వైసీపీ అధినేత జగన్ రెడ్డి ఏ ఫేక్ లోకంలో ఉండి పాతాళానికి పడిపోయాడో .. ఆ ఫేక్ లోకం నుంచి బయటకు రావడం లేదు. అసలు నిజం కన్నా తాను చెప్పేదే నిజం అనుకుంటున్నారు. అదే పదే పదే చెబుతున్నారు. నిజాలు ప్రజల కళ్ల ముందు ఉన్నా.. తాను చెప్పేది నమ్మేవాళ్లు ఉంటారు కాబట్టి అదే చెబుతానన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కానీ ఆయన ఫ్యాన్స్ అయినా.. చంద్రబాబుపై. వ్యతిరేకత ఉన్న వారికైనా.. నిజాలు నిజంగానే తెలుస్తాయి. పైకి తెలియనట్లుగా ఉండవచ్చు కానీ.. మరీ అంత ఫేక్ బతుకులు బతకరు.
కానీ జగన్ రెడ్డి మాత్రం ఆ ఫేక్ లోకంలోనే బతికేస్తున్నారు. తాను అనుకునేదే నిజం అని ఆయన భావిస్తున్నారు. ప్రజల్ని మభ్యపెట్టడానికి వరకే అయితే సరే రాజకీయం చేస్తున్నారని అనుకోవచ్చు. కానీ నిజంగానే అదంతా నిజం అని ఆయన నమ్ముతున్నట్లుగా ఉంది. జగన్ రెడ్డికి వ్యక్తిగత ఆలోచనలు, తెలివి తేటల స్థాయి ఏమిటో వైసీపీ నేతలకు తెలుసు. ఆయనకు తెలిసింది .. ఎక్స్ పర్ట్ అయింది ఒక్క క్రిమినల్ ఆలోచనల్లో మాత్రమే. డబ్బు సంపాదన, దోపిడీలు, నేరాల్లో మాత్రమే ఆయనకు పట్టు ఉంది. మిగతా విషయాలపై ఆయనకు అవగాహన ఉండదు.
చివరికి తన సన్నిహిత అధికారుల్లో అత్యంత కీలకమైన కాంతిరాణా టాటా అనే ఐఏఎస్ పేరు కూడా ఆయనకు గుర్తు ఉండదు. అలాంటి వ్యక్తిని కొంత మంది తమ గుప్పిట్లో పెట్టుకుని పప్పెట్ లా ఆడిస్తున్నారు. ఆయనను ఫేక్ వీరుడిగా మారుతున్నారు. మాయాలోకంలో బతికే జీవిగా మారుస్తున్నారు. విజయసాయిరెడ్డి చెప్పినట్లుగా నిజాలు తెలుసుకునేందుకు జగన్ కు ఓపిక లేదు.. వాటిని చెప్పేందుకు ఆయన కోటరీ సిద్ధంగా లేదు. ఇలా తనను తాను మోసం చేసుకుంటూ జగన్ రెడ్డి ఏం సాధిస్తారో?