చైతన్య : 151 సీట్లు వస్తే అంత “హెడ్‌ వెయిట్” అవసరమా..?

ఎనిమిది నెలల కాలంలో ప్రభుత్వం తీసుకున్న కూల్చివేతలు.. రద్దుల నిర్ణయాలను ప్రశ్నిస్తే.. దేనికీ నిఖార్సయిన సమాధానం రాదు. కానీ అవన్నీ చేయడానికి అధికారం ఉందనే ఆన్సర్ మాత్రం పాలకపక్షం నుంచి వస్తోంది. ప్రజలు 151 సీట్లు ఇచ్చారంటే.. ఏమైనా చేయవచ్చని.. లైసెన్స్ ఇచ్చారనుకుంటున్నట్లుగా ప్రభుత్వ తీరు ఉందనే విమర్శలు …వివాదాస్పద నిర్ణయాల వల్ల వస్తున్నాయి ఒక నిర్ణయం తీసుకుని.. దానికి అడ్డంకులు వస్తే.. మరో నిర్ణయం తీసుకుని.. అక్కడా విమర్శలు వస్తే.. మరింత వివాదాస్పదమైన నిర్ణయం తీసుకుని.. ఎవరేమనుకున్నా డోంట్ కేర్ అన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది.

అసలు నిర్ణయాలకు ప్రాతిపదిక ఏమిటి..?

అమరావతికి రాజధానిగా అంగీకరించి.. ఎన్నికల సమయంలో.. అమరావతే రాజధానిగా ఉంటుందని ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి.. ఇప్పుడు మూడు రాజధానులంటున్నారు. గతంలో తాను చెప్పిన మాటలన్నింటినీ తూచ్ అనేశారు. ఆ నిర్ణయాన్ని శాసనమండలి అడ్డుకుందని… ఏకంగా శాసనమండలి రద్దుకే నిర్ణయించారు. ఇది ఓ వ్యవస్థపై చేస్తున్న హత్యాయత్నమని.. ఫ్యాక్షన్ మనస్థత్వంతో.. తనకు ఎదురు చెప్పారన్న ఉద్దేశంతో… ఆ వ్యవస్థనే లేకుండా చేస్తున్నారు. జగన్… శాసనమండలికి వ్యతిరేకగా ఎప్పుడూ మాట్లాడలేదు. పైగా.. అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్లు ఇవ్వలేకపోయిన ఆశావహులందరికీ..ఎమ్మెల్సీ ఆశ పెట్టారు. బీసీ వర్గాలందరికీ.. ఎమ్మెల్యే టిక్కెట్లు ఇవ్వలేను కానీ… ఎమ్మెల్సీలను చేసి చట్టసభలకు పంపుతానని.. బీసీ గర్జనల్లో… హామీలు గుప్పించిన సందర్భాల్లో ఎన్నో ఉన్నాయి.

ప్రజాస్వామ్యంలో నియంతృత్వం ప్రమాదకరం..!

ప్రజాస్వామ్య భారతంలో ఎంతో మంది ప్రధానమంత్రులు, మరెంతో మంది ముఖ్యమంత్రులు పీఠాలు ఎక్కారు. పాలనలో నియంతలు అనిపించుకున్న వారు కూడా… ఊహించనంత వివాదాస్పద నిర్ణయాలు ఏపీలో జరుగుతున్నాయి. అంతర్జాతీయ వ్యాపార ఒప్పందాలను ఉల్లంఘించడం దగ్గర్నుంచి చరిత్రలో ఎరూ చేయని విధంగా.. ఏకంగా రాజధానినే మార్చే నిర్ణయాలు అందులో ఉన్నాయి. ఇందులో ఏ ఒక్కటీ ప్రజాస్వామ్య బద్ధం తీసుకున్న నిర్ణయమన్న అభిప్రాయం ఎవరికీ రాదు. అధికారం ఉంది.. ఏమైనా చేయగలనన్న నియంతృత్వంతోనే నిర్ణయాలు తీసుకున్నాకన్న అభిప్రాయం కలగడం కూడా సహజమేనని విపక్షాలంటున్నాయి. ఏపీ సర్కార్ నిర్ణయాలు.. కేంద్ర ప్రభుత్వంపైనా ఎఫెక్ట్ పడుతున్నాయి. దేశ పెట్టుబడుల వాతావరణాన్ని దెబ్బ తీశాయి. ప్రజాస్వామ్య పునాదులపైనే దెబ్బ పడుతోంది.

50 శాతం ఓట్లు వస్తే ఏమైనా చేయవచ్చని ఎలా అనుకుంటున్నారు..?

అధికార అహంకారం.. తలకెక్కితే.. ఏ రాజ్యాంగం ప్రకారం తనకు అధికారం దక్కిందో.. ఆ రాజ్యాంగాన్ని కూడా ఉల్లంఘించగలిగే ధైర్యాన్ని తెచ్చుకుంటారు. ఇప్పుడు ఏపీ పాలకుల్లో అదే కనిపిస్తోంది. ఏ చట్టాన్ని లెక్క చేయకుండా పాలన సాగుతోంది ఇంగ్లిష్ మీడియం దగ్గర్నుంచి.. ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేయడం వరకూ.. అన్నింటిలోనూ ఈ జాడ్యం కనిపిస్తోంది. ఇది విపరీత పరిణామాలకు దారి తీస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close