జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు రాజకీయనాయకుడిగా చేయాల్సిన కొన్ని పనులు గుర్తుకు వస్తున్నాయి. అందులో ఒకటి జనంను కలవడం. కనీసం కలిసినట్లుగా నటించడానికైనా ఏర్పాట్లు చేసుకోవాలని అర్జంట్ గా ెడీ అయిపోయారు. ప్రజాదర్బార్ పెట్టబోతున్నారని వైసీపీ వర్గాలు మీడియాకు లీక్ చేశారు.
జగన్ రెడ్డి సీఎం కాదు.. సీఎంగా ఉన్నప్పుడు ప్రజాదర్బార్ పెడితే ప్రయోజనం ఉంటుంది. వచ్చిన వారి సమస్యలు పరిష్కరించవచ్చు. ఇప్పుడు ఆయన పులివెందుల ఎమ్మెల్యే. అక్కడి ప్రజలకు అందుబాటులో ఉండటానికి దర్బార్లు పెట్టవచ్చు. టీడీపీ ఎమ్మెల్యేలు ప్రజాదర్బార్ లు పెడుతున్నారు. లోకేష్ రోజూ పెడుతున్నారు. సమస్యలు పరిష్కరిస్తున్నారు. ఇప్పుడు అర్జంట్ గా తాను కూడా అదే చేయాలని జగన్ ఎందుకు అనుకుంటున్నారో కానీ ప్యాలెస్ లోనే ప్రజాదర్బార్ పెడతానని అంటున్నారు.
ఇప్పుడు ఆయన వద్దకు సాధారణ ప్రజలు రారు. ఎందుకంటే సమస్యలు పరిష్కరించే అధికారం ఆయనకు లేదు. ఆయన దగ్గరకు వచ్చేది సొంత పార్టీ నేతలు. జగన్ దెబ్బకు సర్వం కోల్పోయిన వారు… ఐదేళ్లలో తమకు ఏమీ చేయలేని నిష్ఠూరమాడేవారు.. చెప్పుకోవడానికి వస్తారు. బిల్లులు ఇవ్వలేదని.. ఏం చేయాలని అడగడానికి వస్తారు. వారు కూడా ప్రజలే. కానీ వారి సమస్యలకు కారణం జగన్. అందుకే ఆయనే పరిష్కరించాలని అడగడానికి వస్తారు. ఇందు కోసం పెట్టాల్సిన పేరు క్యాడర్ దర్బార్ కానీ.. ప్రజా దర్బార్ కాదు.
ఐదేళ్ల పాటు తానో దైవాంశ సంభూతుడినని.. తనను కలవాలంటే తపస్సు చేయాల్సిందేనన్నట్లుగా వ్యవహరించారు. ఇప్పుడు … తాను అందుబాటులో ఉంటానంటూ ముందుకొస్తున్నారు. కాల మహిమ ఎలా ఉంటుందో ఆయనకైనా అర్థమవుతుందో లేదో ?