రిటర్న్ గిఫ్ట్‌తో జగన్‌కు లాభం..! కేసీఆర్‌కు నష్టం…!

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్..చంద్రబాబుకు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్..జగన్‌కు.. పక్కాగా..సూపర్ స్టార్ గిఫ్ట్‌గా అందింది. ఎంపీ స్థానాల్లో… వైసీపీకి దక్కేసీట్లతో కలిపి.. టీఆర్ఎస్‌కు వచ్చే పదహారు సీట్లతో మిక్స్ చేసి… 40 సీట్లు అవుతాయని … ఢిల్లీలో చక్రం తిప్పాలని అనుకున్నారు. అందుకే.. వైసీపీ నేతలకు.. టీఆర్ఎస్ నేతలు కావాల్సినంత సహకారం అందించారు. అది ప్రత్యక్షంగా.. పరోక్షంగా అందింది. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి… ఇరవై మూడు వరకూ పార్లమెంట్ సీట్లు గెలుచుకున్నారు. అత్యధికంగా అసెంబ్లీ స్థానాలను గెలుచుకుని ముఖ్యమంత్రి అవ్వబోతున్నారు. అయితే… జగన్ కు ఉపయోగపడిన రిటర్న్ గిఫ్ట్… కేసీఆర్ కు మాత్రం ఉపయోగపడే అవకాశం ఎంత మాత్రం లేదు.

కేంద్రంలో బీజేపీకి… సంపూర్ణ మెజార్టీ వచ్చింది. అదనంగా మిత్రపక్షాలు కూడా ఉన్నారు. ఇతర పార్టీల మద్దతు అవసరం అయ్యే ప్రశ్నే లేదు. కాబట్టి.. వైసీపీకి వచ్చిన ఎంపీలతో.. టీఆర్ఎస్ చేసేదేమీ కూడా లేదు. అయితే.. జగన్ కు … 23 ఎంపీ సీట్లు వచ్చినప్పటికీ.. టీఆర్ఎస్ కు మాత్రం.. తెలంగాణలో షాక్ తగిలింది. ఆ పార్టీ పదహారు సీట్లు సాధిస్తుందనుకుంటే… సగానికే పరిమితమయ్యే పరిస్థితి ఏర్పడింది. ఓ వైపు వైసీపీనే తన కన్నా.. మూడు రెట్లు అధికంగా సీట్లు సాధించి.. పెద్ద పార్టీగా మారగా… టీఆర్ఎస్ మాత్రం జూనియర్ పార్టీగా మారిపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో సైతం.. టీఆర్ఎస్ సాధించిన సీట్ల కన్నా.. మిన్నగా… వైసీపీ విజయం సాధించింది. ఇప్పుడు… రిటర్న్ గిఫ్ట్ వల్ల.. కేసీఆర్ కు.. ఏదైనా లాభం మిగిలిందా.. అంటే… రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న చంద్రబాబును.. ఓడించడం ఒక్కటే.

ఇప్పుడు.. ఏ విధంగా చూసినా.. టీఆర్ఎస్ కన్నా పెద్ద పార్టీ అయిన వైసీపీ… కేసీఆర్… ఏపీ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఏం చేసినా..మాట్లాడకుండా ఉండే సందర్భం ఉండదు. ఇది … టీఆర్ఎస్ కు ఇబ్బందికరమే. కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్… ఆయనకు నష్టమే కలిగించింది. జగన్ కు.. మాత్రం పక్కాగా లాభం కలిగించిందని అనుకోవాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘మ‌న‌మే’ టీజ‌ర్‌: క్యారెక్ట‌ర్ల మ‌ధ్య క్లాషు!

https://www.youtube.com/watch?v=_4Ff1zVtKkw శర్వానంద్ - శ్రీ‌రామ్ ఆదిత్య కాంబినేష‌న్‌లో 'మ‌న‌మే' రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. కృతి శెట్టి క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ రూపొందిస్తోంది. శ్రీ‌రామ్ ఆదిత్య త‌న‌యుడు ఈ చిత్రంలో...

‘కాంతార 2’లో మోహ‌న్ లాల్‌?

దేశాన్ని కుదిపేసిన క‌న్న‌డ చిత్రం 'కాంతార‌'. ఏమాత్రం అంచ‌నాలు లేకుండా, ఏమాత్రం ప్ర‌మోష‌న్లు చేయ‌కుండానే పాన్ ఇండియా స్థాయిలో విజ‌య ఢంకా మోగించింది. క‌న్న‌డ చిత్ర‌సీమ స్థాయిని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసింది. ఇప్పుడు...

మంత్రి ఉత్తమ్ ఇలాకాలో విద్యార్ధినిలకు అస్వస్థత..రీజన్ అదేనా..?

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులు వరుసగా అస్వస్థతకు గురి అవుతుండటం కలకలం రేపుతోంది. యదాద్రి భువనగిరి జిల్లా గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కు గురై ఇటీవల ఓ విద్యార్ధి...

చిలుకూరుకు పోటెత్తిన భక్తులు…ఫుల్ ట్రాఫిక్ జామ్

కోరిన కోరికల్ని తీర్చే సుప్రసిద్ధ చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తారు. ఆలయ సిబ్బంది అంచనా వేసిన దానికంటే పది రేట్లు ఎక్కువగా రావడంతో క్యూలైన్లు అన్ని నిండిపోయాయి. ఆలయానికి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close