“దిశ చట్టం” తెచ్చిన జగన్..! అత్యాచారానికి పాల్పడితే ఉరి..!

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీలో ఎవరైనా మహిళలపై.. చిన్నపిల్లలపై లైంగిక దాడులకు పాల్పడితే మరణశిక్ష విధిస్తారు. ఈ మేరకు.. మంత్రివర్గం.. ఓ చట్టానికి ఆమోదం తెలిపింది. నిర్ధారించే ఆధారాలున్నప్పుడు 21 రోజుల్లోనే తీర్పు ఇవ్వాలని.. మంత్రివర్గం నిర్ణయించింది. అత్యాచార కేసుల్లో ఏడు రోజుల్లో పోలీస్‌ దర్యాప్తు పూర్తి కావాలి.. ఆ తర్వాత మరో 14 రోజుల్లో కోర్టులో వాదనలు జరగాలి.. చివరిగా 21 రోజుల్లో తీర్పు రావాలనే.. కేబినెట్ నిర్ణయించిన చట్టం ప్రకారం టైమ్ లైన్. ప్రస్తుతం ఇలాంటి కేసుల్లో విచారణ గడువు 4 నెలలు ఉంది. దీన్ని 21 రోజులకు కుదించారు. దీనికి “ఏపీ దిశ చట్టం”గా నామకరణం చేశారు. ఈ చట్టానికి చోటు కల్పిస్తూ.. ఏపీ క్రిమినల్‌ లా చట్టం (సవరణ) 2019కి కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

దీన్ని అసెంబ్లీలో ప్రవేశ పెట్టి ఆమోదిస్తారు. ఈ చట్టం ప్రకారం అత్యాచార కేసులకు సంబంధించి ప్రతి జిల్లాలో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేస్తారు. ప్రత్యేక కోర్టు పరిధిలో యాసిడ్‌ దాడులు, అత్యాచారం కేసులు విచారిస్తారు. సోషల్‌ మీడియాలో మహిళలను కించపరిస్తే కఠిన చర్యలు తీసుకుంటారు. చిన్నారులను లైంగికంగా వేధిస్తే ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. దిశ చట్టంతో పాటు మరికొన్ని సంచలన నిర్ణయాలను ఏపీ కేబినెట్ తీసుకుంది. మహిళలపై దాడులకు పాల్పడితే ఉరి శిక్ష ఖరారు చేసిన ఏపీ సర్కార్.. విధ్వంసాలకు పాల్పడిన కేసులను మాత్రం ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. తుని రైలు దహనం ఘటనలో కేసులను ఎత్తివేస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది.

రైలు దహనం కేసులో… రైల్వే కేసులు ఉండటంతో.. వాటిని కూడా ఎత్తివేయాలని కేంద్రానికి కేబినెట్‌ సిఫార్సు చేసింది. అలాగే.. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తూ… చట్టంలో సవరణలకు కేబినెట్‌ ఆమోద ముద్ర వేసిది. గ్రామ సచివాలయం, వాలంటీర్ డిపార్ట్‌మెంట్‌ ఏర్పాటు, గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ పర్యవేక్షణ కోసం కొత్త శాఖ ఏర్పాటు నిర్ణయాలు కూడా తీసుకున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వెంటిలేటర్‌పై శశికళ..!

ఇరవై ఏడో తేదీన చిన్నమ్మ విడుదలవుతుంది.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను దున్ని పారేస్తుందని... తమిళ మీడియా జోరుగా విశ్లేషిస్తున్న సమయంలో అనూహ్యంగా శశికళ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆమెకు శ్వాస సమస్య...

పవనన్నను అభిమానించారు.. జగనన్నకు ఓటేశారు..!

"పవనన్నను ప్రేమిస్తాం.. జగనన్నకు ఓటేస్తాం.". అంటూ గత ఎన్నికల సమయంలో ఊరూవాడా ఫ్లెక్సీలు వెలశాయి. ఇదంతా వైసీపీ మైండ్ గేమ్ అని.. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌ను ఆయనకు ఓటేయకుండా.. చేసిన ప్రచారంలో భాగమని...

రివ్యూ: సూపర్ ఓవ‌ర్‌

సినిమాకంటూ కొన్ని రూల్స్ ఉంటాయి. కొన్ని అంచ‌నాలు ఉంటాయి. వెబ్ మూవీకి అవేం ఉండ‌వు. కాన్సెప్టు బాగుందా... ప‌నైపోయిన‌ట్టే. కొత్త త‌ర‌హా ప్ర‌య‌త్నాల‌కు.. ఓటీటీ ఓ మార్గం వేసేసింది. నిడివి ఇంత ఉండాలి.....

“సవాల్ పిటిషన్”లో తప్పులు.. వెనక్కిచ్చేసిన సుప్రీం..!

పంచాయతీ ఎన్నికల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం... హైకోర్టు తీర్పును సవాల్ చేయాలని ఆవేశపడింది. ఆ ఆవేశంలో తప్పులు చేసింది. తప్పుల తడకగా సవాల్ పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వ పిటిషన్‌ను విచారణ...

HOT NEWS

[X] Close
[X] Close