వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా హిందీ విషయంలో తన అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా చెప్పారు. అది జాతీయ భాషగా తేల్చేశారు. తాడేపల్లిలో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన తర్వాత జాతీయ మీడియాకు కూడా ఇంటర్యూలు ఇచ్చారు. ఇందులో ఓ రిపోర్టర్ హిందీ వివాదంపై మాట్లాడితే.. అది నేషనల్ లాంగ్వేజ్ అని తేల్చేశారు. దాంతో అందరూ ఆశ్చర్యపోవాల్సి వచ్చింది.
ఒక రోజు ముందే నారా లోకేష్ హిందీ జాతీయ భాష అని చెబితే.. వైసీపీకి చెందిన చాలా మంది.. సోషల్ మీడియాలో ట్రోల్స్ చేశారు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అదే అభిప్రాయంతో ఉన్నారు. జరుగుతున్న వివాదాన్ని ఆయన ఏ మాత్రం పట్టించుకోలేదు. హిందీ నేర్చుకోవడం తప్పేం కాదన్నట్లుగా ఉన్నారు. ఇప్పుడు మరి లోకేష్ ను ట్రోల్ చేసిన వాళ్లు జగన్ నూ ట్రోల్ చేస్తారా అంటే.. ఆ బాధ్యత టీడీపీ వాళ్లు తీసుకుంటారని అనుకోవచ్చు.
హిందీని బీజేపీకి అంటగట్టేశారు. ఇతర రాష్ట్రాల్లో హిందీ నేర్చుకోవడం అంటే బీజేపీకి ఓటేయడమే అన్నట్లుగా రాజకీయం మార్చేశారు. అన్ని భాషలు నేర్చుకోవచ్చు కానీ హిందీని మాత్రం వద్దంటున్నారు. తమిళనాడు, కర్ణాటకే కాదు మహారాష్ట్రలో కూడా థాక్రే బ్రదర్స్ ఈ రాజకీయం అందుకున్నారు. ఏపీలో మాత్రం అందరూ హిందీకి ఫ్యాన్స్ గానే ఉన్నారు. లేని జాతీయభాష హోదా కూడా ఇచ్చేస్తున్నారు.