ఐటీని వెళ్లగొట్టి సెక్రటేరియట్ పెడితే విశాఖకు ఏం లాభం..!?

విశాఖను రాజధానిగా చేయాలనుకుంటున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. అభివృద్ధి వికేంద్రీకరణ అంటూ సెక్రటేరియట్ ను అక్కడికి తీసుకుపోతున్నారు కానీ.. అక్కడ ఉన్న ఐటీ సంస్థలన్నింటినీ ముందుగానే వెళ్లగొడుతున్నారు. ఇందు కోసం.. ఐటీ సెజ్‌ను.. డీ నోటిఫై చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకూ ఐటీ సెజ్‌లో ఐటీ సంస్థలు మాత్రమే కార్యకలాపాలు నిర్వహించాలి. ఆ మేరకు సెజ్‌లో నోటిఫై చేశారు. కానీ.. జగన్మోహన్ రెడ్డి సర్కార్.. ఐటీ సెజ్ ను… పరిపాలన సెజ్ గా మార్చే ప్రయత్నం చేస్తోంది. డీనోటిఫై చేసి.. అక్కడ.. సెక్రటేరియట్..సీఎం ఆఫీస్ పెట్టాలనుకుంటోంది.

మధురవాడ ఐటి సెజ్‌ హిల్‌ నెంబర్‌-3, ఐటి పార్కు హిల్‌ నెంబరు-2, హిల్‌ నెంబరు-1 రుషికొండల్లో అనేక ఐటీ సంస్థలకు గత ప్రభుత్వం భూములు ఇచ్చింది. చాలా వరకూ పెట్టుబడుల దశల్లో ఉన్నాయి. వీటిల్లో అనేక ఒప్పందాలను కొత్త ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది. ఇందులో.. రూ. 70వేల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమైన ఆదాని కూడా ఉంది. అక్కడే చంద్రబాబు.. ఏడాదిన్నరలో కట్టించిన.. మిలీనియం టవర్ పై ఇప్పుడు అధికార పార్టీ కన్ను పడింది. పెద్ద సాఫ్ట్ వేర్ కంపెనీలను ఆహ్వానించడానికి దాన్ని నిర్మించారు చంద్రబాబు. కొన్ని కంపెనీలు.. ఒప్పందాలు చేసుకున్నాయి. కాండ్యూయెంట్ కంపెనీ పదిహేను వందల మంది ఉద్యోగులతో కార్యకాలాపాలు ప్రారంభించింది. ఇప్పుడీ కంపెనీని వెళ్లగొట్టేశారు.

చంద్రబాబు హయాంలో.. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సహా..అనేక కంపెనీలు విశాఖకు రావడానికి చంద్రబాబు హయాంలో ఒప్పందాలు చేసుకున్నాయి. వాటికి సంబంధించిన కార్యాకలాపాలు సాగుతూండగానే… జగన్మోహన్ రెడ్డి సర్కార్.. ఐటీ ని పిటీగా మార్చేసింది. గత వారం తెలంగాణలోని వరంగల్ లో ప్రారంభమైన కొన్ని ఐటీ కంపెనీలు.. వాస్తవానికి విశాఖలో పెట్టాల్సి ఉంది. వాటికి సంబంధించి చంద్రబాబు ఎంఓయూలు కూడా చేసుకున్నారు. కానీ జగన్ సర్కార్ తీరుతో..ఎందుకొచ్చిన గొడవా అని వరంగల్ కు వెళ్లిపోయాయి. ఇప్పుడు ఐటీని పూర్తిగా తరిమేసి…. రాజధానిగా అభివృద్ధి చేయాలని జగన్ తలపోస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close