జగన్ రెడ్డి ప్రజా ఆస్తులను తన ఆస్తులుగా అమ్మేసుకుని .. క్విడ్ ప్రో కో ద్వారా వేల కోట్లు కూడబెట్టి అడ్డంగా దొరికిపోయారు. సీబీఐ కేసులుపెట్టింది. విచారణ చేసింది. ఆధారాలతో సహా అన్నీ కోర్టు ముందు ఉంచింది. కానీ పన్నెండు ఏళ్లుగా ఆ కేసులు కనీసం ట్రయల్‌కు రాలేదు. దేశంలోనే అతి పెద్ద అవినీతి, విదేశీ యూనివర్శిటీల్లో సైతం పాఠ్యాంశంగా మారిన జగన్ రెడ్డి అవినితిపై చర్యలు తీసుకోవడంలో మన వ్యవస్థలు విఫలయ్యాయి. పన్నెండేళ్లు బెయిల్ పై ఉండి ఏకంగా సీఎంగా పదవి చేపట్టి వ్యవస్థల్ని మళ్లీ దుర్వినియోగం చేసి.. మళ్లీ అవినీతికి పాల్పడ్డారు. దీనికి బాధ్యత ఎవరు తీసుకుంటారు ?
డబ్బున్నోడికి చట్టం దాసోహం
రాజ్యాంగం ప్రకారం చట్టం, న్యాయం అందరికీ సమానం. కానీ డబ్బున్నోళ్లకి, పలుకుబడి ఉన్న వాళ్లకు ఇంకొంచెం ఎక్కువ సమానం అని జగన్ రెడ్డి నిరూపిస్తున్నారు. ఆయన ..ఆయన దోపిడీ టీం కలిసి కేసులు విచారణకు రాకుండా ఒకటి తర్వాత ఒకటి ఏకంగా 130 డిశ్చార్జ్ పిటిషన్లు వేశారు. వాటిపై విచారణలకే సమయం గడిచిపోతోంది. కానీ ఇప్పటి వరకూ తీర్పులు రాలేదు. పక్కా ఆధారాలున్నా కేసుల్లో కూడా క్వాష్ పిటిషన్లు వేసి.. వ్యవస్థల టైం ను వృధా చేయడం వ్యూహాత్మకమే. కానీ ఎవరూ దాన్ని నిరోధించలేకపోయారు.
ఇప్పుడు విచారణ జరుపుతోంది ఎనిమిదో జడ్జి
క్వాష్ పిటిషన్లపై ఇప్పుడు విచారణ జరుపుతోంది సీబీఐ కోర్టులో ఎనిమిదో జడ్జి. గత న్యాయమూర్తి విచారణ పూర్తి చేశారు. తీర్పు రిజర్వ్ చేశారు. అనారోగ్యంతో కొంత కాలం సెలవు పెట్టారు. ఈ లోపు ఆయన బదిలీ అయ్యారు. మళ్లీ విచారణ మొదటి నుంచి జరుగుతుంది. ఇలా ఏడు సార్లు జరిగింది. ఇప్పుడు ఎనిమిదో న్యాయమూర్తి విచారణ చేస్తున్నారు. తీర్పులు ఎప్పటికి వస్తాయో తెలియదు. వ్యవస్థల్లో ఇలాంటి లోపాలు ఉంటే.. జగన్ రెడ్డి లాంటి కరుడు గట్టిన క్రిమినల్స్ .. తన ఆట ఆడకుండా ఉంటారా ?
ఒక్కటి కాదు అన్ని నేరాల్లోనూ అదే ఆట
జగన్ రెడ్డి చేసే నేరాలు చిన్నవి కాదు. పెద్ద మాఫియాలా ఉంటాయి. ఆధారాలన్నీ ఉన్నా ఆ మాఫియా వ్యవస్థలతో ఆటాడేసుకుంటుంది. దానికి ప్రజలు అంతో ఇంతో ఇచ్చిన అధికారాన్ని కూడా వాడేసుకుంటారు. వివేకా హత్యకేసు ఏళ్ల తరబడి సాగడానికి ఆయన చేసిన విన్యాసాలే కారణం . బెయిల్ పై ఉండి సీఎం పదివి చేపట్టి ఏకంగా న్యాయవ్యవస్థనే బ్లాక్ మెయిల్ చేసిన వ్యక్తి ఆయన. కాబోయే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పైనే కుట్ర చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే.. జగన్ రెడ్డి వ్యవస్థలకు సైతం ఎంత ప్రమాదకరమో అంచనా వేయడం కష్టం కాదు. కానీ ఆయనదే పైచేయి అవుతోంది. ఇప్పటికి పన్నెండేళ్లు అవుతోంది.
