రైతులకు జగన్ సర్కార్ ఉచిత బోర్లు..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల కోసం మరో పథకాన్ని అమలు చేస్తోంది. ఉచితంగా బోర్లు వేసే పథకానికి వైఎస్ఆర్ జలకళ అనే పేరు పెట్టారు. ఆ పథకాన్ని సోమ వారం నుంచి ప్రారంభిస్తున్నారు. వీటి వసతి లేని పొలాలకు బోర్లే ఆధారం. ఆ బోర్లు వేయడానికి రైతులు.. లక్షలు ఖర్చు చేస్తున్నారు. ఈ కారణంగా వారు అప్పుల ఊబిరిలోకి కూరుకుపోతున్నారు. జగన్ పాదయాత్రలో ఈ విషయాన్ని గుర్తించారు. అందుకే రైతులందరికీ ఉచితంగా బోర్లు వేయించాలని నిర్ణయించారు. ఈ మేరకు మేనిఫెస్టోలో పెట్టారు. ఇప్పుడు అమలు ప్రారంభించారు. ఈ పథకం అమలుకు ప్రభుత్వం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది. బోర్లు వేయించుకోవాలనుకునే రైతుల దరఖాస్తులు, పరిస్థితి, అనుమతులు, బోరు తవ్వకం, బిల్లుల చెల్లింపు తదితర అంశాలన్నీ సాఫ్ట్‌వేర్‌లో ఉండేలా రూపొందించారు. దరఖాస్తు చేసుకున్న తర్వాత ప్రతి దశకు సంబంధించిన వివరాలతో రైతుకు సమాచారం పంపుతారు.

రైతులు ఆన్‌లైన్‌లోనే కాకుండా వాలంటీర్ల ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. పట్టాదార్‌ పాస్‌ బుక్, ఆధార్‌ కార్డు కాపీతో గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. బోరు డ్రిల్లింగ్‌ వేసేముందు రైతు పొలంలో హైడ్రో జియోలాజికల్, జియోఫిజికల్‌ సర్వే నిర్వహిస్తారు. బోరు వేయించుకోవాలంటే కనీసం రెండున్నర ఎకరాలు ఉండాలి. అలాగే ఐదు ఎకరాల కంటే ఎక్కువ ఉంటే బోర్లు వేయరు. ఇద్దరు ముగ్గురు రైతులు కలిసి ఓ బోరు వేయించుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. గతంలో బోర్లు వేసి ఉన్న పొలాల్లో మళ్లీ బోర్లు వేయరు.

ఈ పథకం అమలు కోసం.. మొత్తంగా బోర్‌వెల్స్‌ వాహనాలను కొనాలని ప్రభుత్వం అనుకుంది. కానీ సాధ్యం కాలేదు. దాంతో బోరుకు ఇంత అని కాంట్రాక్ట్‌కు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మరో వైపు ఈ పథకంపై విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. బోరు తవ్వి వదిలేస్తే.. మోటార్లు ఎవరిస్తారు అని ప్రశ్నిస్తున్నారు. గత ప్రభుత్వంలో సోలార్ పంప్ సెట్ ఇచ్చే వారని.. ఉచిత కరెంట్ కనెక్షన్ ఇచ్చే వారని.. ఈ సారి ఇలా ఇచ్చే అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదంటున్నారు. పైగా… నీళ్లు పడనప్పటికీ.. గతంలో బోర్లు వేసిన పొలాల్లో మళ్లీ బోర్లు వేయమని చెప్పడం.. ఐదు ఎకరాలు మాత్రమే నిబంధన పెట్టడంతో చాలా మందికి అవకాశం దక్కదంటున్నారు. పైగా బోర్ వెల్స్ కూడా పరిమితంగానే ఉండటంతో ఎప్పుడు వేస్తారో తెలియని పరిస్థితి ఏర్పడుతుందంటున్నారు. అయితే ఇలాంటి సమస్యలన్నింటినీ పరిష్కరించాలన్న పట్టుదలతో ప్రభుత్వం ఉంద.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close