జగన్ ల్యాండ్ మార్క్ డైలాగ్.. అధికారంలోకి రాగానే న్యాయం చేస్తా.. అధికారంలోకి రాగానే సాయం చేస్తా.. ఆయన అధికారంలోకి వచ్చారు.. పోయారు కూడా. పదేళ్ల పాటు చేస్తానని చెప్పిన ఎవరికీ సాయం చేయలేదు.ఇప్పుడు మళ్లీ ఆ డైలాగ్ వాడటం ప్రారంభించారు. నమ్మకచస్తారా అన్నట్లుగా ఆయన తీరు ఉంటుంది.
విజయవాడలో జోజినగర్ అనేప్రాంతంలో ఓ ప్రైవేటు భూ వివాదం ఉంది. కొంత స్థలంలో 42 మంది.. ఓ వ్యక్తి దగ్గర స్థలం కొని ఇళ్లు కట్టుకున్నారు. అయితే ఆ వ్యక్తి ఆ స్థలాన్ని అంతకు ముందే అమ్మేసుకున్నారు. తర్వాత ఆ స్థలం యజమానులు కోర్టుకెళ్లారు. వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఆ స్థలం ఖాళీ చేసి.. అసలైన కొనుగోలుదారులకు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో ఇళ్లు కట్టుకున్న వారు సుప్రీంకోర్టుకు వెళ్లారు. అయితే స్థలయజమాన్య హక్కు పొందిన వారు ..పోలీసుల సాయంతో ఆ స్థలాన్ని ఖాళీ చేయించుకునేందుకు కూల్చివేతలు చేపట్టారు. తర్వాత ఈ నెలాఖరు వరకు సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది.
అప్పటికే కొన్ని ఇల్లు కూల్చివేశారు. ఈ వివాదంలో బాధితులు ఎయిర్ పోర్టు వద్దకు వస్తే సరిగ్గా మాట్లాడలేదు జగన్. ఇప్పుడు వారి దగ్గరకే వెళ్లారు. ఎప్పట్లాగే ఇది చంద్రబాబు కుట్ర అని ఆరోపణలు చేశారు. తర్వాత తమ ప్రభుత్వం వచ్చాక న్యాయం చేస్తామన్నారు. ప్రభుత్వం వచ్చాక.. ప్రైవేటు భూమి వివాదంలో ఎలాంటి న్యాయం చేస్తారో చెప్పలేదు. కోర్టు తీర్పు ఎవరికి అనుకూలంగా వస్తే వారికే భూమి చెందుతుంది. కోర్టు తీర్పు ఇచ్చినా.. ఆ ఇళ్లు కట్టుకున్న వారికే ఇస్తామని చెప్పడం అబద్దాలు చెప్పడమే.
ఇలా ప్రైవేటు డీల్స్ చేయడం అదికారంలో ఉంటే అసాధ్యం. అయితే సెటిల్మెంట్లు చేయడం అలవాటే కాబట్టి చేస్తానని అన్నారేమో కానీ..ఇప్పటికైతే బాధితులకు పైసా సాయం చేయలేదు కానీ.. ఓటేస్తే చేస్తానన్నట్లుగా కబుర్లు చెప్పి వెళ్లారు.
