొక్కిపట్టవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close