“తన మతంలో ఇలా జరిగి ఉంటే జగన్ ఇలాగే స్పందించేవారా” అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వేసిన ప్రశ్న ఇప్పుడు వైసీపీలో మార్మోగిపోతోంది. ఏదో ఒకటి చెప్పాలని ఉన్న పళంగా అంబటి రాంబాబును సజ్జల రంగంలోకి దింపారు. ఆయన వచ్చి జగన్ ఆలయాలు కట్టించాడు..ధర్మాన్ని రక్షించాడని పాస్టర్ టైపులో ప్రసంగం చేసి… కౌంటర్ ఇచ్చాను చూశారా అన్నట్లుగా బిల్డప్ ఇచ్చారు. ఇవన్నీ సరే అసలు జగన్ క్రైస్తవుడా.. హిందువుడా అన్నది మాత్రం ఆయన చెప్పలేదు. అంతటి ధైర్యం చేయలేదు. పవన్ వేసిన స్కెచ్ ఎంత వైసీపీని ఎంత ఉక్కిరిబిక్కిరి చేస్తుందో ఈ ఒక్క అంశమే తేల్చేస్తోంది.
జగన్ను వెంటాడుతున్న తిరుమల పాపాలు
జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరవాత దేవుడితో ఆటలాడుకున్నారు. ఎంపీ సీటు ఇవ్వనందుకు ప్రతిఫలంగా బాబాయ్ సుబ్బారెడ్డికి టీటీడీ చైర్మన్ పోస్టు ఇచ్చారు. నాలుగేళ్ల పాటు ఆయనదే రాజ్యం. ఆయనకు అంతకు మించి దోచుకోవడానికి దొరకదన్నట్లుగా దోచుకున్నారు. కానీ ఎప్పటికైనా పాపం పండాల్సిందే. ఇ్పపుడు పండిపోయింది. ఆయన ఒక్కడే కాదు ఐదేళ్ల కాలంలో జరిగిన దోపిడీ వ్యవహారాలు రోజుకొకటి బయటకు వస్తూంటే ప్రజలంతా ఆశ్చర్యపోతున్నారు. ఇదంతా ఎందుకు జరిగిందంటే.. జగన్ రెడ్డి ఆ దేవుడ్ని నమ్మరన్న కారణమే బయటకు వస్తోంది. తన దేవుడు ఏసుప్రభువు మాత్రమే. ఇతర మతాల పట్ల ఆయనకు నమ్మకం లేదు. రాజకీయంగా హిందువుల ఓట్లు కావాలి కాబట్టే ఆయన తాను క్రైస్తవుడ్నని బహిరంగంగా చెప్పుకోలేరు. కానీ ఆయన తన మతాన్ని బహింరంగంగా చెప్పుకునేలా చేయాలని పవన్ కల్యాణ్ ట్రాప్ వేస్తున్నారు.
జగన్ ఏం చేశాడో కళ్ల ముందే ఉంది.. వైసీపీ చెప్పుకోవాల్సింది వేరే !
హిందువులకు, హిందూత్వానికి జగన్ ఏం చేశాడో అందరూ చూస్తున్నారు. ఆయన గుళ్లు కట్టించారని చెప్పగానే కట్టించేసి ఉండరు. కేవలం మత రాజకీయాల కోసం ఆయన డ్రామాలేశారు. ఆయన కట్టించారో లేదో అందరూ చూశారు. మత మార్పిళ్లను ఓ ఉద్యమంలా ఎలా చూశారో జనం చూశారు. స్వయంగా ఎమ్మెల్యేలు మతమార్పిళ్లను ప్రోత్సహించారు. ఇలాంటివన్నీ కళ్ల ముందు ఉండగానే జగన్ హిందువుల్ని ఉద్దరించారని ప్రచారం చేసుకుంటున్నారు. అలా చెప్పుకున్నంత మాత్రాన నమ్మేయరు కదా. అసలు జగన్ కు.. హిందూ దేవుళ్లపై నమ్మకం ఉందని ఆయన నిరూపించుకోవాలిగా !
ధైర్యం ఉంటే హిందువునని లేదా క్రైస్తవుడ్నని ప్రకటించుకోవచ్చుగా!
పవన్ కల్యాణ్ తాను హిందువునని ధైర్యంగా ప్రకటించుకుంటారు. ఆయన సతీమణి క్రైస్తవాన్ని ఆచరిస్తారు. అయినా ఆమె హిందూ దేవుళ్లను నమ్ముతారు. ఇటీవల స్వయంగా తిరుమలను దర్శించుకుని డిక్లరేషన్ ఇచ్చి..తలనీలాలు కూడా సమర్పించారు. అలా జగన్ రెడ్డి కూడా తాను కూడా క్రైస్తవాన్ని ఆచరిస్తానని కానీ అందరు దేవుళ్లపై నమ్మకం ఉందని డిక్లరేషన్ ఇచ్చి తలనీలాలు ఇచ్చి ఉంటే ఆయన ఇమేజ్ పెరిగి ఉండేది. కానీ ఆయన నమ్మకం ఉందని చెప్పాల్సి వస్తుందని.. ఆయన తిరుమలకు వెళ్లడం లేదు. ఆయన కుటుంబ సభ్యుల గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇతర దేవుళ్లపై నమ్మకం లేదని చెప్పకపోయినా ఇప్పుడు ఆయన తాను క్రైస్తవుడ్నని బహిరంగంగా ఒప్పుకోవాల్సిన పరిస్థితిని పవన్ కల్పిస్తున్నారు. లేకపోతే ఇప్పుడు ఎక్కడికి వెళ్లినా తిరుమలలో జగన్ చేసిన పాపాలే గుర్తుకు వస్తాయి. ఆయనను ఎక్కడ చూసినా ఆయన మతమే గుర్తుకు వస్తుంది. ఇది జగన్కు పెను ప్రమాదంగా మారనుంది
