తేగేదాకా లాగుతున్న సర్కార్-ఎస్‌ఈసీ..!

ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యాంగసంక్షోభ సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎన్నికల నిర్వహణకు హైకోర్టు కూడా స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత ప్రభుత్వం.. అధికారులు సహకరించడానికి ఏ మాత్రం సిద్ధంగా లేరు. అదే సమయంలో ఎస్‌ఈసీ తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. శనివారం ఉదయం పది గంటలకు ఆయన మొదటి పంచాయతీలకు నోటిఫికేషన్ ప్రకటించబోతున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం సహకరిస్తుందా లేదా అన్నదానితో ఆయన లెక్కలు చూసుకోవడం లేదు. ఆయన పని ఆయన చేసుకెళ్లిపోతున్నారు. ఇప్పటికే మదటి విడతలో ఏ ఏ పంచాయతీలకు ఎన్నికలకు పెట్టారో ఖరారు చేశారు.

అయితే ఎస్‌ఈసీ షెడ్యూల్ విడుదల చేయకుండా నిలువరించేందుకు ప్రభుత్వం చేయాల్సిందంతా చేస్తోంది. హైకోర్టులో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌లో తప్పులు ఉండటంతో రిజిస్ట్రి వెనక్కిపంపారు. దీంతో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వానికి తోడు ఉద్యోగ సంఘాలు కూడా సుప్రీంకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశాయి. అయితే సుప్రీంకోర్టు వాటిని స్వీకరించడానికి నిరాకరించింది. మామూలు పిటిషన్లుగా సోమవారం విచారణ జరుపుతామని తెలిపింది. ఈ సమాచారంతోనే.. ఎన్నికల నోటిఫికేషన్ ఆపడానికి ఏపీ సర్కార్ ప్రయత్నిస్తోంది. సుప్రీంకోర్టు నిర్ణయం వెలువడేవరకూ.. నోటిఫికేషన్ విడుదల చేయవద్దని ఎస్‌ఈసీపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

అయితే ఎస్‌ఈసీ మాత్రం ఇప్పటికే చాలా దూరం వెళ్లిపోయారు. మొదటి సారి ఎన్నికలు వాయిదా పడినప్పుడు.. ఆయన బదిలీ చేయమన్న అధికారుల్ని తక్షణం ఎన్నికల విధుల నుంచి తప్పించాలని మరోసారి డీజీపీ, సీఎస్‌కు లేఖ రాశారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎస్‌ఈసీ ఆదేశాలను ఇరవై నాలుగుగంటల్లో అమలుచేయాల్సి ఉంటుంది. లేకపోతే.. రాజ్యాంగ ధిక్కరణ అవుతుంది. దీంతో అధికారులు కూడా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.

ఎస్‌ఈసీ ఎన్నికలునిర్వహించాలన్న పట్టుదలతో ఉంది. ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్వహించకూడదనుకుంటోంది. ఈ రెండింటి మధ్య ఉన్నతాధికారులు.. ఉద్యోగులు నలిగిపోతున్నారు. ప్రభుత్వ పెద్దల నుంచి వస్తున్న సూచనలకు అనుగుణంగా గవర్నర్ వద్దకు.. కోర్టులకు.. మీడియా ముందుకు ఉద్యోగ సంఘాలనేతలు పరుగులు పెడుతున్నారు. ఎన్నికల నిర్వహణకు సహకరిస్తే.. ఎక్కడ పెద్దల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందోనని ఉన్నతాధికారులు నలిగిపోతున్నారు. ఎన్నికల విషయంలో ఎవరూ వెనక్కి తగ్గకోపవడంతో.. పరిస్థితి తెగేదాకా లాగుతున్నారన్న అభిప్రాయం అంతటా వ్యక్తమవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

లార్డ్స్‌లో భారత్ కోసం ఎదురు చూస్తున్న టెస్ట్ వరల్డ్ కప్..!

ప్రపంచ టెస్ట్ చాంపియన్లుగా అవతరించడానికి భారత్‌కు గోల్డెన్ చాన్స్ వచ్చింది. లార్డ్స్ వేదికగా జూన్ 18 నుంచి ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్‌లో భారత్ న్యూజిలాండ్‌తో తలపడనుంది. అహ్మదాబాద్ లో జరిగిన నాలుగో...

బెజవాడలో టీడీపీ వర్సెస్ టీడీపీ గ్రూప్ తగాదాలు

విజయవాడలో టీడీపీ నాయకులు .. ఎన్నికలకు ముందే ఆ పార్టీని ఓడగొడుతున్నారు. అధికార పార్టీ దూకుడుని తట్టుకుని ఎంతో కొంత గెలుపు చాన్స్ ఉందని అనుకుంటున్న బెజవాడ నేతలు.. పోలింగ్...

బాలకృష్ణ కొడితేనే వైరల్.. కొట్టకపోతే నార్మల్..!

హిందూపురంలో నందమూరి బాలకృష్ణ అభిమానిపై చేయి చేసుకున్నారు. నిజంగా ఆయన కొట్టకపోతేనే వార్త. కొడితే వార్త ఎందుకవుతుంది. పబ్లిక్‌లోకి వచ్చిన ప్రతీసారి తన చేతికి పని చెప్పడం ఆయనకు అలవాటు. ఆయన చేతి...

కర్మాగారానికి కారాగారానికి తేడా తెలియని నాయకులు: విజయసాయి పై బాలయ్య విసుర్లు

మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బాలకృష్ణ ఎన్నికల ప్రచారంలో జోరుగా పాల్గొంటున్నారు. ప్రచారంలో అధికార వైఎస్ఆర్సిపి పార్టీ మీద వరసబెట్టి విమర్శలు చేస్తున్నారు. తాజాగా విజయసాయి రెడ్డిని ఉద్దేశించి బాలయ్య చేసిన విమర్శలు...

HOT NEWS

[X] Close
[X] Close