జగన్ ప్రశ్నలకు అది సమాధానం కాదు

అమరావతి శంఖుస్థాపన కార్యక్రమానికి తను ఆహ్వానించవద్దని, ఆహ్వానించినా తను రానని, రాకపోతే తనపై రాళ్ళు విసరవద్దని జగన్మోహన్ రెడ్డి ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఒక బహిరంగ లేఖ వ్రాసారు. ఆ లేఖలో జగన్ ప్రస్తావించిన అంశాలను ఎవరూ కాదనలేరు. రాజధాని నిర్మాణానికి అవసరమయిన డబ్బు కేంద్రప్రభుత్వం ఇస్తానని భరోసా ఇస్తుంటే చంద్రబాబు సింగపూర్ సంస్థలకి పనులు అప్పగించి అందుకు బదులుగా రైతుల భూములు వాటికి ఎందుకు అప్పగిస్తున్నారు? రాజధానిలో సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు వగైరా భవానాలు,మౌలిక సదుపాయాల కోసం అవసరమయినంత భూమిని మాత్రమే సేకరించి, మిగిలిన భూమిని రైతులకే అప్పగించకుండా చంద్రబాబు నాయుడు వారి భూములు తీసుకొని డెవలప్మెంట్ చేసి వారికి లాభాలు కలిగిస్తానని చెపుతూ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎందుకు చేస్తున్నారు? అని ప్రశ్నించారు. రైతుల ఉసురు పోసుకొని వారి పంట భూములపై రాజధాని నిర్మించడం చాలా తప్పని అందుకే తన నిరసనను తెలియజేస్తూ శంఖుస్థాపన కార్యక్రమానికి హాజరు కాదలచుకాలేదని అన్నారు. జగన్మోహన్ రెడ్డి శంఖుస్థాపన కార్యక్రమానికి రానని చెప్పడం ద్వారా తను రాజధాని నిర్మాణానికి, రాష్ట్రాభివృద్ధికి ఉద్దేశ్యపూర్వకంగానే ఆటంకం కలిగిస్తున్నానని స్వయంగా ప్రకటించుకొన్నట్లయింది. దాని వలన ప్రజలకు ఆయనపై దురాభిప్రాయం,విముకత ఏర్పడేందుకు అవకాశం కల్పించారని చెప్పవచ్చును.

దానికి తెదేపా ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వెంటనే జవాబిచ్చారు. రాజశేఖర్ రెడ్డి హయంలో సెజ్ ల ఏర్పాటు కోసం రైతులకు చెందిన వేలాది ఎకరాలు సేకరించారని కానీ తమ ప్రభుత్వం రైతుల అంగీకారంతోనే భూములు తీసుకోందని అన్నారు. తెలంగాణా రాష్ట్ర మంత్రులు కూడా రాజధాని శంఖుస్థాపన కార్యక్రమానికి వస్తున్నారని కానీ ఆంద్రప్రదేశ్ కి చెందిన జగన్మోహన్ రెడ్డి ఏవో కుంటిసాకులు చెప్పి రాష్ట్రానికి చెందిన ఈ కార్యక్రమానికి రానని గొప్పగా చెప్పడం శోచనీయం అని అన్నారు.

రాజశేఖర్ రెడ్డి హయంలో పరిశ్రమల స్థాపన కోసం రాష్ట్ర వ్యాప్తంగా వేలాది ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించి క్విడ్ ప్రో పద్దతిలో అపాత్రాదానం చేసింది. జగన్మోహన్ రెడ్డితో సహా అనేకమంది నేతలు, అధికారులు, పారిశ్రామికవేత్తలు నేటికీ ఆ కేసులలో సీబీఐ కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అప్పుడు రాజశీఖర్ రెడ్డి సెజ్ ల కోసం రైతుల భూములు లాక్కొంటే ఇప్పుడు తెదేపా ప్రభుత్వం రాజధానికి, పోర్టులు, విమానాశ్రయాల కోసం రైతుల భూములు తీసుకొంటోంది. కనుక ఏ పార్టీ అధికారంలో ఉన్నా అందరి దృష్టి రైతుల భూములపైనే ఉంటుందని స్పష్టం అవుతోంది. అటువంటప్పుడు జగన్ రైతులకి అన్యాయం అయిపోతోందని మొసలి కన్నీళ్లు కార్చడం హాస్యాస్పదం.

అయితే జగన్ సంధించిన ఎనిమిది ప్రశ్నలకు సోమిరెడ్డి చెప్పినది జవాబు కాదు. జగన్ నోరు మూయించడానికి చేస్తున్న ఎదురుదాడి మాత్రమే. అదే ఒకవేళ పవన్ కళ్యాణ్ ఇవే ప్రశ్నలు అడిగి ఉండి ఉంటే సోమిరెడ్డి సమాధానం వేరేగా ఉండేదేమో అసలు ఉండేది కాదేమో కూడా. ఇంతకీ పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమానికి హాజరవుతారో లేక ఆయన కూడా జగన్ లాగే తప్పించుకొంటారో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close