ప్రెస్మీట్లు పెట్టడం .. డిట్ చోరీ అంటూ ఏడుపుందుకోవడం జగన్కు రొటీన్ వ్యవహారంగా మారింది. గత ప్రెస్మీట్లో టాపిక్స్ తో ఇంకా ట్రోలింగ్ స్టఫ్ వైరల్గా ఉండగానే మళ్లీ ప్రెస్మీట్ పెట్టారు. ఈ సారి భూసర్వే క్రెడిట్ చోరీ చేస్తున్నారని ఏడుపందుకున్నారు. చంద్రబాబు క్రెడిట్ చోరీ చేస్తున్నారని.. సజ్జల రామకృష్ణారెడ్డిటీం రాసిచ్చిన పదాల్లో తన బాధను వెళ్లగక్కారు.
భూముల రీసర్వే క్రెడిట్ ను జనం జగన్ కే ఇచ్చారు. ఆయన చేసిన తప్పుల తడకల రీ సర్వేలు, రీ సర్వేను అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా భూములు దోచుకున్న వైనం, సర్వే హద్దురాళ్లపైనా తన బొమ్మను వేసుకునే నీచత్వం, చివరికి తన సొమ్మేదో రైతులకు రాసిస్తున్నట్లుగా పాసు పుస్తకాలపైనా తన బొమ్మలేసుకున్న నిర్వాకం అందరూ చూసి.. ఆ క్రెడిట్ ఆయనకే ఇచ్చేసి.. మళ్లీ లేవకుంతా పాతాళంలోకి తొక్కేశారు. అయినా జగన్ రెడ్డి ఆ క్రెడిట్ చంద్రబాబు తీసుకుంటున్నారని ఏడ్చుకుంటూ వస్తున్నారు.
భూముల రీసర్వే ఆయన చేసిందిపరిమితం. ఆ పరిమితంలోనూ అన్నీ తప్పుల తడకలే. ఇప్పుడు మొత్తం సమగ్రంగా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అయినా అసలు ప్రభుత్వం చేసే పనుల్లో ఈ క్రెడిట్ చోరీలు ఏమిటో ఆయనకే తెలియాలి. కష్టపడి ఓ పరిశ్రమను తీసుకొచ్చినా.. నిధులు సమీకరించి ఓ ప్రాజెక్టు కట్టినా సరే గొప్పతనం అనుకోవచ్చు. తప్పుల తడకలభూసర్వే చేయించి దాని దెబ్బకు ఘోరంగా ఓడిపోయి ఇంట్లో కూర్చుని .. నా క్రెడిట్..నా క్రెడిట్ అనే గగ్గోలు పెట్టే లీడర్ ఆయనే అయి ఉంటారు. ఏమీ చేయకపోయినా అన్నీ చంద్రబాబు ఖాతాలోకి పోతున్నాయని తనకు తాను బాధపడి.. అదే పనిగా క్రెడిట్ చోరీ అని ఏడిస్తే.. జనం పాపం అనుకోరు… అసహ్యించుకుంటారు.