వైఎస్ జగన్ రెడ్డి అనర్హతా భయంతో బితుకుబితుకు మంటున్నారు. ప్రెస్మీట్ పెట్టి చాలా రోజులు అయింది ప్రజలు మర్చిపోతారని అనుకున్నారేమో కానీ ప్రెస్మీట్ పెట్టి పాత స్క్రిప్టునే కొత్తగా చదివారు.తాను సీఎంగా ఉన్నప్పుడు ప్రజలంతా… స్వర్గంలో అమృతం తాగుతూ ఉండేవారని.. ఇప్పుడు చంద్రబాబు హయాంలో నరకంలో ఉన్నట్లుగా ఆయన చెప్పుకొచ్చారు. రైతు పోరులో రైతులు ఎవరూ పాల్గొనలేదు. కనీసం పాల్గొనలేదు. యూరియా సమస్యను పద్దతిగా ప్రభుత్వం డీల్ చేస్తోంది. అయినా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారు. చంద్రబాబుపై ఎప్పట్లా నోరు పారేసుకున్నారు.
అయితే ఆయన అనర్హతా వేటుపై భయపడుతున్నారని మాటల్లోనే తేలిపోయింది. అసెంబ్లీకి రాకపోతే అనర్హతా వేటు వేస్తామని డిప్యూటీ సీఎం రఘురామ చెబుతున్నారు కదా.. అంటే.. నాకు ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వట్లేదో ముందు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయనకు అర్హత లేదని.. ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని స్పీకర్ చెబుతున్నారు. తాను కోర్టుకు వెళ్లానని.. కోర్టుకు సమాధానం చెప్పాలని జగన్ చెబుతున్నారు. కోర్టుకు వెళ్లిన ఆయన.. ఇక విషయం కోర్టులో తేలుతుంది కాబట్టి .. అసెంబ్లీకి హాజరవడానికి వచ్చిన కష్టమేంటో ఆయన చెప్పడం లేదు.
అసెంబ్లీ వ్యవహారాలకు.. కోర్టుకు సంబంధం ఉండదు. అసెంబ్లీ రూల్స్ ప్రకారం.. స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు. అలాంటి నిర్ణయం తీసుకున్నా కోర్టుకు కూడా జోక్యం చేసుకోలేవు. అది తెలిసి కూడా.. ముందు తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని మారాం చేయడం జగన్ రెడ్డికే చెల్లింది. గతంలో చంద్రబాబు ఎన్ని రోజులు అసెంబ్లీకి వచ్చాడని జగన్ ప్రశ్నించారు. అప్పుడు అనర్హతా వేటు ఎందుకు వేయలేదో అప్పటి స్పీకర్ తమ్మినేనిని జగన్ అడగాల్సి ఉంది. ఎలా చూసినా జగన్ రెడ్డిలో రోజు రోజుకు ఫ్రస్ట్రేషన్ పీక్స్ కు చేరుతోంది. రాజకీయం చేత కాక తిట్లు, పిల్లి శాపాలపై ఆధారపడుతున్నారు.