జగనన్న ఇల్లు రూ. లక్షా ఎనభై వేలు..!

ఆంధ్రప్రదేశ్‌లో ఇల్లు లేని వారు ఉండకూడదన్న లక్ష్యంతో ఉన్న ఏపీ సర్కార్ 30 లక్షల ఇళ్లను నిర్మిస్తోంది. క్రిస్మస్ రోజున ఇళ్ల మంజూరు పత్రాలు కూడా మంజూరు చేశారు. పంపిణీ చేస్తున్నారు. ఇళ్ల నిర్మాణం కూడా నిన్నటి రోజునే ప్రారంభిస్తామని ప్రకటనలు చేసింది కానీ ఎక్కడా ప్రారంభించిన దాఖలాలు లేవు. కానీ ప్రభుత్వం .. లబ్దిదారులకు ఓ ఆఫర్ ఇచ్చింది. మూడు ఆప్షన్స్ ఇచ్చి… ఎంచుకోమని కోరింది. అందులో మొదటి రెండు లబ్దిదారులకు డబ్బులు ఇస్తే కట్టుకునేలా.. మూడోది ప్రభుత్వమే నిర్మించుకునేలా ఆప్షన్ ఉంది. మొదటి రెండు ఆప్షన్లలో ప్రభుత్వం ఇచ్చే మొత్తం సొమ్ము రూ. లక్షా ఎనభై వేల రూపాయలు మాత్రమే.

వాటితో బెడ్ రూం, కిచెన్, హాల్, వరండా ఉన్న శ్లాబ్ ఇల్లు ఇలా వస్తుందనేది చాలా మందికి మిస్టరీగా మారింది. కానీ ప్రభుత్వం మాత్రం… మోడల్ హౌస్ కట్టి చూపించింది. ప్రదర్శనకు పెట్టింది. దానికి రూ. లక్షా ఎనభై వేలు మాత్రమే ఖర్చు అయిందని ప్రభుత్వం చెబుతోంది. అందుకే.. అంత మాత్రమే లబ్దిదారులకు ఇస్తామంటోంది. అయితే వాస్తవంగా.. ఒక్క ఇల్లు కట్టుకోవాలంటే… అదీ కూడా ప్రభుత్వం చెప్పిన ప్రమాణాల్లో కట్టుకోవాలంటే ఎడెనిమిది లక్షలు అవుతుందనేది నిర్మాణ రంగంలో ఉన్న వారు చెప్పే మాట. 340 చదరపు అడుగుల ఇల్లు కట్డడానికి తాపీ మేస్త్రీలే … 70వేలు వసూలు చేస్తారని.. ఇక సెంట్రింగ్ సహా ఇతర పనులన్నింటికీ ఎక్స్‌ట్రా అవుతాయని గుర్తు చేస్తున్నారు.

ఇక మెటీరియల్ సంగతి చెప్పాల్సిన పని లేదు. గత మూడు నెలల కాలంలో ఇరవై శాతం వరకూ పెరిగాయి. ప్రభుత్వం.. డబ్బులు ఇస్తే.. లబ్దిదారులు సగం కట్టుకుని పూర్తి చేసే దారి లేక… ఆపేస్తారు. అదే ప్రభుత్వమే నిర్మిస్తే సమస్య లేకుండా ఉంటుందంటున్నారు. లబ్దిదారులకు డబ్బులిస్తామని చెప్పడం కన్నా.. ప్రభుత్వం నిర్మిస్తేనే… జగన్ చెప్పినట్లు ఇళ్లు మాత్రమే కాదు ఊళ్లను కూడా శరవేగంగా నిర్మించడానికి అవకాశం ఉంటుందన్న చర్చ నడుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘జై హ‌నుమాన్‌’లో తేజా స‌జ్జా లేడా?

'హ‌నుమాన్తో' తేజా స‌జ్జా ఒక్క‌సారిగా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఇప్పుడు సీక్వెల్‌గా 'జై హ‌నుమాన్' రూపుదిద్దుకొంటోంది. ఇందులో తేజా స‌జ్జా ఉంటాడా, ఉండ‌డా? అనేది పెద్ద ప్ర‌శ్న‌. నిజానికి ఈ సినిమాలో...

RRR రికార్డ్ బ్రేక్ చేసిన ‘పుష్ష 2’

'పుష్ష 2' రికార్డుల వేట మొద‌లైంది. మొన్న‌టికి మొన్న 'పుష్ష 2' హిందీ డీల్ క్లోజ్ అయ్యింది. దాదాపు రూ.200 కోట్లు హిందీ రైట్స్ రూపంలో వ‌చ్చాయి. ఆడియో రైట్స్ విష‌యంలోనూ పుష్ష...
video

‘మిరాయ్‌’… 20 రోజుల్లోనే ఇంత తీశారా?

https://www.youtube.com/watch?v=xnubQ829q0c తేజ స‌జ్జా, కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని కాంబినేష‌న్ లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి 'మిరాయ్‌' అనే టైటిల్ ఫిక్స్ చేసిన‌ట్టు తెలుగు 360 ముందే చెప్పింది. ఇప్పుడు అదే...

కోమ‌టిరెడ్డిలో మ‌రో కోణం… కొడుకు పేరుతో సేవ!

నిత్యం ఆరోప‌ణ‌లు, ప్ర‌త్యారోప‌ణ‌లు... వేలాది మంది కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు.. హ‌డావిడి. వైఎస్ హాయం నుండి వేగంగా ఎదిగిన మంత్రి కోమటిరెడ్డి, సేవా కార్య‌క్ర‌మాల్లోనూ నేనున్నా అని అండ‌గా ఉంటారు. ముఖ్యంగా కోమ‌టిరెడ్డి కుమార్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close