పీపీఏలపై సీఎం నివేదిక ప్రకటించాక మళ్లీ కమిటీ ఎందుకు..?

గత బుధవారం విద్యుత్‌, ఇంధనశాఖ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించినప్పుడు.. బిడ్డింగ్‌ ధరల కన్నా అధిక రేట్లకు విద్యుత్ కొనుగోలు కారణంగా రూ. 2,636 కోట్ల నష్టం వాటిల్లిందని తేల్చి.. ఆ డబ్బును రికవరీ చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్‌ ఒప్పందాలు చేసిన ఉన్నతాధికారి, అప్పటి మంత్రి, సీఎంపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని.. కూడా జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. ఇంత పక్కాగా ముఖ్యమంత్రి ఏ నివేదికల ప్రకారం లెక్కలు చెప్పారో.. ఏ నిబంధనల ప్రకారం చర్యలకు ఆదేశించారో.. అంతకు మించి.. ఏ ఒప్పందం ప్రకారం.. నిధులు రికవరీ చేయాలని ఆదేశించారో చాలా మంది అర్థం కాలేదు. కానీ ఇప్పుడు… ఐదేళ్ల కాలంలో.. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేసుకున్న “పవర్ పర్చేజ్ అగ్రిమెంట్‌”లను సమీక్షించేందుకు ఉన్నత స్థాయి కమిటీని నియమించారు.

ఆర్ధిక మంత్రి బుగ్గన, విద్యుత్ శాఖ మంత్రి బాలినేని సహా మొత్తం 9 మంది సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ సౌర, పవన విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలను సమీక్షించి ప్రభుత్వానికి సిఫార్సులు చేయనుంది. మార్కెట్ లో తక్కువ ధరకు సౌర, పవన విద్యుత్ లభిస్తున్నా ఎక్కువ ధరకు ఒప్పందాలు చేసుకున్నారని.. ప్రభుత్వం చెబుతోంది. రాష్ట్రంలోని రెండు విద్యుత్ పంపిణీ సంస్థలకు సౌర, పవన విద్యుత్ లను విక్రయిస్తున్న కంపెనీలతో సంప్రదించి తక్కువ ధర విద్యుత్ సరఫరా అయ్యేలా చూడటంతో పాటు సమీప భవిష్యత్తులో విద్యుత్ ధరలు, ఒప్పందాలకు సంబంధించి మెరుగైన సిఫార్సులను చేసేలా ఈ కమిటీ కార్యాచరణ ఉండనుంది. అయితే ప్రస్తుతం నియమించిన ఉన్నత స్థాయి కమిటీ అజెండాలో… జగన్ చెప్పిన ఆ రూ. 2,636 కోట్ల రికవరీ, న్యాయపరమైన చర్యల గురించి ప్రస్తావించలేదు.

ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించిన తర్వాత ప్రధానిని కలవడానికి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లిన సమయంలో… అక్కడ మీడియాతో .. ఈ పీపీఏల ప్రస్తావన తెచ్చారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను రద్దు చేస్తామని ప్రకటించారు. ఆ తర్వాత కేంద్ర ఇంధన కార్యదర్శి నుంచి ఏపీ సర్కార్‌కు ఓ లేఖ వచ్చింది. కాంపిటీటీవ్ బిడ్డింగ్‌లోనే… సౌర, పవన్ విద్యుత్ కొనుగోళ్లు జరిగాయని.. అదీ కూడా రెగ్యులేటరీ ద్వారానే జరిగాయని.. పెట్టుబడిదారులను… ఆందోళనకు గురి చేస్తే.. భవిష్యత్ విద్యుత్ ఉత్పత్తి లక్ష్యాలకు గండి పడుతుందని.. లేఖలో పేర్కొన్నారు. అయినప్పటికీ.. ముందుకే వెళ్లాలని ఏపీ సర్కార్ నిర్ణయించుకుంది. ప్రస్తుతం కమిటీని ప్రకటించింది. అయితే ముందే జగన్ లెక్క చెప్పిన తర్వాత కమిటీ ఏం చేస్తుందన్నది ఆసక్తికరం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇద్ద‌రు వ‌ర్మ‌ల్లో.. ఫ‌స్టు ఎవ‌రు?

క‌రోనాపై సినిమా తీసేశాన‌ని ప్ర‌క‌టించాడు రాంగోపాల్ వ‌ర్మ‌. ఆ సినిమా టీజ‌ర్‌కూడా విడుద‌ల చేసి అంద‌రికీ షాక్ ఇచ్చాడు. వ‌ర్మ ప‌నుల‌న్నీ ఇలానే ఉంటాయి. గ‌ప్‌చుప్‌గా సినిమా లాగించేయ‌గ‌ల‌డు. ఈసారీ అదే ప‌ని...

నిర్మాత‌ల‌కు ఎన్టీఆర్ ఇచ్చే గౌర‌వం అదీ!

నిర్మాత అంటే ఈ రోజుల్లో క్యాషియ‌ర్ కంటే హీనం అయిపోయాడు. నిర్మాత అనే వాడు సెట్లో ఉండ‌డానికి వీల్లేదు అంటూ హీరోలు హుకూంలు జారీ చేసే రోజుల్లోకి వ‌చ్చేశామంటే ప‌రిస్థితి అర్థం చేసుకోవొచ్చు....

లాక్‌డౌన్ 5.0 ఖాయమే..! కాకపోతే పేరుకే..!?

నాలుగో లాక్ డౌన్ గడువు కూడా ముంచుకొస్తోంది. మరో మూడు రోజుల్లో అది కూడా పూర్తవుతుంది. మరి తర్వాత పరిస్థితి ఏమిటి..? తర్వాత కూడా లాక్ డౌన్ పొడిగించాలనే ఆలోచనలనే కేంద్రం ఉంది....

సూర్య బ్ర‌ద‌ర్స్‌ని క‌లిపిన రీమేక్‌

సూర్య హీరోగా నిల‌దొక్కుని, ఓ ఇమేజ్ సాధించిన త‌ర‌వాతే... కార్తి రంగ ప్ర‌వేశం చేశాడు. తాను కూడా... త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే వీరిద్ద‌రూ క‌లిసి ఒక్క సినిమాలోనూ న‌టించ‌లేదు....

HOT NEWS

[X] Close
[X] Close